Monitor Lizard : ఆరడుగుల పొడవైన అడవి బల్లి.. థాయ్ లాండ్ లోని షాపులోకి వెళ్లి..

Monitor Lizard : మీరు గాడ్జిల్లా సినిమా చూశారా! అబ్బో! దానిని ఓ రేంజ్ లో తీశారు లెండి. ఎప్పుడో అంతరించిపోయిన జాతిని.. మన పక్కనే ఉన్నట్టుగా ఊహించుకునే లెవల్లో గ్రాఫిక్స్ మాయాజాలం చేశారు. ఆ తరువాత అలాంటి సినిమాలు చాలా వచ్చాయి. కాకపోతే గాడ్జిల్లాలను ఎవరూ చూసుండకపోవచ్చు కాని.. అలాంటి భారీ ఆకారంతో ఉండే అడవి బల్లులను (Monitor Lizard) మాత్రం చూడొచ్చు. జూలో కాదు.. నిజంగానే. థాయ్ లాండ్ లోని ఆ షాపులో చూస్తే మీకు అర్థమవుతుంది.

అడవి బల్లి.
అడవి బల్లి.

థాయ్ లాండ్ లోని ఓ షాపులోకి ఆరడుగుల పొడవైన భారీ శరీరం కలిగిన అడవి బల్లి చటుక్కున వచ్చేసింది. దీంతో అక్కడున్నవారికి గుండె ఆగినంత పనైంది. నోట మాటే కరువైంది. ఎందుకంటే ఆరడుగుల పొడవంటే మాటలు కాదు. పోనీ అదేమైనా స్లోగా వెళుతోందా.. గబగబా పాకేస్తోంది. దాంతో.. అక్కడున్నవారికి మరింత కంగారు ఎక్కువైంది. పొరపాటున అది తమవైపే వచ్చేస్తే ఏమవుతుందో అన్న భయం మొదలైంది.

ఆ అడవి బల్లికి ఇవేవీ తెలియదు. అది షాపులోకి వచ్చి ఇరుక్కుపోవడంతో.. అక్కడి నుంచి ఎలా బయటకు వెళ్లాలా అని తెగ ఆలోచిస్తోంది. చివరకు ఎటూ దారిలేక.. అక్కడే ఉన్న ఓ షెల్ఫ్ పైకి ఎక్కడానికి ప్రయత్నించింది. మొత్తానికి ఎలాగోలా దానిపైకి ఎక్కింది. ఇంతలో అధికారులకు సమాచారం అందడంతో ఆగమేఘాల మీద అక్కడికి చేరుకుని ఆ బల్లిని పట్టుకున్నారు. జంతు ప్రదర్శన శాలకు తరలించారు.

Monitor Lizard
Monitor Lizard

థాయ్ లాండ్ లోని ఇలాంటి అడవి బల్లులు సంచరించడం మామూలే. కానీ ఇప్పుడీ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. ఈ బల్లులు ఎక్కువగా కాలువలు, చెరువులు, సరస్సుల పక్కన నివసిస్తాయి. చేపలు, పాములు, కప్పలు, మనుషులు తినగా పారేసిన ఆహార పదార్థాలను తింటూ బతుకుతాయి. కానీ ఇప్పుడు అడవిలో వాటికి తిండే కరువైంది.

థాయ్ లాండ్ లోని ఆ ప్రాంతంలో వర్షాలు లేక.. తినడానికి తిండి లేక అడవిలో జంతువులు ఆకలితో బాధపడుతున్నాయి. అందుకే ఆహారాన్ని వెదుక్కుంటూ ఆ షాపులోకి వెళ్లిందీ బల్లి. తమకు ఏమైనా ప్రమాదం తప్పదు అని తెలిసినప్పుడు ఈ బల్లులు చాలా ప్రమాదకరంగా మారతాయి. అలాంటప్పుడు కాటేయడానికి కూడా వెనుకాడవు. విషపూరితమైన వీటి కాటులో బ్యాక్టీరియా ఉంటుంది. అందుకే వీటితో పెట్టుకుంటే డేంజరే.

 

Also Read : Heroine Anjali : వకీల్ సాబ్ హీరోయిన్ అంజలి (Heroine Anjali) లేటెస్ట్ ఫోటోస్.. ఏం లుక్స్ రా బాబు.. అదిరిపోయాయిగా!

మరింత తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి.

https://www.facebook.com/SirimalliPage