Cinema Off Beat

Singer Mano Assets : సింగర్ మనో దగ్గర కోట్ల ఆస్తులు.. ఎలా సంపాదించారంటే?

Singer Mano Assets : సింగర్ మనో గురించి ప్రేక్షకులకి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.. నాగూర్ బాబు(Singer Mano)గా ఇండస్ట్రీకి వచ్చిన ఆయన.. ఆ తరవాత మనోగా ప్రేక్షకల హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు. ఆయన పాడిన పాటలకి ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి.

తెలుగు, తమిళం, కన్నడతో సహా దాదాపు 10 భాషల్లో 25వేలకి పైగా పాటలు పాడారు మనో.. సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా మనో మంచి పేరు సంపాదించుకున్నారు. ఇక తాజాగా జబర్దస్త్ జడ్జిగానూ కొత్త ప్రయాణం మొదలు పెట్టి దూసుకుపోతున్నారాయన..

Image

ఇదిలావుండగా మనోకి చాలా ఆస్తులున్నాయని తెలుస్తోంది. కనీసం ఒక పూట భోజనం కూడా లేని స్థాయి నుంచి ఎంతో కష్టపడి పైకి వచ్చిన మనో.. ఇప్పుడు వందల కోట్లకు అధిపతి అయ్యాడని ఆయన సన్నిహితులు అంటున్నారు.

వాస్తవానికి అయితే సింగర్స్ లో అంతగా రెమ్యునరేషన్ ఉండదు కానీ ఇంత డబ్బును మనో ఎలా సంపాదించరంటే.. సినిమాల్లో వచ్చిన డబ్బుతో ఆయన ఫ్లాట్స్ కొన్నాడట.. సంపాదించిన ప్రతి పైసాను ఆయన వాటిపైనే ఇన్వెస్ట్ చేసేవారట.

Image

ఈయనకు ఇద్దరు కొడుకులు.. ఒక కూతురు ఉన్నారు. పెద్దబ్బాయి పేరు షకీర్ కాగా, చిన్నబ్బాయి పేరు రతేష్.. ఇద్దరు తమిళ్ సినిమాల్లో నిలదొక్కుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇక కూతురైన సోఫియా తండ్రి బాటలోనే గాయనిగా కొనసాగుతుంది.

Also Read :