Cinema

Rashmika Mandanna : హీరోయిన్ రష్మిక మందన్నా గుండు ఫోటోల వెనుక అసలు కథ ఇది!

Rashmika Mandanna : హీరోయిన్ రష్మిక మందన్నా గుండు ఫోటోల వెనుక అసలు కథ ఇది!

Rashmika Mandanna : రసగుల్లాలా ఉండే రష్మిక అంటే.. టాలీవుడ్ అంతా మోజుపడుతుంది. ఫ్యాన్స్ కైతే ఇక చెప్పక్కరలేదు. ఈ అమ్మడు చిన్న లుక్ ఇస్తే చాలు.. సూపర్ అనేస్తారు. అందానికి అందం, పెర్ ఫార్మెన్స్ కి పెర్ ఫార్మెన్స్.. అందులోనూ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్. అందుకే పాన్ ఇండియా స్టార్ అవ్వడానికి తెగ ట్రై చేస్తోంది. మరి అలాంటి యాక్టర్ కు నెట్టింట్లో ఎలాంటి క్రేజ్ ఉండాలి. క్రేజ్ సంగతి తరువాత.. రష్మిక మందన్నా (Rashmika Mandanna) గుండు ఫోటోలు ఇప్పుడు ఈ బ్యూటీని కూడా కలవరపెడుతున్నాయి

rashmika mandanna
rashmika mandanna

రష్మిక గుండుతో ఉన్న ఫోటోలను చూసి నెటిజన్లు షాకయ్యారు. సోషల్ మీడియాలో ఇవి తెగ హల్ చల్ చేస్తున్నాయి. అసలు తనేంటి.. గుండేంటి.. ఏం జరిగింది రా బాబూ అంటూ మ్యాటర్ కోసం ఫుల్ గా సెర్చ్ చేసేశారు. ఈ హడావుడి అంతా చూసి రష్మిక ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యపోయరు. అదేంటి.. తమ కలల రారాణి అలా గుండుంతో ఉందేంటా అని బాగా ఆలోచించారు. దీని వెనుక నిజానిజాల కోసం తెగ పరిశోధన చేసేశారు.

 

rashmika1
rashmika1

రష్మిక ఏమన్నా నిజంగానే గుండు కొట్టించుకుందా అని చాలామంది నెట్ లో సెర్చ్ చేశారు. ఆమె ఫ్యాన్స్ కి మాత్రం ఏదో మూల అనుమానం ఉంది. ఇది ఎవరి పనో తేల్చేందుకు రెడీ అయ్యారు. అప్పుడు అసలేం జరిగిందో వెలుగుచూసింది. సాధారణంగా హీరోయిన్ల ఫోటోలను ఊళ్లలో షాపుల ముందు పెడుతుంటారు. అవి వాళ్ల అందాన్ని పెంచేలా ఉంటాయి. కానీ తమిళ తంబీల రూటే వేరు కదా.. వాళ్లేం చేశారంటే..

రష్మిక ఫోటోలను తమిళ తంబీలు ఎలా వాడకూడదో అలా వాడేశారు. వ్యాపారం కోసం.. రష్మిక.. గుండుతో ఉన్న ఫోటోలను షాపుల ముందు పెట్టేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఈ మిల్క్ బ్యూటీ ఫ్యాన్స్ కి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఆయ్! మా హీరోయిన్ ఫోటోలను అలా ఎలా వాడేస్తారు అంటూ.. అగ్గి మీద గుగ్గిలం వేస్తే మండిపోతుంది కదా.. అలా ఫైరైపోతున్నారు. కానీ తమిళ తంబీలు అక్కడితో ఆగితే కదా.

rashmika-2
rashmika-2

రష్మిక గుండు ఫోటోలతో ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేసి నెట్టింట్లో హల్ చల్ చేస్తు్న్నారు. అయినా ఇదేమీ రష్మిక గుండు ఫోటోతో మొదలవ్వలేదు. కీర్తి సురేష్, నయనతార.. ఇలా టాప్ హీరోయిన్ల గుండు ఫోటోలు ఎప్పుడో నెట్టింట్లో దర్శనమిచ్చాయి. వాళ్ల సంగతి సరే.. రష్మిక జోలికి ఎందుకు వచ్చారు అంటే.. ఈమధ్యనే తమిళంలో రష్మిక నటించిన ఫస్ట్ పిక్చర్.. సుల్తాన్.. బాక్సాఫీస్ దగ్గర బోర్లా పడింది. ఇంకేముంది.. వెంటనే నెట్ మార్కెట్లో ఫన్నీ మీమ్స్ తో పాటు ఇలా గుండు ఫోటోలు కనిపించాయన్న మాట. అదీ ఈ రష్మిక గుండు ఫోటోల కథ.

ఇవి కూడా చదవండి : 

Also Read : Dhee kings vs queens : ప్రియమణి ముద్దులు, రష్మీ కన్నీళ్లు.. ఢీ-13 కింగ్స్ వర్సెస్ క్వీన్స్ లో డ్యాన్స్ బాగా చేస్తే.. రూ.4లక్షలు ఇచ్చిన మాస్టర్.

Also Read : Sudheer Rashmi : జలజలజలపాతం సాంగ్ లో సుధీర్, రష్మీల కెమిస్ట్రీ అదుర్స్.. తొమ్మిదేళ్ల రిలేషన్ మరి!

Also Read : Sri Rama Navami : శ్రీరాముడు పుట్టిన పర్వదినాన.. సీతారాముల కల్యాణానికి ముహూర్తం పెట్టింది ఎవరో తెలుసా?

Also Read : Singer Mohana Bhogaraju: అందంలో హీరోయిన్స్ తో పోటీ.. పాటల్లో ఆమె వాయిస్ అద్భుతః

 

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/SirimalliPage