Politics

Prashant Kishor : పెద్ద బాంబ్ పేల్చిన ప్రశాంత్ కిశోర్..!

Prashant Kishor : ఎన్నికల ఫలితాల రోజే పెద్ద బాంబ్ పేల్చారు ఎన్నికల వ్యుహకర్త ప్రశాంత్ కిశోర్(Prashant Kishor) .. ఇక నుంచి తానూ ఎన్నికల వ్యూహాలు రచించబోనని ఏ పార్టీకి పనిచేయనని స్పష్టం చేశారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఇండియా టుడే టీవీతో మాట్లాడిన ఆయన ఈ విషయాన్నీ వెల్లడించాడు.

Battle for democracy, Bengal wants 'own daughter Mamata Banerjee': Prashant  Kishor - India News
Prashant Kishor

అయితే భవిష్యత్‌లో ఏం చేస్తానన్నది ఇంకా నిర్ణయించుకోలేదని తెలిపారు. కాగా ఎన్నికల వ్యుహకర్తగా ప్రశాంత్ కిశోర్ కి మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఆయన ఏ పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరిస్తే ఆ పార్టీ గెలవడం అనేది జరుగుతుంది.

2014 ఎన్నికల్లో బీజేపీ తరపున పనిచేసిన మోదీ గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఆ తరవాత పంజాబ్ లో కాంగ్రెస్, ఏపీలో వైసీపీ, బెంగాల్‌లో టీఎంసీ, తమిళనాడులో డీఎంకే తరుపున పనిచేశారు.

ఐతే ఒక్క యూపీలో ఎన్నికల్లో మాత్రం ఆయన కాంగ్రెస్‌ను గెలిపించలేకపోయారు.