Off Beat

Corona Virus : వార్నీ.. ఆ ఒక్క విటమిన్ విషయంలో జాగ్రత్తగా ఉంటే.. కరోనాను ఢీ కొట్టచ్చా?

Corona  vitamin : వార్నీ.. ఆ ఒక్క విటమిన్ విషయంలో జాగ్రత్తగా ఉంటే.. కరోనాను ఢీ కొట్టచ్చా?

నేను ఇందాక శాఖాహారులు – బి 12 లోపం – సైటోకిన్ స్ట్రామ్ పై పెట్టిన పోస్ట్ లో ఫేస్బుక్ మిత్రుడు ఒకాయన మంచి ప్రశ్న అడిగారు . మాంసాహారులు అయిన ఒక కమ్యూనిటీ పేరు చెప్పి వారిలో కూడా ఎందుకు మరణాలు ఎక్కువ వున్నాయి అని అడిగారు . దీనికి ఇది వరకే నేను సమాధానం చెప్పినా ఇంకో సారి అందరికీ ఉపయుక్తంగా ఉంటుందని ఈ పోస్ట్ పెడుతున్నా.

సిటీ లో నివసించే వారిలో 80 శాతం మందికి డి విటమిన్ లోపం ఉంటుంది . శరీరం పై ఎండ పడకుండా బతకడం దీనికి కారణం . డి విటమిన్ లోపం వల్ల జట్టు రాలిపోవడం . మూడ్ స్వింగ్స్ { అంటే ఆవేశం, ఉద్రేకం , డిప్రెషన్ లాంటివి} రావొచ్చు . కరోనా ప్రారంభం అయినప్పటి నుంచి నేను ట్రెండ్ ను జాగ్రత్తగా గమనించాను . ఇది ఎండలో కాయకష్టం చేసుకొనే వారి పై అతి తక్కువ ప్రభావం చూపుతోంది . అలాంటి వారికి సోకినా పెద్దగా ప్రభావం చూపలేదు . వొంటి పై ఎండ పడకుండా బతికే వారు దీనితో తీవ్ర అనారోగ్యానికి గురికావడాన్ని గత నెల ఏప్రిల్ నెల లోనే అర్థం చేసుకొన్నా .

vitamin--d
vitamin–d

డి విటమిన్ లోపం ఉంటే కరోనా కాటేస్తుంది . ఇలాంటి వారికి కరోనా సోకితే రక్తం లో క్లోట్స్ వచ్చే అవకాశం ఎక్కువ . రక్తం చిక్క పడితే దాని కి ఆక్సిజన్ సరఫరా చేసే సామర్థ్యం తగ్గిపోతుంది . అప్పుడు గుండె ఊపిరి తిత్తులు లాంటి భాగాలు ఆక్సిజన్ అందక తీవ్రంగా ప్రభావితం అవుతాయి. డి విటమిన్ కోసం ఎండ లో కూర్చోండి అంతకంటే ముఖ్యంగా ఎండ లో నడవండి అని నేను మే నుంచి ఇప్పటి దాకా వంద సార్లు చెప్పాను.

morrning--walking-2
morrning–walking-2

నగర వాసుల్లో కయ కష్టం చేయడం పెద్దగా ఉండదు . దీనితో శరీరం లో ముఖ్యంగా రక్త నాళాల్లో ఊపిరి తీతుల్లో కొవ్వు పేరుకొని పోతుంది . ఇలాంటి వారికీ కరోనా సోకితే అది ఊపిరి తిత్తుల్లో తన కొమ్ము తో బాగా అంటుకొని పోయి తన సంతానాన్ని వృద్ధి చేసుకొంటుంది . లావుగా ఉన్న వారికి కరోనా తీవ్రత ఎక్కువ .

అందుకే నేను ఎండ లో నడవండి . చేతనైతే జాగింగ్ చెయ్యండి . అని చెబుతూ వస్తున్నా .

ఎండ లో కూర్చుంటే కరోనా చచ్చి పోతుందట.. ఆహా హ హ అని అప్పుడు ఒక వ్యక్తి నా పై వ్యంగ్య కామెంట్స్ వదిలాడు . పాపం వున్నాడో.. పోయాడో తెలియదు . నేను బ్లాక్ చేయ లేదు . కానీ ఈ మధ్య లో కామెంట్స్ చెయ్యడం లేదు .

అయ్యా .. డి విటమిన్ – కరోనా గురించి , వ్యాయామం – కరోనా కరోనా గురించి ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదు . ఎందుకంటే దాన్ని శంఖం లో పోసేసారు . అదే తెల్ల దొరలు దాని పై పరిశోధన చేసి { నేను చెప్పానని కాదు లెండి . నేను ఒక కౌన్ కిస్కా గొట్టం గాడిని. నేనెంత ? నా రీచ్ ఎంత . సమస్య వున్నప్పుడు నిశిత ద్రుష్టి తో పరిశీలిస్తే అనేక విషయాలు తెలుస్తాయి .} తేల్చేసారు . ఇంకా అనుమానం దేనికి ?

vitiamin - D
vitiamin – D

నిప్పు , చక్రం , వ్యవసాయం , ఇనుము , నగరీకరణ .. ఇలా సవా లక్ష విషయాలు మనిషి నిశిత పరిశీలన ద్వారా తీసుకొని వచ్చిన ఆవిష్కరణలే . మా అమ్మమ్మ జలుబు వస్తే దగ్గు వస్తే ఏమి చెయ్యాలో చెప్పేది . ఆయుర్వేదం ఒక శాస్త్రం . మెడికల్ ఆంత్రోపాలజీ లో భాగంగా ప్రపంచం నలుచెరుగులా ఆదిమ { ట్రైబల్ } సమాజాల్లో ఉన్న వ్యాధి – చికిత్స విధానాలు అందులోని శాస్త్రీయత ను అధ్యనం చేసాము . అందులోని అనేక విషయాలు శాస్త్రీయంగా రుజువయ్యాయి . తెల్ల దొరలు పరిశోధన చేసి చెబితేనే శాస్త్రం .. ఫలానా మాగజైన్ లో ముద్రితం అయితేనే అది నిజం అంటే ఎలా ? కామన్ సెన్స్ ఉండనక్కర లేదా ?

morrning-exercise-1
morrning-exercise-1

ఎండ లో కూర్చుంటే చర్మం కరిగి పోదు . డి విటమిన్ కాస్త ఎక్కువ తీసుకొన్న పెద్దగా ఏమీ కాదు . రోజు వాట్సాప్ లో చేరి సొల్లు మెసేజ్ లు ఫార్వర్డ్ చేయడం కన్నా కాసేపు నడవండి అని చెప్పా . నడిస్తే కాళ్ళు అరిగిపోవు . కొవ్వు కరుగుతుంది .

మన దేశం లో నగరాల్లో కరోనా మరణాలు ఎక్కువ ఉండడానికి డి విటమిన్ లోపం ఇంకా ఒంట్లో కొవ్వే కారణం . తినడం ఇక్కడ ఒక రోగం . ఒకప్పుడు బతకడం తినే వారు . ఇప్పుడు చాలా మంది తినడం కోసం బతుకుతున్నారు . ఆ తినేది కూడా చెత్త .

morrning-walking-1
morrning-walking-1

స్టే సేఫ్ స్టే సేఫ్ అని సోది చెప్పడం కాదు .. ఇలాంటివి చెప్పండి .. ఇదే సేఫ్ అని నెత్తి నోరు బాదుకొన్నా. కొంత మంది పేస్ బుక్ మిత్రులు తప్పించి మిగతా వారు పట్టించుకోలేదు . సరే అప్పుడైతే అమర్నాథ్ అనే ఒక పనికి మాలిన వెదవ చెప్పాడు . ఏదో వాడి సెల్ఫ్ డబ్బా కోసం …. అందుకే పట్టించుకోలేదు . ఇప్పుడు దాన్ని తెల్ల దొరలు ఆమోదించారు . ఇప్పుడైనా గట్టిగా చెప్పి చావరేమి ? మరణాలు మరణాలు .. శవాలు అని మొసలి కన్నీరు కార్చడం కాదు . మనిషైతే మనసుంటే మార్గం చెప్పండి . జనాల్ని ఎడ్యుకేట్ చెయ్యండి .

good-morring
good-morring

ఇందాక మిత్రుడు అడిగిన ప్రశ్న కు సమాధానం . ఆయన చెప్పిన కమ్యూనిటీ లో వారు నాన్ వెజిటేరియన్ ఫుడ్ తిన్నా మరణాలు ఎక్కువగా ఉండడానికి కారణం . 1 . డి విటమిన్ లోపం . 2 . వొంట్లో ముఖ్యంగా ఊపిరి తిత్తుల్లో కొవ్వు ఎక్కువగా ఉండడం . ఇది ఆ కమ్యూనిటీ లోనే కాదు .. నగర వాసుల్లో ఎక్కువ గా వుంది . ఆ కమ్యూనిటీ లో ప్రారంభం లో ఎక్కువ మరణాలు జరగడానికి కారణం ఆ దశ లో వారిలో ముఖ్యంగా సోషల్ మీడియా లో కొన్ని మెసేజ్ లు సర్క్యూలేట్ అయ్యాయి . అసలు కరోనా అనేది నాటకం .. భూటకం .. దాన్ని పట్టించుకోవద్దు అని . దాన్ని నమ్మి వారు కనీసం ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేసుకోకుండా నష్ట పోయారు . ఇప్పడు ఆ కమ్యూనిటీ లో కూడా అవేర్నెస్ వచ్చింది .

అందరూ బాగుండాలి .. అప్పుడే మనం బాగుంటాం !

వాసిరెడ్డి అమరనాథ్ గారి ఫేసుబుక్ పోస్ట్

Also Read : Corona Virus : రోజూ ఇలా చేస్తూ ఉంటే.. కరోనా వచ్చినా మూడు రోజుల్లో మటాష్!

Also Read:Corona Virus : కరోనా బాధితులు.. ఏ స్వీట్ ని తింటే మళ్లీ వాసన, రుచిని వేగంగా పొందవచ్చు?

Also Read : Corona Virus : ఈ 2 రకాల పండ్లు, 3 రకాల పనులు చాలు.. బలమైన ఇమ్యూనిటీ మీ సొంతం

Also Read : Corona Rulls :అక్కడ ఉమ్మేశారా… రూ.500 కట్టాల్సిందే..!

Also Read : Sudheer Rashmi : జలజలజలపాతం సాంగ్ లో సుధీర్, రష్మీల కెమిస్ట్రీ అదుర్స్.. తొమ్మిదేళ్ల రిలేషన్ మరి!

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి.

https://www.facebook.com/SirimalliPage