Politics

Sabbam Hari : మాజీ ఎంపీ సబ్బంహరి కన్నుమూత..

Sabbam Hari : కరోనా మహమ్మారి ప్రభావం తగ్గడం లేదు. ఇప్పటికే ఎంతోమంది ప్రముఖులు దాని బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. టీడీపీ నేత, మాజీ ఎంపీ సబ్బం హరి (69) విశాఖలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కరోనా వైరస్ సోకడంతో గత 15 రోజులుగా ఆయన (Sabbam Hari) చికిత్స తీసుకుంటున్నారు. సబ్బంహరికి కొవిడ్ తో పాటు ఇతర రకాల ఇన్ఫెక్షన్లు ఉండడం వల్ల వెంటిలేటర్ పై ట్రీట్ మెంట్ ను ఇచ్చారు. అయినా డాక్టర్ల ప్రయత్నాలు ఫలించలేదు.
సబ్బం హరి గారు
సబ్బం హరి గారు
సబ్బంహరి 1952 జూన్ 1న, తగరపువలస దగ్గరున్న చిట్టివలసలో జన్మించారు. ఆరుగురు సంతానంలో ఆయన చివరివారు. సొంతూరులోనే పాఠశాల విద్యనుపూర్తి చేశారు. తరువాత ఇంటర్, డిగ్రీ మాత్రం ఏవీఎన్ కాలేజ్ లో పూర్తయ్యాయి. సబ్బంహరికి వ్యాపారం చేయడమంటే ఇష్టం. అందుకే డిగ్రీ ఫైనలియర్ చేస్తున్నప్పుడే చాలా వ్యాపారాలు చేశారు. కానీ వాటిలో చాలావరకు నష్టాలు వచ్చాయి. అందుకే వాటిని వద్దనుకుని విడిచిపెట్టేశారు. అలా వ్యాపారరంగాన్ని వదిలేశారు. ఆయనకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
 వైజాగ్ మాజీ ఎంపీ సబ్బం హరి గారు
  వైజాగ్ మాజీ ఎంపీ సబ్బం హరి గారు
1970 అక్టోబర్ 15న లక్ష్మీని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆయనకు అవని, అర్చన అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన కుమారుడు వెంకట్ కు సాఫ్ట్ వేర్ రంగం ఇష్టం కావడంతో అందులోనే ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మొదలైంది సబ్బంహరి రాజకీయ జీవితం.
విశాఖ మేయర్ గా హరి గారు
విశాఖ మేయర్ గా హరి గారు
1985లోనే వైజాగ్ లోని యువజన కాంగ్రెస్ కార్యకర్తగా సేవలందించారు. 1989లో ముగ్గురు ఎమ్మెల్యేల విజయం వెనుక ముఖ్య పాత్ర ఆయనదే. అప్పుడే ఆయనకు చాలా గుర్తింపు వచ్చింది. విశాఖ కాంగ్రెస్ కమిటీలో కార్యదర్శిగా.. తరువాత నగర యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేశారు. 1995లో సబ్బంహరి విశాఖ మేయర్ గా ఎన్నికయ్యారు. వైజాగ్ సిటీని అభివృద్ధి చేయడంలో సబ్బంహరి పాత్ర మరువలేనిది. అవినీతి ఆరోపణలు లేకుండా పరిపాలన సాగించారు.
చంద్రబాబు నాయుడు తో సబ్బం హరి
చంద్రబాబు నాయుడు తో సబ్బం హరి
పారిశుధ్యాన్ని ప్రైవేటు వారికి అప్పజెప్పిన తొలి సిటీగా విశాఖను నిలిపింది కూడా సబ్బంహరే. మళ్లీ 2009లో ఆయన రాజకీయ జీవితం మలుపు తిరిగింది. అప్పుడు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున అనకాపల్లిలో ఎంపీగా పోటీ చేసి గెలిచారు. రాష్ట్ర విభజన తరువాత సబ్బంహరి పార్టీ మారారు. 2019లో టీడీపీలో చేరారు. తరువాత భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి.

https://www.facebook.com/SirimalliPage