Politics

Municipal Elections : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్.. మే 3న ఫలితాలు

Municipal Elections :  తెలంగాణలో మినీ పురపోరుకు తెరలేచింది. రాష్ట్రంలో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్, సిద్ధిపేట, అచ్చంపేట్, నకిరేకల్, కొత్తూరు, జడ్చెర్ల మున్సిపాలిటీలకు (Municipal Elections) ఎన్నికల కోసం ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈనెల 16 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఏప్రిల్ 30న ఎన్నికలు జరుగుతాయి. మే 3న ఫలితాలను ప్రకటిస్తారు.

మున్సిపాల్టీ ఎన్నికల ప్రక్రియ అంతా 15 రోజుల్లోనే ముగుస్తుంది. ఈనెల 18వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను వేసేందుకు గడువిచ్చారు. ఆ తరువాతి రోజు.. అంటే 19వ తేదీన నామినేషన్లను స్క్రూట్నీ చేస్తారు. 20 తేదీవరకు వాటిని ఉపసంహరించుకునేలా గడువు ఇచ్చారు. తరువాత అభ్యర్థుల ప్రకటన ఉంటుంది. ఎన్నికను మాత్రం ఈ నెల 30న నిర్వహించనున్నారు. ఎక్కడైనా రీపోలింగ్ నిర్వహించాల్సి వస్తే మే 2న జరుపుతారు. మే3న రిజల్ట్ ను అనౌన్స్ చేస్తారు.

ప్రభుత్వం కూడా రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసింది. కార్పొరేషన్లు 2, మున్సిపాలిటీలు ఐదింటిలో ఎన్నికల కోసం వార్డుల వారీ రిజర్వేషన్లను జిల్లాల కలెక్టర్లు ఖరారు చేశారు. ఈమేరకు గెజిట్ నోటిఫికేషన్ ను కూడా జారీ చేశారు. మహిళా రిజర్వేషన్ల కోసం లాటరీ కూడా తీశారు. కొత్తూరు జనరల్ మహిళకు, జడ్చర్ల బీసీ మహిళకు, నకిరేకల్ బీసీ జనరల్ కు రిజర్వ్ చేశారు. పురపాలక మంత్రిత్వ శాఖ ఈమేరకు గెజిట్ నోటిఫికేషన్ ను జారీ చేసింది. ప్రభుత్వం నుంచి రిజర్వేషన్ల వివరాలు అందడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా వెంటనే నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

Also Read : Corona Bharatham : మహాభారతంలోని ఈ రెండు కథలు చదివితే.. కరోనా పై యుద్ధం ఎలా చేయాలో తెలుస్తుంది

Also Read : Nabha Natesh : పసుపుపచ్చ కోకలో కుర్రకారుకు పిచ్చెక్కించే ఫోజులిచ్చిన ఇస్మార్ట్ బ్యూటీ

Also Read : దేశవ్యాప్తంగా భారీగా పెరిగిన కరోనా కేసులు.. ఇలా అయితే బతికినట్టే పో.. !

Also Read : Nivetha Thomas : నాలో టాలెంట్ ఉంది.. కానీ, వకీల్ సాబ్ వల్ల..

Also Read : Akhanda Teaser : అఖండ టీజర్ లో యాక్షన్, డైలాగ్స్ తో దుమ్మురేపిన బాలయ్య బాబు

Also Read : Singer Mano Assets : సింగర్ మనో దగ్గర కోట్ల ఆస్తులు.. ఎలా సంపాదించారంటే?

మరింత తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి.

https://www.facebook.com/SirimalliPage