Cinema

Tamil Actor Vivek : తమిళ సినీ ఇండస్ట్రీలో టాప్ కమెడియన్ వివేక్ కు గుండెపోటు

                     Tamil Actor Vivek : తమిళ సినీ ఇండస్ట్రీలో టాప్ కమెడియన్ వివేక్ కు గుండెపోటుVivek: Tamil comedy star Vivek is doing Jagathy's role | Malayalam Movie News - Times of India

Tamil Actor Vivek : తమిళ సినీ ఇండస్ట్రీలో టాప్ కమెడియన్ వివేక్ కు గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను చెన్నైలోని సిమ్ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. వైద్యుల రిపోర్ట్ ప్రకారం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతానికి వివేక్ కు ఐసీయూలో చికిత్సను అందిస్తున్నారు. ప్రత్యేక వైద్యుల బృందం ఆయనను ట్రీట్ మెంట్ ను ఇస్తోంది. వివేక్ కు (#Tamil Actor Vivek,) హార్ట్ ఎటాక్ వచ్చిందని తెలియగానే.. తమిళ ఇండస్ట్రీ షాక్ కు గురైంది.

అందర్నీ నవ్విస్తూ ఎప్పుడూ సరదాగా ఉండే వివేక్ ఇలా అనారోగ్యానికి గురవ్వడం వారిని కలిచివేస్తోంది. తమిళ సినీ పరిశ్రమలో దాదాపు అందరితోనూ ఆయనకు మంచి అనుబంధం ఉంది. 59 ఏళ్ల వివేక్ తమిళంలో పాపులర్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్నారు. వడివేలు తరువాత అంత క్రేజ్ ఉన్నది ఆయనకే. ఇప్పటికే 240కి పైగా సినిమాలను చేశారు.

 

Popular comedian Vivek set to get into a new avatar as director soon? | Tamil Movie News - Times of India

గురువారం నాడే ఆయన కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్నారు. అప్పుడే ఆయన వ్యాక్సిన్ పై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు.. అందరూ టీకా తీసుకోవాలని విజ్ఞప్తి కూడా చేశారు. కానీ తరువాతి రోజే ఆయన అనారోగ్యానికి గురవ్వడం అభిమానులను కలిచివేస్తోంది. కొన్నేళ్ల కిందట వివేక్ తల్లి, కొడుకు ప్రసన్నకుమార్ చనిపోయారు. అప్పటి నుంచి వివేక్ తన ఆరోగ్యాన్ని సరిగా పట్టించుకోలేదు.

సినిమాలను చేస్తూ.. తన జీవితంలోని చేదు జ్ఞాపకాలను చెరిపేసుకునే ప్రయత్నం చేశారు వివేక్. కానీ.. ఇప్పుడు అంతగా సినిమాలు కూడా చేయడం లేదు. నిజానికి ఆయన చాలా మంది నటుడు. అందుకే 2009లోనే కేంద్రం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. వివేక్.. తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అపరిచితుడు, శివాజీ లాంటి సినిమాలు చేయడం వల్ల తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.

Chennai will not abandon people, who believed the city, says actor Vivek | Tamil Movie News - Times of India

ఒకానొక సమయంలో వివేక్ లేని తమిళ సినిమాయే విడుదల కాలేదంటే ఆయనకు ఎంత డిమాండ్ ఉండేదో అర్థం చేసుకోండి. పెద్ద హీరోలు కూడా తమ పక్కన కమెడియన్ గా వివేక్ పేరునే సిఫార్స్ చేసేవారు. వివేక్ వల్ల తమ సినిమాకు ప్లస్ అవుతుందని ప్రొడ్యూసర్లు కూడా నమ్మేవారు. అందుకే ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులతో పాటు తమిళ సినీ ఇండస్ట్రీ ఆ భగవంతుడిని ప్రార్థిస్తోంది.

 

Also Read : Nabha Natesh : పసుపుపచ్చ కోకలో కుర్రకారుకు పిచ్చెక్కించే ఫోజులిచ్చిన ఇస్మార్ట్ బ్యూటీ

Also Read : Also Read : ఎర్ర చీరలో పిచ్చెక్కిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ..!

Also Read : Nivetha Thomas : నాలో టాలెంట్ ఉంది.. కానీ, వకీల్ సాబ్ వల్ల..

Also Read : Singer Mano Assets : సింగర్ మనో దగ్గర కోట్ల ఆస్తులు.. ఎలా సంపాదించారంటే?

 

మరింత తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి.

https://www.facebook.com/SirimalliPage