Devi Sri Prasad : దేవీశ్రీప్రసాద్ ఇంట వరుస విషాదాలు..!
Cinema Latest

Devi Sri Prasad : దేవీశ్రీప్రసాద్ ఇంట వరుస విషాదాలు..!

Devi Sri Prasad : సింగర్ కం మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీప్రసాద్(Devi Sri Prasad) ఇంట వరుస విషాదాలు నెలకొన్నాయి. దేవీశ్రీప్రసాద్ బాబాయ్ గొర్తి బుల్లి బుల్గానిన్ ఓ ప్రమాదంలో తీవ్రగాయాలపాలై చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ మరణవార్త వినగానే ఆయన అక్క (దేవీశ్రీప్రసాద్ మేనత్త) కొమ్ముల సీతామహలక్ష్మి హార్ట్ ఎటాక్ తో మృతిచెందారు.

కుటుంబంలో ఇద్దరు మరణించడంతో దేవీశ్రీప్రసాద్ కుటుంబంలో విషాదాన్ని నెలకొల్పాయి. బాబాయ్, మేనత్తలు ఆకస్మికంగా మృతి చెందడంతో దేవశ్రీప్రసాద్ .. ఆయన తమ్ముడు సాగర్ శోక సముద్రంలో మునిగిపోయారు. కాగా దేవీశ్రీప్రసాద్ స్వగ్రామం తూర్పు గోదావరి జిల్లాలోని రాయవరం మండలం వెదురుపాక గ్రామం.

ఆయన తండ్రి సత్యమూర్తి. గవర్నమెంట్ టీచర్ గా పనిచేసిన ఆయన.. ‘దేవత’ సినిమాతో సినీరంగంలో రచయితగా ఆరంగేట్రం చేశారు. ఆ తర్వాత దర్శకుడిగా మారారు. సత్యమూర్తి తండ్రి పేరు నారాయణ కమ్యూనిస్ట్, ఆర్ఎంపీ డాక్టర్. ఆయనకి ముగ్గురు కొడుకులు , ముగ్గురు కూతుళ్ళు. మొత్తం ఆరుగురు సంతానం. కాగా దేవీశ్రీప్రసాద్ తండ్రి సత్యమూర్తి కాలం చేసిన సంగతి తెలిసిందే.

Also Read :