Politics

KTR : మంత్రి కేటీఆర్ కు కరోనా.. ట్విట్టర్ ద్వారా వెల్లడించిన మంత్రి

KTR : తెలంగాణ మంత్రి కేటీఆర్ కు కరోనా సోకింది. కొవిడ్-19 పరీక్షల్లో తనకు కరోనా సోకినట్లు నిర్థారణ అయ్యిందని ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. స్వల్ప లక్షణాలే ఉండడంతో ఆయన (KTR) ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ఈమధ్య కాలంలో తనను కలిసినవారంతా టెస్టులు చేయించుకోవాలని కోరారు. కొవిడ్ నిబంధనలు పాటించాలన్నారు.

కొద్ది రోజుల కిందే సీఎం కేసీఆర్ కూ కరోనా సోకింది. ఎర్రవల్లిలోని తన నివాసంలో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈమధ్యనే ఆయన సాధారణ వైద్య పరీక్షలు కూడా చేయించుకున్నారు.

కరోనా తొలిదశలో కేటీఆర్ హైదరాబాద్ లో తగిన ఏర్పాట్లు చేయడంలో చాలా చురుగ్గా వ్యవహరించారు. గల్లీ గల్లీ తిరుగుతూ అధికారులకు పనులు పనులు పురమాయిస్తూ.. పారిశుధ్యంతోపాటు
ఇతర సదుపాయాల విషయంలో ఎక్కడా లోటు రాకుండా జాగ్రత్త పడ్డారు. వలస కూలీల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకున్నారు. వారికి తగిన భోజన, వసతి సదుపాయాలు కల్పించడానికి కృషి చేశారు.

కొవిడ్ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే అభివృద్ధి పనులు ఆగకుండా ప్రణాళికలు రూపొందించారు. ఆయన వేసుకునే చేనేత మాస్కులకు మంచి డిమాండ్ ఏర్పడింది. అందరూ మాస్కులు వేసుకోవాలని, భౌతిక దూరం పాటించాలని పదే పదే విజ్ఞప్తి చేసేవారు. కరోనా సీజన్ మొదలైనప్పటి నుంచి ఆయన ఇంటి నుంచి బయటకు అడుగుపెడితే కచ్చితంగా మాస్కు వేసుకునేవారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంతోపాటు ఇతర ఎన్నికల ప్రచారాల్లోనూ తగిన జాగ్రత్తలు తీసుకున్నారు కేటీఆర్. కానీ కరోనా సెకండ్ వేవ్ చాలా ఉధృతంగా ఉండడంతో చాలామంది దీని బారిన పడుతున్నారు.

ఇవి కూడా చదవండి :

Also Read : Corona Virus : రోజూ ఇలా చేస్తూ ఉంటే.. కరోనా వచ్చినా మూడు రోజుల్లో మటాష్

Also Read : Corona vitamin : వార్నీ.. ఆ ఒక్క విటమిన్ విషయంలో జాగ్రత్తగా ఉంటే.. కరోనాను ఢీ కొట్టచ్చా?

Also Read : Today Horoscope : 23-04-2021 శుక్రవారం నేటి రాశిఫలాలు

Also Read : Today Panchangam : 23-04-2021 శుక్రవారం నేటి పంచాంగం

Also Read : Today Amrutha Gadiyalu : అమృత ఘడియలు, శుభ సమయములు.. ఈ రోజు అమృత ఘడియలను చూస్తే..

Also Read : Dhee kings vs queens : ప్రియమణి ముద్దులు, రష్మీ కన్నీళ్లు.. ఢీ-13 కింగ్స్ వర్సెస్ క్వీన్స్ లో డ్యాన్స్ బాగా చేస్తే.. రూ.4లక్షలు ఇచ్చిన మాస్టర్.

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/SirimalliPage