Politics

హీరోయిన్ నయనతారపై నటుడు రాధారవి తీవ్ర వ్యాఖ్యలు

తమిళనాట ఎన్నికల వేళ నటి నయనతారపై రాధారవి ఘాటు కామెంట్స్ చేశారు. డీఎంకేకి రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్న రాధారవి.. నయనతారపై ఫైరయ్యారు. డీఎంకే పార్టీకి నయనతార ఏమవుతుందంటూ సూటుగా ప్రశ్నించారు. గతంలో ఓ సభలో ఆమె గురించి ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

దానివల్లే తనను పార్టీ నుంచి తొలగించాలని చూశారని.. అందుకే తానే డీఎంకే పార్టీకి రాజీనామా చేశానని చెప్పారు. నయనతార.. ఉదయనిధి స్టాలిన్ తో రిలేషన్ షిప్ లో ఉంటే నేను మాత్రం ఏం చేస్తాను అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

గతంలో ఓ సినిమా ఫంక్షన్ లోను నయనతార గురించి రాధారవి అసభ్యంగా మాట్లాడడంతో అప్పట్లో అది సంచలనమైంది.