Politics

ఆ విషయంలో KCRను కాపీ కొడుతున్న స్టాలిన్…!

తమిళనాడులో తాజాగా వెలువడిన ఎన్నికల ఫలితాల్లో అధికార అన్నాడీఎంకేను ఓడించి డీఎంకే అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే..! ఈ నెల 7న ముఖ్యమంత్రిగా స్టాలిన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.

ఈ మేరకు ముహూర్తం ఖరారైంది. ఈ ప్రమంస్వీకరానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ హాజరు కానున్నారని సమాచారం.

Image

అయితే తన తన కేబినెట్‌లో ఎవరెవరు ఉండాలనే అంశాలపైన స్టాలిన్ ఓ స్పష్టతకి వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఫాలో అవుతున్నారని తెలుస్తోంది.

Also Read :

స్టాలిన్ కుమారుడు ఉదయానిధిని మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారని తెలుస్తోంది. తమిళనాడులోని చెపాక్ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో ఉదయానిధి విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Image

ఉదయానిధి స్టాలిన్‌ను మంత్రివర్గంలోకి తీసుకుని అతనికి మున్సిపల్, హౌసింగ్‌, స్లమ్‌ క్లియరెన్స్‌ బోర్డు, టౌన్‌ ప్లానింగ్‌, అర్బన్‌ డెవల్‌పమెంట్‌, సీఎండీఏ శాఖలకు సంబంధించిన బాధ్యతలను అప్పగించే ఆలోచనలో స్టాలిన్‌ ఉన్నట్టుగా సమాచారం.

Image

తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం తన కుమారుడు కేటీఆర్‌కు ఇవే శాఖలు కేటాయించిన సంగతి తెలిసిందే. దీనితో స్టాలిన్.. కేసీఆర్ ని ఫాలో అవుతున్నారన్న చర్చ మొదలవుతుంది.