Vijay Devarakonda: ‘పూరీ జగన్నాధ్ ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్’: విజయ్ దేవరకొండ

Vijay Devarakonda: ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి ఎంతోమందికి ఇన్‌స్పిరేషన్‌గా నిలిచాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఎంతోమంది స్టార్ డైరెక్టర్ల చూపు విజయ్‌పై ఉంది. అంతే కాకుండా విజయ్ త్వరలోనే పూరీ జగన్నాధ్‌తో కలిసి చేస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అయితే పూరీ జగన్నాధ్, విజయ్ కాంబినేషన్‌లో మరో చిత్రం రానుంది అని ఎప్పటినుండో రూమర్స్ వినిపిస్తూ ఉండగా.. నేడు దానికి అధికారికంగా ప్రకటన వచ్చేసింది.

‘లైగర్’ సినిమాలో విజయ్ దేవరకొండ ఓ బాక్సర్‌గా నటించనున్నాడు. దీనికోసం చాలాకాలం తాను బాక్సర్‌గా కూడా ట్రైనింగ్ తీసుకున్నాడు. అంతే కాకుండా ఈ పాన్ ఇండియా సినిమాలో మైక్ టైసన్ కూడా నటించనున్నాడు. అందుకే లైగర్‌పై ఇప్పటికే ప్రేక్షకుల్లో చాలా అంచనాలు ఉన్నాయి. హీరోల యాటిట్యూడ్‌ను సూపర్‌గా చూపిస్తాడు పూరీ. యాటిట్యూడ్ కే బ్రాండ్ అంబాసిడర్‌లాగా ఉంటాడు విజయ్. అందుకే వీరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న లైగర్‌ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

పూరీ జగన్నాధ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌ను ఇష్టపడే వారికి మరో గుడ్ న్యూస్ వచ్చేసింది. పూరీ జగన్నాధ్ చాలాకాలం క్రితం మహేశ్ బాబు కోసం ‘జనగణమన’ అనే కథ రాసుకున్నాడు. కానీ రెండు సినిమాలు కలిసి చేసిన తర్వాత.. మహేశ్, పూరీ మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఇప్పటికీ అవి అలాగే ఉన్నాయి. అందుకే జనగణమన ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టేశాడు పూరీ.

Jana Gana Mana Motion Poster: https://youtu.be/lb_1hqSp39U

ఇంతకాలం తర్వాత జనగణమనకు సూట్ అయ్యే హీరో విజయ్ దేవరకొండ అని ఫిక్స్ అయ్యాడు పూరీ జగన్నాధ్. దీంతో తనతోనే ఈ సినిమాను తెరకెక్కించాలని నిర్ణయించుకున్నాడు. తాజాగా ఈ మూవీ అనౌన్స్‌మెంట్ ముంబాయిలో గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌లో పూరీ జగన్నాధ్ గురించి ఒక్క ముక్కలో చెప్పమని ఓ విలేఖరి అడగగా.. ‘పూరీ సార్ ఒక ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్’ అన్నాడు విజయ్ దేవరకొండ.

Vijay Devarakonda About Puri Jagannadh: https://www.instagram.com/reel/CbruFn2NwxY/?utm_source=ig_web_copy_link