Politics

సాగర్‌లో నోముల భగత్ గెలుపు ..అప్పుడు అయ్యా చేతిలో ఇప్పుడు కొడుకు చేతిలో..

నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ గెలుపు దాదాపుగా ఖరారు అయింది. మొత్తం 24 రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యేసరికి నోముల భగత్.. తన సమీప అభ్యర్ధి జానారెడ్డిపై 19,281ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

దీనిపైన మరికాసేపట్లో అధికార ప్రకటన వెలువడనుంది. తొలిరౌండ్ నుంచే ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చిన భగత్ భారీ మెజారిటీతో విజయాన్ని సాధించారు.

కాగా 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో నోముల భగత్ తండ్రి, దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య చేతిలో ఓడిపోయిన జానారెడ్డి ఇప్పుడు కొడుకు చేతిలో ఓడిపోయారు.