Politics

TRSలో TDLP విలీనం..!

TRSలో TDP శాసనసభాపక్షం( TDLP)విలీనమైంది. TDP నుంచి గెలిచిన సండ్ర వెంకటవీరయ్య, మచ్చా నాగేశ్వరరావు టీడీఎల్పీని విలీనం చేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి లేఖ రాశారు. కాసేపట్లో మచ్చా నాగేశ్వరరావు TRSలో చేరనున్నారు. ఇప్పటికే సండ్ర TRS పార్టీలో చేరారు. సండ్ర సత్తుపల్లి నుంచి, మచ్చా అశ్వారావుపేట నుంచి టీడీపీ తరపున పోటీ చేసి గెలిచారు. 2018లో తెలంగాణలో TDP నుంచి గెలిచింది వీరిద్దరే.