Naga Babu: జంగారెడ్డిగూడెం ఘటనపై ఘాటుగా స్పందించిన నాగబాబు..
Latest Politics

Naga Babu: జంగారెడ్డిగూడెం ఘటనపై ఘాటుగా స్పందించిన నాగబాబు..

Naga Babu: ప్రస్తుతం ఏ వస్తువు చూసినా.. దాంట్లో ఎంతోకొంత కల్తీ ఉంటుంది. అది కల్తీ కాని వస్తువు అని నమ్మి దానిని ఉపయోగించడం తప్ప ప్రజలకు కూడా వేరేదారి లేకుండా పోయింది. అయితే మామూలు వస్తువులే కల్తీ అయినప్పుడు ప్రాణాలకు ఎంతో హాని కలిగిస్తుంది. అలాంటిది మద్యంలాంటిది కల్తీ అయితే ఇక వారి ప్రాణాలు పోయినట్టే అని ఇటీవల జంగారెడ్డిగూడెంలో జరిగిన ఘటన చూస్తే అర్థమవుతోంది.

Also Read: https://www.sirimalli.com/mahesh-babu-and-rajamouli-film-is-on-cards-and-allu-arjun-came-in-between/

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో పదికి పైగా వ్యక్తులు కల్తీ సారా తాగి ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఈ విషయం ఆంధ్ర రాష్ట్రమంతటా సంచలనంగా మారింది. ఇంత మంది ప్రాణాలను బలిదీసుకున్న కల్తీ సారాపై పోలీసులు కానీ, ప్రభుత్వం కానీ ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదని స్థానికులు వాపోతున్నారు. ఇవి సహజ మరణాలంటూ కొందరు రాజకీయ నాయకులు అంటున్నారు. అయితే ఇవి సహజ మరణాలు ఎలా అవుతాయి అంటూ ప్రభుత్వంపై నాగబాబు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఫైర్ అయ్యారు.

Naga Babu Instagram Post: https://www.instagram.com/p/CbIXsq2px0w/?utm_source=ig_web_copy_link

‘‘అందరూ ఒకే ప్రాంతానికి చెందిన వారైనా.. అందులో మరణించిన వారందరూ కేవలం మగవాళ్లే ఐనా.. వీరందరూ తమ చూపుని కోల్పోయి, కడుపులోని అవయవాలన్ని కాలిపోయి వున్నా.. అందరూ ఒకే విధంగా గంటల వ్యవధిలో హఠాత్మరణానికి గురైనా.. ఈ చావులకు – కల్తీ సారాకు ఎటువంటి సంబంధం లేదని, ఇవన్నీ కేవలం సహజ మరణాలుగా నిర్ధారించిన మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి జోహారు ! ఇలా ఇంకా ఎంత మంది చనిపోయినా మనం వీటిని కేవలం సహజ మరణాలుగా పరిగణించాల్సిన దుస్థితి రావటం మన అంధ్రుల కర్మ” !!!అంటూ నాగబాబు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వ్యాఖ్యలను కొందరు నెటిజన్లు సమర్థిస్తుంటే.. కొందరు మాత్రం నాగబాబునే తప్పు పడుతున్నారు.