Bigg Boss OTT Telugu: బిగ్ బాస్ ఓటీటీ తెలుగు ఫస్ట్ వీక్ నామినేషన్స్.. డేంజర్ జోన్‌లో హాట్ బ్యూటీ..
Bigg Boss 5 Telugu Cinema Latest

Bigg Boss OTT Telugu: బిగ్ బాస్ ఓటీటీ తెలుగు ఫస్ట్ వీక్ నామినేషన్స్.. డేంజర్ జోన్‌లో హాట్ బ్యూటీ..

Bigg Boss OTT Telugu: బిగ్ బాస్ రియాలిటీ షో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకుంది. పైగా తెలుగులో కూడా దీనికి వచ్చిన ఆదరణ వల్ల బిగ్ బాస్ షో కూడా ప్రేక్షకులను ఇంకెలా ఆకట్టుకోవాలో అని ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందులో భాగంగా వచ్చిందే బిగ్ బాస్ ఓటీటీ. ఇప్పటికే బిగ్ బాస్ ఓటీటీ ప్రారంభమయ్యి వారం రోజులు పూర్తి చేసుకుంది. అంతే కాకుండా నామినేషన్ ప్రక్రియ కూడా హోరాహోరీగా సాగింది.

download

బిగ్ బాస్ ఓటీటీ తెలుగులో ఇంతకు ముందున్న కంటెస్టెంట్స్‌తో పాటు కొత్తవారు కూడా కొందరు ఎంటర్ అయ్యారు. పాత కంటెస్టెంట్స్ ప్రేక్షకులకు తెలుసు. నామినేషన్‌లో ఉన్న పాత కంటెస్టెంట్స్‌కు బాగానే ఓట్లు పడుతున్నాయి. అందుకే ఈ వారం నామినేషన్‌లో ఉన్నవారిలో కొత్తగా ప్రేక్షకులకు పరిచయమయిన ఓ హాట్ బ్యూటీ డేంజర్ జోన్‌లో ఉన్నట్టు సమాచారం.

download

మొదటి వారం బిగ్ బాస్ ఓటీటీ తెలుగు నామినేషన్స్‌లో మొత్తం ఏడుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. అరియానా, అర్‌జే చైతూ, హమీదా, నటరాజ్ మాస్టర్, సరయు, ముమైత్ ఖాన్, మిత్రా శర్మ ఉన్నారు. అయితే వీరందరిలో మిత్రా శర్మకే తక్కువ ఓట్లు వచ్చినట్టు సమాచారం. పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెరిసిన మిత్రా శర్మ.. బిగ్ బాస్ ఓటీటీలో ఎక్కువగా స్క్రీన్ ప్రజెన్స్ ఇవ్వకపోవడం వల్లే వెనకబడిందని బిగ్ బాస్ ప్రేక్షకులు అనుకుంటున్నారు.

download

 

Also Read : 

భీమ్లా నాయక్ హీరోయిన్ సంయుక్త మీనన్ లేటెస్ట్ ఫోటోస్

 

For More Updates Follow us on – Sirimalli Page