Monthly Horoscope for June 2022 : ఆ రాశివారికి అన్నివైపుల నుంచీ ఆదాయమే!
Bhakthi Latest

Monthly Horoscope for June 2022 : ఆ రాశివారికి అన్నివైపుల నుంచీ ఆదాయమే!

Monthly Horoscope for June 2022 : ఆ రాశివారికి అన్నివైపుల నుంచీ ఆదాయమే!

SREE KRUPA

మాస ఫలాలు – మేషం

 

Monthly Horoscope for June 2022 : జూన్ నెల రాశిఫలాలు 2022 ఈ రాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఆదాయ మార్గాలు కొంతవరకు బాగున్నప్పటికీ వృధా ఖర్చు విషయంలో జాగ్రత్త వహించాలి. దూరప్రయాణాలు వీలైనంతవరకు వాయిదా వేయడం మంచిది వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. జీవిత భాగస్వామితో అకారణ మాటపట్టింపులు కలుగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. చిన్న తరహా పరిశ్రమల వారికి సకాలంలో పెట్టుబడులు అందుతాయి. మాసం చివర పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. దుర్గా ద్వాత్రింశన్నామావళి ప్రతి నిత్యం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మాస ఫలాలు – వృషభం

జూన్ నెల రాశిఫలాలు 2022 ఈ రాశి వారికి ఈ మాసంలో చాలా అనుకూలంగా ఉన్నది.ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలలో ఆశించిన పురోగతి కలుగుతుంది.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. సంతాన విద్యా ఉద్యోగ విషయాల్లో శుభవార్తలు అందుకుంటారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు భవిష్యత్ కు ఉపయోగపడతాయి. ఉద్యోగస్తులకు అధికారుల సహాయ సహకారాలు ఉంటాయి ఆదాయ మార్గాలు ఆశించిన విధంగా ఉంటాయి. మాసం మధ్యలో దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది ఇతరులతో వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మాస ఫలాలు – మిథునం

జూన్ నెల రాశిఫలాలు 2022 ఈ రాశి వారికి ఈ మాసం అంత అనుకూలంగా లేదు ఇంటాబయట వ్యతిరేకత పెరుగుతుంది ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉంటాయి నూతన ఋణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది బంధుమిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగమున స్థానచలన సూచనలు ఉన్నవి వ్యాపార వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టాలు తప్పవు. ధన వ్యవహారాలలో ఇతరులకు మాట ఇవ్వటం మంచిది కాదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది మాసం చివరన దూరపు బంధువులతో శుభకార్యాలకు హాజరవుతారు గౌరవ మర్యాదలు పెరుగుతాయి విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మాస ఫలాలు – కర్కాటకం

జూన్ నెల రాశిఫలాలు 2022 ఈ రాశి వారికి ఈ మాసం గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నది. అన్ని వైపుల నుండి ఆదాయ మార్గాలు పెరుగుతాయి.పాత ఋణలు కొంత వరకు తీర్చగలుగుతారు అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. చేపట్టిన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. మీ ఆలోచనా విధానంతో ఇంటా బయట అందరిని ఒక మాట మీదకి తీసుకొస్తారు. చాలా కాలంగా వేధిస్తున్న శత్రు పరమైన సమస్యలు నుండి తెలివిగా బయటపడతారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల అండదండలు పెరుగుతాయి. వ్యాపారాలలో నూతన ప్రణాళికలతో ముందుకు సాగి లాభాలు అందుకుంటారు. మాసం చివరన ధన వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది పంచముఖ హనుమత్ కవచం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మాస ఫలాలు – సింహం

జూన్ నెల రాశిఫలాలు 2022 ఈ రాశి వారికి ఈ మాసంలో కొంత అనుకూల వాతావరణం ఉన్నది వృత్తి వ్యాపారాలలో విశేషంగా రాణిస్తారు చాలా కాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. అవసరానికి ఏదో విధంగా ధన సహాయం లభిస్తుంది. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. శత్రు సంబంధిత సమస్యలు కొంతవరకు తొలగి ఊరట చెందుతారు. దూరపు బంధువులు సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. మాసం చివర ధన వ్యవహారాలలో జాగ్రత్త అవసరం చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి శివ సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మాస ఫలాలు – కన్య

జూన్ నెల రాశిఫలాలు 2022 ఈ రాశి వారికి ఈ మాసం గ్రహ సంచారం అనుకూలంగా లేదు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. గృహమున కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. అకారణ వివాదాలు మానసికంగా చికాకుగా పరుస్తాయి. వాహన ప్రయాణాల విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగమున పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలు ఉండవు. గృహ నిర్మాణ పనులు మందకొడిగా సాగుతాయి. సంతాన విద్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. కొన్ని పనులలో బద్దకాన్ని విడనాడి ముందుకు సాగడం మంచిది. మాసం మధ్యన దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. గణపతి ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మాస ఫలాలు – తుల

జూన్ నెల రాశిఫలాలు 2022 ఈ రాశివారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు ఆదాయానికి లోటు ఉండనప్పటికి నూతన ఋణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. శారీరక శ్రమ అధికం అవుతుంది. ఊహించని సమస్యల వలన మానసిక అశాంతి కలుగుతుంది. స్త్రీ సంబంధిత వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. మాసం మధ్యలో నుండి కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు సజావుగా పూర్తి అవుతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. నవగ్రహ కవచం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మాస ఫలాలు – వృశ్చికం

జూన్ నెల రాశిఫలాలు 2022 ఈ రాశి వారికి ఈ మాసం గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నది గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. పాత రుణాలు కొంతవరకు తీర్చగలుగుతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరుకు అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. మాసం చివరన జీవిత భాగస్వామితో మాటపట్టింపులు ఉంటాయి. ధన వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

మాస ఫలాలు – ధనస్సు

జూన్ నెల రాశిఫలాలు 2022 ఈ రాశి వారికి ఈ మాసంలో గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నది. ఆర్థికంగా గతం కంటే మెరుగైన పరిస్థితులు ఉంటాయి. అవసరానికి ఏదో విధంగా ధన సహాయం అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. గృహమునకు దూరపు బంధువుల ఆగమనం కొంత ఆనందం కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు ఆశించిన పదవులు పొందారు. వ్యాపార వ్యవహారాలలో సొంత నిర్ణయాలతో ముందుకు సాగడం మంచిది. మాసం మధ్యలో కళత్రము తో చిన్నపాటి వివాదాలు బాధిస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. గురుచరిత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మాస ఫలాలు – మకరం

జూన్ నెల రాశిఫలాలు 2022 ఈ రాశి వారికి ఈ మాసం గ్రహ సంచారం అనుకూలంగా లేదు. బంధు వర్గం వారితో అకారణ వివాదాలు కలుగుతాయి. కుటుంబ వాతావరణం కేంద్రం గా ఉంటుంది. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. వృత్తి ఉద్యోగాలలో ఇతరుల నుండి విమర్శలు ఎదురవుతాయి. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలలో కొంత జాగ్రత్త వహించాలి. వృత్తి ఉద్యోగమున అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు నూతన ఋణ యత్నాలు చెయ్యవలసి వస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. మాసం మధ్యన కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. శని స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

మాస ఫలాలు – కుంభం

జూన్ నెల రాశిఫలాలు 2022 ఈ రాశి వారికి ఈ మాసం గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నది కీలక వ్యవహారాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు. ఇతరులకు సైతం సహాయ సహకారాలు అందిస్తారు. అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు. వృత్తి వ్యాపారాలు విశేషంగా రాణిస్తాయి. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది.ఉద్యోగస్తులు అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. చిన్న తరహా పరిశ్రమల వారికి సకాలంలో పెట్టుబడులు అందుతాయి. గృహమున వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. మాసం చివర బంధుమిత్రుల నుండి ఋణ ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మాస ఫలాలు – మీనం

జూన్ నెల రాశిఫలాలు 2022 ఈ రాశివారికి ఈ మాసం గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నది. వృత్తి ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి. అవసరానికి ఏదో విధంగా తన సహాయం లభిస్తుంది. కీలక వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనప్పటికీ ధైర్యంగా ముందుకు సాగుతారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. సంతానం విద్య ఉద్యోగ విషయాల్లో సాధించిన పురోగతి కనిపిస్తుంది. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. మాసం చివర నా జీవిత భాగస్వామితో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. ధన పరంగా ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. మేధా దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయటం వలన శుభఫలితాలను పొందుతారు.

Girish kulakarni purohithulu sirimalli.com

Girish kulakarni purohithulu sirimalli.com

Also Read : 

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

 

Weekly Horoscope Telugu : ఆ రాశివారికి స్థిరాస్థి కొనుగోలుకు అవకాశాలు! (29-05-2022 నుంచి 04-06-2022)

 

For More Updates Follow us on – Sirimalli Page