Cinema Politics

Pawan Kalyan : పవన్ కల్యాణ్ కు కరోనా పాజిటివ్.. అప్పుడప్పుడు ఆక్సిజన్ ను..

Pawan Kalyan : పవన్ కల్యాణ్ కు కరోనా పాజిటివ్.. కొనసాగుతున్న చికిత్స

Pawan Kalyan :జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆయన ఈ నెల 3వ తేదీని తిరుపతిలో బహిరంగ సభ, పాదయాత్రలో పాల్గొన్నారు. తరువాత హైదరాబాద్ కు వచ్చి కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అప్పుడు రిజల్ట్ నెగిటివ్ గానే వచ్చింది. అయినా సరే తన సిబ్బందిలోని కొంతమందికి కొవిడ్ పాజిటివ్ రావడంతో డాక్టర్ల సలహా మేరకు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) క్వారంటైన్ లో ఉన్నారు. తన ఫామ్ హౌస్ లోనే రెస్ట్ తీసుకున్నారు.

pawan kalyan (1)
pawan kalyan (1)

జ్వరం, ఒళ్లు నొప్పులతో ఇబ్బంది పడుతుండడంతో రెండు రోజుల కిందట మళ్లీ కరోనా పరీక్ష చేసుకున్నారు. దీంతో కరోనా పాజిటివ్ అని తేలింది. ఖమ్మానికి చెందిన ప్రముఖ వైరల్ వ్యాధుల నివారణ నిపుణులు
డాక్టర్ తంగెళ్ళ సుమన్.. పవన్ కళ్యాణ్ కు చికిత్స ను అందిస్తున్నారు. ఇప్పటికే అవసరమైన ఇతర పరీక్షలను చేశారు. ఊపిరితిత్తుల్లో కొద్దిగా నిమ్ము చేరడంతో యాంటివైరల్ మందులతో ట్రీట్ మెంట్ ఇస్తు్న్నారు. అవసరమైన సందర్భాల్లో ఆక్సిజన్ కూడా ఇస్తున్నారు.

I love Pawan Kalyan a lot - tollywood

చిరంజీవి, శ్రీమతి సురేఖ, రామ్ చరణ్, శ్రీమతి ఉపాసన.. ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు. ఇప్పటికే అపోలో నుంచి డాక్టర్ శ్యామ్, డాక్టర్ సుబ్బారెడ్డిలు పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. జ్వరం ఊపిరితిత్తుల్లోని నిమ్ము, ఒళ్లునొప్పులు తగ్గడానికి మందులను ఇస్తున్నారు. తన ఆరోగ్యం నిలకడగానే ఉందని, త్వరలో సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజలు, అభిమానుల ముందుకు వస్తానన్న పవన్ మాటలే అభిమానులకు కొండంత ధైర్యాన్ని ఇచ్చాయి.

Vakeel Saab Box Office Collection : पवन कल्याण का धमाका, पहले ही दिन वकील साब ने किया इतने करोड़ का बिजनेस | vakeel saab box office collection 42 crore| TV9 Bharatvarsh

ఇప్పటికే టాలీవుడ్ లో చాలామంది కరోనా బారిన పడ్డారు. వకీల్ సాబ్ టీమ్ లో దిల్ రాజు, నివేదా థామస్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. పవన్ కల్యా్ణ్ త్వరగా కోలుకోవాలని.. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని టాలీవుడ్ తోపాటు రాజకీయ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు.

 

Also Read : Tamil Actor Vivek : తమిళ సినీ ఇండస్ట్రీలో టాప్ కమెడియన్ వివేక్ కు గుండెపోటు

Also Read : coronavirus in dust : ధూళిలో కూడా కరోనా ఉంటుందట.. అదీ నెల రోజులంట.. మరి తప్పించుకునేదెలా?

Also Read : దేశవ్యాప్తంగా భారీగా పెరిగిన కరోనా కేసులు.. ఇలా అయితే బతికినట్టే పో.. !

Also Read : Nivetha Thomas : నాలో టాలెంట్ ఉంది.. కానీ, వకీల్ సాబ్ వల్ల..

Also Read : Singer Mano Assets : సింగర్ మనో దగ్గర కోట్ల ఆస్తులు.. ఎలా సంపాదించారంటే?

 

మరింత తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి.

https://www.facebook.com/SirimalliPage