Cinema

Sudheer Rashmi : జలజలజలపాతం సాంగ్ లో సుధీర్, రష్మీల కెమిస్ట్రీ అదుర్స్.. తొమ్మిదేళ్ల రిలేషన్ మరి!

Sudheer Rashmi : ఉప్పెన సాంగ్ లో వైష్ణవ్ తేజ్, కృతిశెట్టిల జలజలజలపాతం సాంగ్ గుర్తుందిగా.. అయినా దానిని అంత తొందరగా ఎలా మరిచిపోతారులెండి. సాంగ్ లో ఉన్న ఆ స్టోరీ.. హీరో, హీరోయిన్ల మధ్య ఉన్న కెమిస్ట్రీ అలాంటిది కదా. మరి ఆ సాంగ్ లో సుధీర్, రష్మీలు (Sudheer Rashmi) యాక్ట్ చేస్తే ఎలా ఉంటుంది? అబ్బా.. సూపర్ అంటారా! మీ కోసం ఓ ఎంటర్ టైన్ మెంట్ ఛానల్ ఆ ప్రయోగం కూడా చేసేసింది.

sudheer and rashmi lovely scene
sudheer and rashmi lovely scene

జలజలజలపాతం నువ్వు.. సెలసెలసెలయేరును నేను అంటూ సుధీర్, రష్మీలు.. సాగరం మధ్యలో పడవలో ఏకాంతంగా వేసుకున్న సాంగు.. సింప్లీ సూపర్బ్! అబ్బ! అబ్బో! అబ్బబ్బో! ఈ సాంగుంది చూశారు.. దానికదే సాటిలెండి. అందుకే కదా థియేటర్లను ఓ ఊపు ఊపింది. జలపాతంలా కలెక్షన్ల వర్షం కురిపించింది. అలాంటిది వీళ్లిద్దరూ టీవీలో చేస్తే మాత్రం.. వాళ్ల హుషారు.. సాంగు జోరు మాత్రం ఆగుతుందా? టీఆర్పీ రేటింగులు దూసుకుపోతాయి. యూట్యూబ్ లో వ్యూస్ మిలియన్ల కొద్దీ వచ్చిపడుతున్నాయి.

Rashmi And Sudheer Romantic Scene
Rashmi And Sudheer Romantic Scene

ఒరిజినల్ గా చూస్తే వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి ల మధ్య నడి సంద్రంలో ఇరుకు పడవలో సాగే ఈ సాంగ్ కేక పెట్టించింది. ఆ దృశ్యాలను చూసేవాళ్ల గుండెల్లో సెగలు పుట్టించింది. మళ్లీ అంతలా.. అలా అలా మనసును టచ్ చేసింది మాత్రం సుధీర్, రష్మీల యాక్టింగ్. అయినా వీళ్ల మధ్య ఆన్ స్క్రీన్ రిలేషన్ ఈనాటిదా.. తొమ్మిదేళ్ల చరిత్రుంది దానికి. అంటే.. నైన్ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ. అందుకే టీవీలో వీళ్లద్దరూ కనిపిస్తే చాలు.. ఆడియన్స్ అతుక్కుపోతారు.

Rashmi with Sudheer Lovely Scene
Rashmi with Sudheer Lovely Scene

జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, ఢీ.. ఇలా ఏ షో అయినా వీళ్ల మధ్య కెమిస్ట్రీ ఉంటేనే ఆ ప్రోమో కాని, షో కాని పేలుతుంది. అందుకే ఈ సాంగ్ లో సుధీర్, రష్మిలు ఆ స్థాయిలో కేక పుట్టించారు. అందులోనూ నలుపు రంగు చీర, నల్లని బొట్టు, క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో కృతినే మరిపించేసింది. సాంగ్ మధ్యలో ఓ మెరుపు మెరుస్తుంది. అంతే ఛటుక్కున సుధీర్ షర్టు పట్టుకుని.. లటుక్కున వాటేసుకుంటుంది రష్మి. ఆ సీన్ తీశారు.. చూశారూ… అబ్బో కేకస్య.. కేకోభ్యః.

Sudheer in Uppena Song
Sudheer in Uppena Song

ఈ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేసినప్పుడు అదిరిపోయింది. ఇక ఆ షోను డైరెక్ట్ గా చూపిస్తే మాత్రం ఆగుతుందా? స్టేజ్ దద్దరిల్లుతుంది. అందుకే హీరో నాని కూడా బాగుందంటూ కాంప్లిమెంట్ ఇచ్చేశాడు. ఇక ఈ షో చివరిలో రష్మి ఓ డైలాగ్ చెబుతుంది.. నువ్వు ముసలోడివి అవ్వకూడదంటూ సుధీర్ వైపు చూస్తూ… సిగ్గుపడుతూ.. హొయలొలికిస్తుంది. ఆ సీన్ మాత్రం చూడాల్సిందేనబ్బా!

sudheer rashmi cute Looks
sudheer rashmi cute Looks

కొద్ది రోజుల కిందటే ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమో వచ్చింది. అందులో అయితే రష్మి, సుధీర్ జంట పెళ్లి మీదే టాపిక్ నడిచింది. మధ్యలో రాకేష్ మాస్టర్ డైలాగ్స్ హీట్ ని పెంచాయి. అసలే.. వీళ్లిద్దరి పెళ్లి ఎప్పుడు అవుతుందా అని టీవీ వుడ్ లో తెగ చర్చ నడుస్తోంది. అఫ్ కోర్స్ అదంతా ఆన్ స్క్రీన్ రొమాన్స్ కే అనుకోండి. అయినా సరే.. ఆ ప్రోమోలో వాళ్ల మధ్య నడిచిన కెమిస్ట్రీ, డైలాగ్స్ మాత్రం కేక పుట్టించాయి.

 

Also Read : Nivetha Thomas : నాలో టాలెంట్ ఉంది.. కానీ, వకీల్ సాబ్ వల్ల..

Also Read : Akhanda Teaser : అఖండ టీజర్ లో యాక్షన్, డైలాగ్స్ తో దుమ్మురేపిన బాలయ్య బాబు

Also Read : Singer Mano Assets : సింగర్ మనో దగ్గర కోట్ల ఆస్తులు.. ఎలా సంపాదించారంటే?

 

మరింత తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి.

https://www.facebook.com/SirimalliPage