Cinema

Sonu Sood : యాక్టర్ సోనూ సూద్ కి కరోనా పాజిటివ్.. ఇప్పటికే క్వారంటైన్ లో..

Sonu Sood : యాక్టర్ సోనూ సూద్ కి కరోనా పాజిటివ్.. ఇప్పటికే క్వారంటైన్ లో..

No description available.

Sonu Sood : యాక్టర్ సోనూ సూద్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈమధ్యనే ఆచార్య సినిమా షూటింగ్ లో కూడా ఆయన పొల్గొన్నారు. అయితే కరోనా కేసులు పెరుగుతుండడంతో ఆయన కూడా టెస్ట్ చేయించుకున్నారు. దీంతో ఆయనకు పాజిటివ్ వచ్చింది. కానీ ముందు జాగ్రత్తగా సోనూసూద్ (Sonu Sood) ఇప్పటికే క్వారంటైన్ లో ఉన్నారు. అందుకే తన గురించి ఎవరూ ఆందోళన చెందవద్దని చెప్పారు తనకు కరోనా వచ్చిన విషయాన్ని సోనూసూద్ ట్విట్టర్ వేదికగా చెప్పారు. ఇప్పటికే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం వల్ల సమస్యలు లేవన్నారు. ఇప్పుడు తనకు మరింత మందికి సహాయం చేయడానికి, సమస్యలను పరిష్కరించడానికి తగిన సమయం దొరికిందన్నారు సోనూసూద్.

No description available.

కరోనా నుంచి తప్పించుకోవాలంటే ఇళ్లలోనే ఉండాలని చెప్పారు. కిందటేడాది కరోనా కష్ట కాలంలో సోనూసూద్ చాలా మందికి సహాయం అందించారు. ఎంతోమంది వలస కూలీలను వారి స్వస్థలాలకు పంపించారు. దీనికోసం ప్రత్యేకంగా బస్సులు, రైళ్లను సమకూర్చారు. మరికొంతమందిని విమానాల ద్వారా కూడా పంపించారు. ఎంతోమందికి భోజనాలు పెట్టించారు. ఇలా ఎన్నో రూపాల్లో ఎంతోమందికి సహాయం అందించారు. చాలామంది తమకు ఉపాధి లేదని చెప్పడమే ఆలస్యం.. వారికి ఏదో ఒక ఉపాధి మార్గాన్ని చూపించారు. దీనికోసం ఎవరూ చేయలేని విధంగా.. ఇంకా చెప్పాలంటే ప్రభుత్వాల వల్ల కూడా సాధ్యం కాని రీతిలో కోట్ల రూపాయిలను ఖర్చుపెట్టి ఆగమేఘాల మీద హెల్ప్ చేశారు. అందుకే కిందటేడాది దేశమంతా ఆయనకు జేజేలు పలికింది. మానవత్వం అంటే ఎలా ఉంటుందో సోనూ సూద్ రూపంలో కనిపించిందంటూ అందరూ మెచ్చుకున్నారు. సినిమాల్లో విలన్ క్యారెక్టర్లు వేసినా.. నిజ జీవితంలో హీరోగా మంచి పేరు సంపాదించుకున్నాడు సోనూసూద్. ఇప్పటికీ తనకు చేతనైనంత రీతిలో సహాయం అందిస్తూనే ఉన్నాడు. కానీ ఇలాంటి కష్టకాలంలో అప్పటిలా చాలామందికి సహాయం చేయలేకపోతున్నానంటూ ట్వీట్ చేశాడు. అవసరమైన వారికి అందరూ తగిన సహాయాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరాడు. నిజానికి సోనూసూద్ స్పూర్తితో చాలా మంది దాతలు ముందుకు వచ్చారు. సహాయం చేయడంలో ఉన్న ఆనందం ఏమిటో చూశారు. అప్పటి నుంచి కరోనా బాధితుల పట్ల కాని, లేదా కరోనా పరిస్థితుల్లో చిక్కుకున్నవారికి కాని.. ఎవరికి తోచినంతగా వారు సహాయం చేస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడు సోనూసూద్ కు కరోనా పాజిటివ్ అని తెలియడంతో అభిమానులు ఆందోళన పడుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ తో పాటు ప్రముఖులు కూడా కోరుతున్నారు.

 

Also Read :Pawan Kalyan : పవన్ కల్యాణ్ కు కరోనా పాజిటివ్.. అప్పుడప్పుడు ఆక్సిజన్ ను.

Also Read : Sudheer Rashmi : జలజలజలపాతం సాంగ్ లో సుధీర్, రష్మీల కెమిస్ట్రీ అదుర్స్.. తొమ్మిదేళ్ల రిలేషన్ మరి!

Also Read : Today Horoscope : 17-04-2021 శనివారం .. నేటి రాశి ఫలాలు

Also Read : Today Amrutha Gadiyalu : అమృత ఘడియలు, శుభ సమయములు.. ఈ రోజు చౌ ఘడియలను చూస్తే..

Also Read : Today Panchangam : 17-04-2021 శనివారం నేటి పంచాంగం

Also Read : Nivetha Thomas : నాలో టాలెంట్ ఉంది.. కానీ, వకీల్ సాబ్ వల్ల..

Also Read : Singer Mano Assets : సింగర్ మనో దగ్గర కోట్ల ఆస్తులు.. ఎలా సంపాదించారంటే?

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/SirimalliPage