Cinema

Singer Mohana Bhogaraju: అందంలో హీరోయిన్స్ తో పోటీ.. పాటల్లో ఆమె వాయిస్ అద్భుతః

Mohana Bhogaraju Modern Still
Mohana Bhogaraju Modern Still

Singer Mohana Bhogaraju: రూపంలో అందాన్ని, గొంతులో అమృతాన్ని మిక్స్ చేసి ఫోటో కాపీ తీస్తే.. అచ్ఛం మోహనా భోగరాజులా ఉంటుంది. ఏమాటకు ఆమాటే చెప్పుకోవాలంటే మాత్రం.. హిరోయిన్ ను మించిన అందం మోహనా (Singer Mohana Bhogaraju) సొంతం. దీంతోపాటు యూత్ ను కిరాకెక్కించే వాయిస్ .

Singer Mohana Bhogaraju
Singer Mohana Bhogaraju

మోహన పాట పాడుతుంటే ఉంటుంది… గుండెల్లో ఎక్కడో టచ్ చేసేస్తుంది అంతే. లేటెస్ట్ గా రిలీజ్ అయిన వకీల్ సాబ్ లో మగువా మగువా ఫిమేల్ వెర్షన్ పాట విన్నారుగా.. ఎలా ఉంది వాయిస్.. కుర్చీలకు కట్టిపడేసిందా.. పదే పదే వినాలనిపించిందా.. ఆ.. ఇప్పుడు అర్థమైందా.. మిమ్మల్ని అలా మెస్మరైజ్ చేసిన వాయిస్ ఎవరిదో.. ఆ పాట పాడింది మోహనానే .

టక్ జగదీశ్ టీజర్ చూసినవాళ్లకు.. అరే! ఇదేంటి.. ఏకంగా పాట మీదే టీజర్ లాగించేశారు అనుకుంటారు. కానీ ఆ పాటను పాడిన వాళ్లకు కాంప్లిమెంట్ ఇవ్వకుండా ఉండలేరు. ఎందుకంటే.. ఆ వాయిస్ కూడా మోహనాదే. వరుస హిట్ సాంగ్స్ తో టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ సింగర్ గా ఇప్పటికే పేరు వచ్చేసింది. కానీ ఈ స్టేజ్ కు రావడానికి మాత్రం చాలా కష్టపడాల్సి వచ్చింది.

అరవింద సమేతలో నల్లా రేగడి నేలలోన.. ఎర్రా జొన్న చేలలోనే – అంటూ రెడ్డమ్మ తల్లి పాట వింటే ఎవరైనా సరే.. ఆ గొంతుకు ఎమోషనల్ అవ్వకుండా ఉండలేరు. ఓన్లీ సాంగ్ ని విన్నా సరే.. ఆ ఫీల్ మాత్రం అలా క్యారీ అయిపోతుంది. ఇప్పుడున్న సింగర్స్ కు డిఫరెంట్ గా ఉంటుంది మోహనా వాయిస్.

మోహనా భోగరాజుకు పాటంటే ప్రాణం. కానీ వాళ్లమ్మగారికి సంగీతం అంటే ఇష్టం. అందుకే మోహనకు చిన్నప్పటి నుంచే సింగింగ్ అలవాటైపోయింది. శాస్త్రీయ సంగీతంలో తీసుకున్న ట్రైనింగ్ కెరీర్ కు బాగా ఉపయోగపడింది. ఫ్యామిలీ సపోర్ట్ ఉండడంతో మంచి సింగర్ గా రాణించగలుగుతున్నారు.

Mohana with Friends
Mohana with Friends

ఇప్పుడంటే పాటల ఛాన్స్ లు వస్తున్నాయి కానీ.. అప్పట్లో పాటల పోటీల్లో సెలక్షన్స్ స్థాయిలోనే వెనక్కి వచ్చేసిన సందర్భాలెన్నో! అయినా దేనికైనా టైమ్ రావాలంటారు కదా. ఇప్పుడు నడుస్తున్న టైమ్ మోహనదే.

               Mohana with Thaman

మ్యూజిక్ డైరెక్టర్ బాలాజీ.. జైశ్రీరామ్ లో.. సయ్యామమాసం పాటకు ఛాన్సిచ్చారు. తరువాత కొన్ని సినిమాల్లో కోరస్ పాడారు. తరువాత ఓ సంవత్సరం ఖాళీ. సరైన గుర్తింపు లేక.. ఉద్యోగం చేయక తప్పలేదు. ప్రయత్నిస్తే కాని ఫలితం దక్కదని నమ్మి.. తన పాటలను రికార్డ్ చేసి.. క్యాసెట్ గా మార్చి.. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణిని కలిశారు. దీనికి సింగర్ రమ్య బెహరా సపోర్ట్ చేశారు.

May be an image of 14 people and people smiling

టాలెంట్ ను ఒడిసిపట్టడంలో కీరవాణి బెస్ట్. అందుకే బాహుబలి సినిమాలో ‘మనోహరి’ పాటను పాడే ఛాన్సిచ్చారు. అదిగో అక్కడ యూత్ పల్స్ పట్టేసింది. ఇంకేముంది ఫుల్ క్రేజ్ వచ్చేసింది.

 

View this post on Instagram

 

A post shared by Mohana Bhogaraju (@mohanabhogaraju)

తరువాత.. భలే భలే మగాడివోయ్ సినిమాలో టైటిల్ సాంగ్, బాహుబలి-2 తమిళ వెర్షన్ లో ఓరోరి రాజా సాంగ్ కూడా మోహనాయే పాడింది. పాటలతో పాటే ఆల్బమ్స్ జర్నీ కూడా చేసింది. అలా మార్కెట్లోకి వచ్చిందే.. ‘బుల్లెట్ బండి’ ఆల్బమ్.

పక్కా హైదరాబాదీ అయిన మోహన బీటెక్ చేసినా.. ఎంబీఏ మీద ఇష్టంతో ఆ డిగ్రీ కూడా అందుకుంది. యూత్ కి ఎలాంటి వాయిస్ కావాలో మోహనాకు తెలిసినా.. ఎందుకోకాని సోషల్ మీడియాకు మాత్రం కాస్త దూరమే. కాకపోతే ఇప్పుడు ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ లో ఉన్నారులెండి. తను పాడిన పాటలు చాలా వరకు హిట్ అయ్యాయి.

Mohana with Singers
Mohana with Singers

మోహన పాటలు పాడిన సినిమాల లిస్ట్ చూస్తే.. ఎన్టీఆర్ బయోపిక్, శతమానం భవతి, సైజ్ జీరో, సోగ్గాడే చిన్నినాయనా, బ్లఫ్ మాస్టర్, భాగమతి, వెంకీమామ.. ఇలా ఎన్నో ఉన్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Mohana Bhogaraju (@mohanabhogaraju)

మోహనా తన గానంతో మరిన్ని మంచి సాంగ్స్ ప్రేక్షకులకు అందించాలని.. ఆమె తన కెరీర్ లో ఇంకా ఉన్నత స్థానాలకు వెళ్లి మంచి పేరు తెచ్చుకోవాలని సిరిమల్లి.కామ్ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. ఆల్ ది బెస్ట్ మోహన భోగరాజు.

ఇవి కూడా చదవండి : 

Also Read : Sudheer Rashmi : జలజలజలపాతం సాంగ్ లో సుధీర్, రష్మీల కెమిస్ట్రీ అదుర్స్.. తొమ్మిదేళ్ల రిలేషన్ మరి!

Also Read : Singer Mano Assets : సింగర్ మనో దగ్గర కోట్ల ఆస్తులు.. ఎలా సంపాదించారంటే?

Also Read : ఈ అమ్మడు.. అందాలతో కుమ్మేసింది..!

Also Read : Nabha Natesh : పసుపుపచ్చ కోకలో కుర్రకారుకు పిచ్చెక్కించే ఫోజులిచ్చిన ఇస్మార్ట్ బ్యూటీ

Also Read : ఎర్ర చీరలో పిచ్చెక్కిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ..!

Also Read : Nivetha Thomas : నాలో టాలెంట్ ఉంది.. కానీ, వకీల్ సాబ్ వల్ల..

Also Read : Ananya Nagalla Latest Pics

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి.

https://www.facebook.com/SirimalliPage