RRR Review: ‘ఆర్ఆర్ఆర్’ రివ్యూ.. ఓ విజువల్ వండర్ యాక్షన్ డ్రామా..
Cinema Latest

RRR Review: ‘ఆర్ఆర్ఆర్’ రివ్యూ.. ఓ విజువల్ వండర్ యాక్షన్ డ్రామా..

RRR Review: దర్శక ధీరుడు రాజమౌళి.. విజువల్ వండర్స్ చేయడంలో దిట్ట. అలాంటి దర్శకుడు ‘బాహుబలి’ లాంటి సెన్సేషన్ తర్వాత తెరకెక్కించిన చిత్రమే ‘ఆర్ఆర్ఆర్’. ఎన్‌టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆకాశాన్ని తాకే అంచనాల మధ్య విడుదయిన ఈ సినిమా హీరోల అభిమానులతో పాటు మామూలు ప్రేక్షకులను మెప్పించగలిగిందా? లేదా?

కథ:
స్వాతంత్ర్యం కాలంలో సెట్ చేసిన కథే ‘ఆర్ఆర్ఆర్’. 1920ల్లో ఆదిలాబాద్ జిల్లా బ్యాక్‌డ్రాప్‌లో సినిమా మొత్తం సాగుతుంది. అడవిలో బ్రతుకును సాగిస్తున్న ఓ అమ్మాయిను బ్రిటిషర్లు ఎత్తుకెళ్లడం దగ్గర నుండి కథ మొదలవుతుంది. ఆ అమ్మాయిని కాపాడడం కోసం భీమ్ (ఎన్‌టీఆర్) రంగంలోకి దిగుతాడు. ఎన్‌టీఆర్‌ను ఎదిరించడానికి పోలీస్ ఆఫీసర్ రామ్( రామ్ చరణ్)ను రంగంలోకి దింపుతారు పోలీసులు. భీమ్‌ను అరెస్ట్ చేయడానికి వచ్చిన రామ్‌కు తనతో స్నేహం ఎలా కుదిరింది? వీరిద్దరు కలిసి బ్రిటిషర్లను ఎలా ఎదుర్కున్నారు అనేదే ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కథ.

Also Read: https://www.sirimalli.com/today-24-march-2022-daily-horoscope-in-telugu/

విశ్లేషణ:
రాజమౌళి ఇప్పటివరకు అన్నీ ప్రమోషన్స్‌లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు మెయిన్ హైలెట్స్ ఇద్దరు హీరోల యాక్టింగే అని చెప్పుకుంటూ వచ్చాడు. అయితే ఈ మాట నూటికి నూరుశాతం నిజమని ఎన్‌టీఆర్, రామ్ చరణ్‌లను స్క్రీన్‌పైన చూస్తేనే అర్థమవుతుంది. ఇద్దరూ పోటాపోటీగా నటించి.. ఆడియన్స్‌కు తమ యాక్షన్‌తో ఫుల్ ట్రీట్‌ను ఇచ్చారు. ముఖ్యంగా ఇలాంటి ఓ యాక్షన్ సినిమాలో ఎమోషన్స్‌ను సరిగ్గా కలగలిపి ఆడియన్స్‌ను మెప్పించడంలో రాజమౌళి సక్సెస్ అయ్యాడు.

ఎన్‌టీఆర్, రామ్ చరణ్ ఎంట్రీల దగ్గర నుండి అన్నీ కరెక్ట్‌గా ప్లాన్ చేశాడు రాజమౌళి. మొదటి సీన్ నుండే ఆడియన్స్‌ను కథలోకి తీసుకెళ్లగలిగాడు. ఇది ఒక హై వోల్టేజ్ యాక్షన్ డ్రామానే అయినా.. అందులో ఎమోషన్సే హైలెట్‌గా నిలిచాయి. సినిమాలో ఇద్దరు హీరోలు ఉన్నారన్న విషయాన్ని ఎక్కడా మర్చిపోనివ్వకుండా చేశాడు దర్శక ధీరుడు. ఇద్దరి పాత్రలు సమానంగా డిజైన్ చేసి మార్కులు కొట్టేశాడు. ఆలియా భట్.. రామ్ చరణ్‌కు జోడీగా నటించినా.. ఎన్‌టీఆర్‌తో తనకు ఉన్న సన్నివేశాలే కీలకం. ఇక అజయ్ దేవగన్, శ్రియ లాంటి నటీనటులు తమ పాత్రలకు ప్రాణం పోశారు.

RRR Movie Trailer: https://youtu.be/NgBoMJy386M

‘ఆర్ఆర్ఆర్’లో పాటల కంటే ఎక్కువగా అందరినీ ఆకట్టుకునేది కీరవాణి అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. యాక్షన్ సన్నివేశాలకు తగ్గట్టుగా ఆయన అందించిన బీజీఎమ్ సినిమాకు మరో హైలెట్. సినిమాటోగ్రాఫర్ సెంథిల్ తన కెమెరా పనితనంతో సినిమాను ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యేలా చేశాడు. క్లైమాక్స్ ఆర్ఆర్ఆర్‌కు ప్రాణంగా నిలిచింది. మొత్తంగా ఇద్దరు స్టార్ హీరోలను పెట్టి వారి యాక్టింగ్ ప్రతిభను పూర్తిస్థాయిలో ఉపయోగించుకొని ఓ విజువల్ వండర్ యాక్షన్ డ్రామాను క్రియేట్ చేశాడు రాజమౌళి.