Tamil Actor Vivek : తమిళ సినీ కమెడియన్ వివేక్ కన్నుమూత

Tamil Actor Vivek : ప్రముఖ తమిళ సినీ కమెడియన్ వివేక్ కన్నుమూశారు. శుక్రవారం నాడు ఆయనకు గుండెపోటు వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు.. చెన్నైలోని వడపళనిలో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఆ వెంటనే ఓ ప్రత్యేక వైద్య బృందం ఆయనకు చికిత్సను అందించింది. కానీ అప్పటికే ఆయన (Tamil Actor Vivek) పరిస్థితి విషమంగా మారింది. అయినా వైద్యులు శతవిధాలా ప్రయత్నించారు.

Tamil Actor Vivek Admitted In ICU A Day After Taking Vaccination - Gulte

వివేక్ కు ముందుగా యాంజియో చేశారు. తరువాత ఎక్మో ద్వారా చికిత్సను అందించారు. 24 గంటలు గడిచిన తరువాతే ఆయన ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు చెప్పగలమని డాక్టర్లు ముందే చెప్పారు. చివరకు ట్రీట్ మెంట్ తీసుకుంటూనే ఆయన మృతి చెందారు. దీంతో తమిళ చిత్రపరిశ్రమ షాక్ కు గురైంది. అయితే కరోనా వ్యాక్సిన్‌ వేసుకోవడం వల్ల ఇలా జరగలేదని.. ఇది గుండెపోటు మాత్రమే అని వైద్యులు వివరణ ఇచ్చారు.

తమిళ సినీ పరిశ్రమలో దాదాపు అందరితోనూ వివేక్ కు మంచి అనుబంధం ఉంది. 59 ఏళ్ల వివేక్ తమిళంలో పాపులర్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్నారు. వడివేలు తరువాత అంత క్రేజ్ ఉన్నది ఆయనకే. గురువారం నాడే ఆయన కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్నారు. అప్పుడే ఆయన వ్యాక్సిన్ పై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు.. అందరూ టీకా తీసుకోవాలని విజ్ఞప్తి కూడా చేశారు. కానీ తరువాతి రోజే ఆయనకు గుండెపోటు రావడం, ఆ తరువాతి రోజే మృతి చెందడం.. అభిమానులను కలిచివేస్తోంది. కొన్నేళ్ల కిందట వివేక్ తల్లి, కొడుకు ప్రసన్నకుమార్ చనిపోయారు. అప్పటి నుంచి వివేక్ తన ఆరోగ్యంపై సరిగా దృష్టి పెట్టలేకపోయారు.

సినిమాలను చేస్తూ.. తన జీవితంలోని చేదు జ్ఞాపకాలను చెరిపేసుకునే ప్రయత్నం చేశారు వివేక్. కానీ.. ఇప్పుడు అంతగా సినిమాలు కూడా చేయడం లేదు. నిజానికి ఆయన చాలా మంది నటుడు. అందుకే 2009లోనే కేంద్రం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. వివేక్.. తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అపరిచితుడు, శివాజీ, సింగం, సింగం-2, విశ్వాసం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.

ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్ పరిచయం చేసిన నటుల్లో వివేక్ కూడా ఉన్నారు. ‘మనదిల్ ఉరుది వేండం’ ద్వారా తమిళ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. రజనీకాంత్, కమలహాసన్, విజయ్, అజిత్.. ఇలా ఎందరో సూపర్ స్టార్లతో కలిసి వెండితెరను పంచుకున్నారు. 300కు పైగా సినిమాల్లో నటించిన వివేక్ కు యాక్టింగ్ అంటే ప్రాణం.

కామెడీ సీన్లలోనూ ఏదైనా సందేశాన్ని చెప్పడమే ఆయన ప్రత్యేక శైలి. అందుకే చాలా సీన్లను ఆయనే స్వయంగా రాసుకునేవారు. ఒకానొక సమయంలో వివేక్ లేని తమిళ సినిమాయే విడుదల కాలేదంటే ఆయనకు ఎంత డిమాండ్ ఉండేదో అర్థం చేసుకోండి. పెద్ద హీరోలు కూడా తమ పక్కన కమెడియన్ గా వివేక్ పేరునే సిఫార్స్ చేసేవారు. వివేక్ వల్ల తమ సినిమాకు ప్లస్ అవుతుందని ప్రొడ్యూసర్లు కూడా నమ్మేవారు.

వివేక్ కు గుండెపోటు అని తెలియగానే చిత్ర పరిశ్రమలో చాలామంది.. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ‘చిన్న కలైవాణర్’ గా పిలిచే వివేక్ కు ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకున్నా.. వారి ప్రార్థనలు ఫలించలేదు. వివేక్ మృతితో తమిళ చిత్రపరిశ్రమ ఓ మంచి నటుడిని కోల్పోయింది.

 

ఇవి కూడా చదవండి : 

Also Read : Sudheer Rashmi : జలజలజలపాతం సాంగ్ లో సుధీర్, రష్మీల కెమిస్ట్రీ అదుర్స్.. తొమ్మిదేళ్ల రిలేషన్ మరి!

Also Read : Today Horoscope : 17-04-2021 శనివారం .. నేటి రాశి ఫలాలు

Also Read : Today Amrutha Gadiyalu : అమృత ఘడియలు, శుభ సమయములు.. ఈ రోజు చౌ ఘడియలను చూస్తే..

Also Read : Today Panchangam : 17-04-2021 శనివారం నేటి పంచాంగం

Also Read : Nivetha Thomas : నాలో టాలెంట్ ఉంది.. కానీ, వకీల్ సాబ్ వల్ల..

Also Read : Singer Mano Assets : సింగర్ మనో దగ్గర కోట్ల ఆస్తులు.. ఎలా సంపాదించారంటే?

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/SirimalliPage