Acharya Trailer: ‘ఆచార్య’ ట్రైలర్ వచ్చేసింది.. కానీ ఒక్కటి మిస్ అయ్యింది..!
Cinema Latest

Acharya Trailer: ‘ఆచార్య’ ట్రైలర్ వచ్చేసింది.. కానీ ఒక్కటి మిస్ అయ్యింది..!

Acharya Trailer: మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో 152వ చిత్రంగా తెరకెక్కింది ‘ఆచార్య’. ఎన్నో ఇతర సినిమాలలాగే ఇది కూడా చాలా వాయిదాల తర్వాత విడుదలకు సిద్ధమయ్యింది. దాదాపు సంవత్సరం పాటు ఈ సినిమా విడుదల వాయిదా పడింది. దీంతో మెగా అభిమానులంతా ఆచార్య కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఏప్రిల్ 29న విడుదలకు సిద్ధమైన ఆచార్య మూవీ ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

రామ్ చరణ్, చిరంజీవి కలిసి ఇప్పటికీ పలు సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. కానీ ఆచార్య అలా కాదు. ముందుగా ఓ కీలక పాత్ర కోసం రామ్ చరణ్‌ను సినిమాలోకి తీసుకున్నాడు దర్శకుడు కొరటాల శివ. కానీ మెల్లగా ఆ పాత్ర ప్రాధాన్యత పెరుగుతూ ఉండడంతో ఆచార్య.. రామ్ చరణ్, చిరంజీవిల మల్టీ స్టారర్‌గా మారింది. అందుకే ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న మెగా అభిమానుల సంఖ్య భారీగానే ఉంది.

Also Read: https://www.sirimalli.com/rrr-movie-team-is-going-to-attend-alia-bhatt-wedding-in-a-special-flight/

ఆచార్య ట్రైలర్ చూస్తుంటే ఇందులో మరోసారి మాస్ మెగాస్టార్‌ను చూడబోతున్నామన్న విషయం అర్థమవుతోంది. ట్రైలర్‌లో చాలావరకు యాక్షన్ సీన్స్‌తో నిండిపోయింది. ఇక చాలాకాలం తర్వాత విలన్‌గా తెలుగులో కనిపించనున్న సోనూ సూద్ స్క్రీన్ ప్రెసెన్స్ కూడా ఆచార్యకు ప్లస్ కానుంది. కానీ ట్రైలర్‌లో ఒకటి మాత్రం మిస్ అయ్యిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

Acharya Trailer: https://youtu.be/m09a8jWgUNk

ఆచార్యలో రామ్ చరణ్‌కు జోడీగా పూజా హెగ్డే, చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటించారు. అయితే కాజల్ కంటే ఈ సినిమాలో పూజా హెగ్డే ప్రాధాన్యత ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఇప్పటివరకు విడుదలయిన టీజర్, ట్రైలర్‌లో పూజానే కనిపిస్తోంది తప్ప కాజల్ ఒక్క సీన్‌లో కూడా కనిపించలేదు. దీంతో కాజల్ ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. సినిమాలో కూడా కాజల్‌కు ప్రాధాన్యత ఉండదేమో అని ఫిక్స్ అయిపోతున్నారు.