Off Beat

సారంగ‌ద‌రియా పేర‌డి : కుడి భుజం మీద టీకా.. వ్యాధి రమ్మన్న రాదురా కాకా..!

సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్‌ లో ఉన్న సాయి పల్లవి సారంగ‌దరియా పాటకి ఇప్పుడు పేరడీ సాంగ్ వచ్చేసింది. కరోనా టీకా పైన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఈ పేరడీ సాంగ్ రాశాడని తెలుస్తోంది. ఈ పేరడీ సాంగ్ యొక్క లిరిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి.

కుడి భుజం మీద టీకా
వ్యాధి రమ్మన్న రాదురా కాకా
దాని పేరే కోవిడ్ టీకా..
వారి ఎడమ భుజం మీద టీకా
జర వేసుకొనుడి ఇది మోకా
వ్యాధి రమ్మన్న రాదురా కాకా
దాని పేరే కోవిట్ టీకా

మక్కుకి కాటన్ మాస్కుల్
లేకున్న బతుకులు ముష్కిల్
చేతికి ప్లాస్టిక్ గ్లౌజుల్
లేకున్న ఉంటయ్ రిస్కుల్
అడుగడుగున కోవిడ్ ఆంక్షల్
పాటిస్తే ఉండవు చావుల్
ఒంట్లో మజిల్సు నొప్పుల్
లేకున్న జ్వరము నిప్పుల్
దివి కంటితో చూడగా తప్పుల్
తుర్రున పోతయిరా ముప్పుల్
టీకా… టీకా… టీకా
ఇది కరోనా కట్టడి మోకా
వ్యాధి రమ్మన్న రాదురా కాకా
దాని పేరే కోవిడ్ టీకా