Alia Bhatt: ఆలియా భట్ పెళ్లి కోసం ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ స్పెషల్ ఫ్లైట్..
Cinema Latest

Alia Bhatt: ఆలియా భట్ పెళ్లి కోసం ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ స్పెషల్ ఫ్లైట్..

Alia Bhatt:  గత సంవత్సర కాలంలో బాలీవుడ్‌లో చాలా జంటలు పెళ్లి పీటలు ఎక్కాయి. వారి బాటనే ఫాలో అవుతూ త్వరలో ప్రేమపక్షులు ఆలియా భట్, రణభీర్ కపూర్ కూడా పెళ్లితో ఒక్కటి కానున్నారు. చాలాకాలం ఆలియా భట్‌కు రణభీర్ క్రష్. ఈ విషయం పలుమార్లు బయటపెట్టింది కూడా. ఇక ఇన్నాళ్లకు తన చిన్ననాటి క్రష్‌ను పెళ్లి చేసుకొని భార్యగా మారనుంది ఆలియా. అయితే ఆలియా పెళ్లి కోసం ఆర్ఆర్ఆర్ టీమ్ భారీ సర్‌ప్రైజ్‌నే ప్లాన్ చేసిందట.

Also Read: https://www.sirimalli.com/gold-rate-and-silver-rate-today-in-hyderabad-and-vijayawada-on-12-april-2022/

‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాతో హీరోయిన్‌గా బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది ఆలియా. మొదట్లో తన యాక్టింగ్‌కు, పర్సనాలిటీకి నెగిటివిటీకి ఎదుర్కున్నా మెల్లగా బాలీవుడ్‌లో తాను కూడా ఓ ప్రామిసింగ్ నటి అనే రేంజ్‌కు ఎదిగింది. ఇక పలు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో ఆలియా నటనకు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. తాజాగా విడుదలయిన ‘గంగూబాయి కతియావాడి’ కూడా ఆ కోణానికి చెందిందే.

ఇక ఆలియా భట్, రణభీర్ కపూర్ కలిసి ‘బ్రహ్మాస్త్ర’ అనే భారీ బడ్జెట్ మైథలాజికల్ సినిమాలో నటిస్తున్నారు. ఇది వీరిద్దరు హీరోహీరోయిన్లుగా కలిసి చేస్తున్న మొదటి సినిమా. ఈ మూవీ షూటింగ్ సమయంలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఆలియా భట్‌కు ఆ మూవీ టీమ్ ఓ సర్‌ప్రైజ్ ప్లాన్ చేసిందట.

Alia And Ranbir Look From Brahmastra: https://www.instagram.com/p/CcKYlRjAmul/

ఆలియా, రణభీర్ పెళ్లిని చాలా సీక్రెట్‌గా ప్లాన్ చేశాయి ఇరు కుటుంబాలు. అందుకే ఈ పెళ్లికి సంబంధించిన ఏ అప్డేట్ బయటికి రావడం లేదు. అయితే వీరి పెళ్లికి ఆర్ఆర్ఆర్ టీమ్ ఓ స్పెషల్ ఫ్లైట్ బుక్ చేసుకొని మరీ వెళ్లనున్నట్టు సమాచారం. ఆర్ఆర్ఆర్‌లో సీత పాత్రలో మెప్పించిన ఆలియా కోసం వీరు స్పెషల్ గిఫ్ట్‌ను కూడా అందించనున్నారట. అయితే తాజాగా ఏప్రిల్ 14న జరగాల్సిన ఈ పెళ్లి పోస్ట్‌పోన్ అయినట్టు కూడా టాక్ వినిపిస్తోంది. కానీ ఏ వార్తపైనా ఇప్పటివరకు క్లారిటీ రాలేదు.