Today Horoscope : ఆ రాశి వారికి ఆప్తుల నుంచి శుభవార్తలు

Today Horoscope : ఆ రాశి వారికి ఆప్తుల నుంచి శుభవార్తలు

 

మేషం – 01-01-2022

Today Horoscope : చేపట్టిన పనులు ముందుకు సాగవు. కొన్ని వ్యవహారాలలో సొంత నిర్ణయాలు అంతగా కలిసి రావు. కుటుంబసభ్యులతో స్వల్ప విభేదాలు ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు వలన నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు.

వృషభం – 01-01-2022

చేపట్టిన పనులలోశ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో ఆశించిన పురోభివృద్ధి కలుగుతుంది. ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి బయట పడగలుగుతారు.

మిధునం – 01-01-2022

సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. విందువినోదాది కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు.

కర్కాటకం – 01-01-2022

దూర ప్రయాణాలు వాయిదా వేస్తారు. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు పనిచేయవు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారపరంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు నష్టాలను మిగులుస్తాయి. ఉద్యోగాలలో అధికారుల నుండి సమస్యలు పెరుగుతాయి.

సింహం – 01-01-2022

చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. పనులలో వ్యయప్రయాసలు అధికమౌతాయి. బంధువుల నుంచి ఋణ ఒత్తిడులు అధికమౌతాయి. నిరుద్యోగులకు నిరుత్సాహం తప్పదు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపార ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

కన్య – 01-01-2022

వివాదాలకు సంబంధించి కీలక సమాచారం సేకరిస్తారు. ప్రముఖులతో పరిచయాలు అవుతాయి. సమాజంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

తుల – 01-01-2022

బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు కొంత నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో అదనపు పని భారం వలన తగిన విశ్రాంతి ఉండదు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.

వృశ్చికం – 01-01-2022

చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది.

ధనస్సు – 01-01-2022

ముఖ్యమైన వ్యవహారాలు వ్యయప్రయాసలతో కాని పూర్తి కావు. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు అధికమవుతాయి. ఆధ్యాత్మిక చింతన అవుతుంది. చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు తప్పవు.

మకరం – 01-01-2022

ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారమవుతాయి.

కుంభం – 01-01-2022

వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు ఉంటాయి. నూతన వాహనయోగం ఉన్నది. వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి. ఉద్యోగాలలో ఆశించిన పదవులు పొందగలుగుతారు. ఇతరుల సహాయ సహకారాలు అందుతాయి.

మీనం – 01-01-2022

చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. వాతావరణం గందరగోళంగా ఉంటుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో ఇతరుల నుండి ఊహించని సమస్యలు ఎదురవుతాయి నూతన ఋణ ప్రయత్నాలు అంతగా కలిసి రావు.

Girish-(Purohithulu) Sirimalli.com

Girish (Purohithulu) sirimalli.comGIRISH KULKARNI (PUROHITULU)

For More Updates Follow us on – Sirimalli Page