Horoscope Mesha Raasi Aries : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర మేష రాశి ఫలాలు

Horoscope Mesha Raasi Aries : 2021-2022 శ్రీ ప్లవ నామ సంవత్సర మేష రాశి (Horoscope Mesha Raasi Aries) ఫలాలు

అశ్విని నక్షత్రం 1,2,3,4 పాదములు లేదా భరణి నక్షత్రం 1,2,3,4 పాదములు లేదా కృత్తిక నక్షత్రం 1వ పాదములో జన్మించినవారు మేషరాశికి చెందును

2020 – 2021 శ్రీ ప్లవ నామ సంవత్సరంలో మేష రాశి (Horoscope Mesha Raasi Aries) వారికి ఆదాయం – 08, వ్యయం – 14 , రాజపూజ్యం – 04 అవమానం – 03.

పూర్వ పద్దతిలో మేషరాశి వారికి వచ్చిన శేష సంఖ్య “5” .ఇది శ్రీ ప్లవ నామ సంవత్సరంలో మీ ప్రమేయం లేకుండానే అపవాదులు మరియు అవమానములను పొందడాన్ని సూచించుచున్నది.

మేష రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరం అనగా 13-ఏప్రిల్-2021 నుండి 01-ఏప్రిల్-2022 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు గ్రహం 19-నవంబర్-2021 వరకు వ్యతిరేక ఫలితాలు ఏర్పరచును. ముఖ్యంగా పితృ వర్గం లోని పెద్ద వయస్సు వారికి తీవ్ర ఆరోగ్య సమస్యలు మరియు ప్రాణ గండములు ఏర్పరచును. వారసత్వ సంబంధ సంపద విషయంలో తగాదాలు ఎదుర్కొందురు. కుటుంబంలో తరచుగా శుభ కార్య సంబంధ వ్యయం అధికంగా ఏర్పరచును. వ్యక్తిగత జాతకంలో గురు గ్రహం నీచ క్షేత్రం లో ఉన్న వారు ఒక పర్యాయం 16 రోజుల గురు గ్రహ శాంతి జపము జరిపించు కొనుట మంచిది.. 20-నవంబర్-2021 నుంచి మేష రాశి వారికి గురు గ్రహం అనుకూల ఫలితాలు ప్రసాదించుట ప్రారంభం అగును. మిక్కిలి న్యాయమైన ధన సంపాదన ఏర్పరచును. జీవన విధానంలో నూతన యోగములను ప్రసాదించును.

మేష రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో శని వలన సంవత్సరం అంతా అనుకూల ఫలితాలు ఏర్పడును. శని మేష రాశి వారికి ఆశించిన విధంగా ధన సంపాదన లభింప చేయును. నల్లని వస్తువులు, నల్లని ధాన్యముల, లోహముల వ్యాపారం చేసే వారికి మంచి లాభములు లభింపచేయును. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అగును. నూతన దంపతుల సంతాన ప్రయత్నాలు ఫలించి సంతాన సౌఖ్యం కలుగచేయును. శ్రీ ప్లవ నామ సంవత్సరంలో మేష రాశి వారికి ఏలినాటి శని దశ లేదు.

మేష రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో కూడా రాహు గ్రహం సంవత్సరం అంతా మంచి ఫలితాలు ఏర్పరచును. గడిచిన శ్రీ శార్వరి నామ సంవత్సరం వలెనే ఈ ప్లవ నామ సంవత్సరంలో కూడా పేర్కొనదగిన తీవ్ర వ్యతిరేక ఫలితాలు ఏమియూ రాహు గ్రహం వలన మేష రాశి వారికి లేవు.

మేష రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో కూడా కేతు గ్రహం వలన గడిచిన శార్వరి నామ సంవత్సరం వలననే అనేక సమస్యలు ఏర్పడును. శారీరక సౌఖ్యం తక్కువ అగును. ప్రతి కార్యానికి తీవ్రంగా శ్రమించ వలెను. వ్యక్తిగత జాతకంలో పితృ స్థానంలో కేతు గ్రహ దోషములు కలిగిన వారికి పితృ ఖర్మలు చేయవలసిన పరిస్థితులు ఏర్పడు సూచన. ఆధ్యాత్మిక జీవన సాధనలో ఆశించిన పురోగతి లభించదు. నూతనంగా దైవ ఉపాసన చేయదలచిన వారికి అనేక విఘ్నములు ఏర్పడును.

ఏప్రిల్ 2021 మేష రాశి రాశీ ఫలాలు:

ఈ మాసంలో శరీర ఆరోగ్యం బాగుండును. మనసు ఉల్లాసంగా ఉండును. విందు వినోదాలలో పాల్గోనేదురు. వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. విద్యార్ధులకు పట్టుదల పెరుగుతుంది. న్యాయస్థాన సంబంధ విషయాలు చికాకులు ఏర్పడును. ద్వితీయ వారంలో సంతాన సంబంధ అనారోగ్యం అశాంతిని ఏర్పరచును. ఇష్టమైన వారి గురించి అశుభ వార్త వినుటకు అవకాశం ఉన్నది.. 18 వ తేదీ తదుపరి ఉద్యోగ ప్రయత్నాలలో కార్య సిద్ధి లభించును. నిరుద్యోగుల ప్రయత్న విజయములు చేకురును. ముఖ్యమైన కార్యక్రమాలు నిదానంగా ముందుకు సాగును. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నెల మొత్తం ధనాదాయం సామాన్యం.

మే 2021 మేష రాశి రాశీ ఫలాలు:

ఈ నెలలో ప్రధమ , ద్వితీయ వారాలలో వృత్తి , ఉద్యోగ , వ్యాపార వ్యవహారములో ఆశించిన ఫలితాలు పొందుతారు. ప్రత్యర్ధుల మీద పై చేయి సాధిస్తారు. స్థిరాస్థి సంబంధ అగ్రిమెంట్లకు అనుకూలం. అవివాహితులకు వివాహ సంబంధ సంతోషము లభించును. వాహన సౌఖ్యం పొందుతారు. తృతీయ వారం నుండి కార్య విఘ్నతలు ఎదురగును. కార్యక్రమాలలో శ్రమించవలెను. ప్రైవేట్ ఉద్యోగస్తులకు చికాకులు. కృత్తిక నక్షత్ర స్త్రీలకు అనారోగ్యం. స్టాక్ మార్కెట్ వ్యవహారములో అదృష్టం కలసిరాదు. 20, 21, 29 తేదీలలో సమస్యలు. కుటుంబ సంబంధ వ్యవహార చిక్కులు.

జూన్ 2021 మేష రాశి రాశీ ఫలాలు:

ఈ మాసంలో మంచి ఫలితాలు పొందుతారు. సొంత గృహ సంబంధ సంతోషములు లభించును. వృధా ధన వ్యయం తగ్గించ గలుగుతారు. ఆభరణాలు కొనగలుగుతారు. పై అధికారులతో సంభాషనలందు మాట జాగ్రత్త అవసరం. 17, 18 తేదీలలో వ్యాపార రంగంలోని వారికి ప్రభుత్వ సంబంధ సహకారం లభించును. మానసిక ప్రశాంతత, మిత్రులతో కలయికలు, తలపెట్టిన పనులలో విజయం చేకురుట ఏర్పడును. ఈ నెలలో 9, 11,12 తేదీలు ఉద్యోగ ప్రయత్నములకు మంచిది. ఆశించిన ఉద్యోగ ప్రాప్తి.

జూలై 2021 మేష రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో ధనాదాయం పెరుగును. చేయుచున్న వృత్తి వ్యాపారాలలో , ఉద్యోగ ప్రయత్నాలలో జయము ప్రాప్తించును. విధి నిర్వహణలో మార్పులకు సిద్ధంగా ఉండాలి. కుటుంబంలో ఆకస్మిక ధన ప్రాప్తి లభించును. వ్యాపార విస్తరణ పనులు చేపడతారు. భాత్రు వర్గం వారికి సహాయం చేయగలుగుతారు. మీ శ్రమ కు తగిన గుర్తింపు పొందగలుగుతారు. భూ వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఆర్ధిక పరమైన వ్యూహాలు రచించగాలుగుతారు. ఈ మాసంలో 13, 21 తేదీలు అనుకూలమైనవి కావు. ఈ మాసంలో నూతన వాహన కొనుగోలు చేయకుండా ఉండుట మంచిది.

ఆగస్టు 2021 మేష రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు పొందుతారు. పనిచేయు స్థలంలో అధికారుల వలన లేదా కుటుంబంలో పెద్దల వలన మానసికంగా ఆందోళన కలుగు సూచన. వ్రుత్తి వ్యాపారాలలో ఒడిదుడుకులు ఎదురైనా కూడా అధిగమించ కలుగుతారు. న్యాయవాద రంగంలోని వారికి కొన్ని ఉన్నత అవకాశములు అప్రయత్నపుర్వకంగా లభిస్తాయి. బంధు వర్గం వలన అవమానాలు లేదా చికాకులు. ఆర్ధికంగా మోసానికి గురి అగుటకు అవకాశం ఉన్నది. వ్యాపార రంగంలోని వారికి ధనాదాయం సామాన్యం.18 నుండి 24 తేదీల మధ్య కాలంలో దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. మాసాంతంలో కుటుంబ సభ్యులకు ఆరోగ్య సమస్యలు.

సెప్టెంబర్ 2021 మేష రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో మిత్రుల వియోగ వార్త వినవలసి వచ్చును. కొట్టిపాటి కష్టం మీద వ్యవహార విజయాలు లభించును. రావలసిన ధనం చివరి నిమిషంలో లభించి పనులు పూర్తి చేయగలుగుతారు. విదేశీ సంబంధ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో నూతన భాద్యతలు తీసుకోవలసి వస్తుంది. పుత్ర సంతాన సంబంధ శుభ వార్త పొందుటకు సూచనలు ఉన్నవి. మేష రాశికి చెందిన స్త్రీలకు ధనం వలన సౌఖ్యం లభిస్తుంది.ఆర్ధికంగా బలపడుదురు. మిత్రుల వద్ద ఇతరులను విమర్శించకుండా ఉండుట మంచిది. చివరి వారంలో మానసిక ఒత్తిడి , అంచనాలు తలక్రిందులు అవుట వంటి ఇబ్బందులు ఎదుర్కొందురు. కొత్త ప్రాజెక్టులు చేపట్టుట లేదా ఉద్యోగంలో మార్పులు చేయకుండా ఉండుట మంచిది.

అక్టోబర్ 2021 మేష రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో గత కాలంలో పోగట్టుకున్న చక్కటి అవకాశములు తిరిగి పొందగలుగుతారు. స్త్రీలు అజాగ్రత్త వలన మాటపడు సంఘటనలు ఎదురగును.ప్రధమ మరియు ద్వితీయ వారాలలో వాహన ప్రమాదమునకు అవకాశం ఉన్నది. ముఖ్యంగా ద్వితీయ వారం అంత మంచిది కాదు. అననుకూలమైన ఫలితాలు, మిత్రులతో విభేదాలు. కార్యములలో చిక్కులు ఎదురగును. తృతీయ వారం నుండి గతంలో ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభమగును. వ్యాపారాలలో మీ వ్యూహాలు ఫలిస్తాయి. మాసాంతంలో జీవిత భాగస్వామితో అనుకూల పరిస్థితి ఏర్పడి సౌఖ్యం. చిరకాల కోరికలు తీర్చుకోగలుగుతారు. 5,8, 26, 27 తేదీలు వివాహ ప్రయత్నములకు మంచిది.

నవంబర్ 2021 మేష రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో నిదానంగా అలోచించి నిర్ణయాలు తీసుకొనుట అవసరం. విజయ అవకాశములు స్వల్పం. పనిభారం పెరిగి సతమతమవుతారు. నిరాశ కలిగించే సంఘటనలు ఎదురగును. ధనాదాయం సామాన్యం. కుటుంబ సభ్యుల నుండి ప్రోత్సాహం ఆశించిన విధంగా ఉండదు. సొంత ఆరోగ్యం కూడా కొంత మందగిస్తుంది. ఉద్యోగం ఆశిస్తున్న వారికి కష్టం మీద శుభవార్త. తృతీయ వారం సంతాన సంబంధ ప్రయత్నములకు అనుకూలం. 10, 14, 29 తేదీలు నూతన వ్యాపార వ్యవహారాలకు అనుకూలమైనవి కావు. రావలసిన ధనం ఆలస్యంగా లభిస్తుంది.ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించడానికి అనుకూలమైన కాలం కాదు.

డిసెంబర్ 2021 మేష రాశి రాశీ ఫలాలు:
ఈ మాసం ప్రారంభంలో శుభ ఫలితాలు లభిస్తాయి. ఆటంకాలు అధిగమించగలరు. దీర్ఘకాలిక సమస్యలను సొంతంగా పరిష్కరించుకోగలుగుతారు. ఆలోచనలు కార్య రూపం దాల్చును. కుటుంబ వ్యవహారాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. ప్రముఖులతో పరిచయాలు లభించును. దైవ సందర్శన భాగ్యం లభించును. కుటుంబంలోని వ్యక్తుల వలన వ్యయం. ఉద్యోగ జీవనంలో ఆశించిన మార్పులు. 7,9 ,16 తేదీలు వ్యాపార రంగంలోని వారికి మంచిది. చివరి వారంలో మాత్రం దారి తప్పే ఆలోచనలతో మనశ్శాంతి లోపించును. అపార్ధాలు ఏర్పడును. నైపుణ్యానికి తగిన ప్రోత్సాహం లభించక నిరుత్సాహ పడతారు.

జనవరి 2022 మేష రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో కొద్దిపాటి చికాకులు, గృహ లేదా భూ సంబంధమైన నష్టం పొందుటకు అవకాశం ఉన్నది. ఆర్జించిన ధనం నిలువదు. ఉద్యోగ జీవనంలో అఖస్మిక ఉద్యోగ నష్టములు. పనిభారం కూడా పెరుగుతుంది. కుటుంబ పరమైన ఖర్చులు అదుపు తప్పుతాయి. ద్వితియ వారంలో కుటుంబ సభ్యులలో ఒకరికి శస్త్ర చికిత్స లేదా అనారోగ్యం వలన ఆందోళన ఎదురగును. తదనుకూల ధన వ్యయం. శ్రమ అధికమగును.మిత్రుల సహకారం కొంత వరకు లభించుట వలన ఉపశమనం లభించును. ముఖ్యంగా 27, 28, 29 తేదీలు అనుకూలం కాదు.

ఫిబ్రవరి 2022 మేష రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో సమస్యలు కొంత వరకు తగ్గును. నూతన గృహ సంబంధమైన లేదా గృహ మార్పిడి ప్రయత్నాలకు ఈ మాసం మంచి సమయం. కొద్దిపాటి కష్టంతో చేపట్టిన పనులు పూర్తి చేయగలుగుతారు. విద్యార్ధులకు మంచి కాలం. 9,10.16.25 తేదీలు విదేశీ ప్రయత్నములకు, నూతన ఉద్యోగ ప్రయత్నములకు అనుకూలమైనవి. ఋణాలు తొలగి ఊరట పొందుతారు. రావలసిన ధనం పొందుతారు.స్థిరాస్థి సంబంధ సమస్యలు తొలగుతాయి.

మార్చి 2022 మేష రాశి రాశీ ఫలాలు:
ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు పొందుతారు. వ్యక్తిగత విషయాలలో కొద్దిపాటి మానసిక ఆందోళన లేదా నమ్మిన వారి వలన మోసం, ధన వ్యయం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. జీవిత భాగస్వామి నుండి ఆశించిన సహకారం లభించదు. ద్వితీయ మరియు తృతీయ వారంలో ఆరోగ్య సమస్యలు పొందుటకు సూచనలు ఉన్నవి. 22 వ తేదీ తదుపరి నూతన ఆలోచనలు కార్యరూపం దాల్చును. ముఖ్యంగా 26, 27, 28 మరియు 29 తేదీలలో శుభ ఫలితాలు లభించుటకు అవకాశం ఉన్నది.

– శ్రీ జనయిత్రి వాస్తు జ్యోతిష్యాలయం

Also Read : Horoscope Zodiac Signs 2021-2022 : ప్లవ నామ సంవత్సరం పంచాంగం.. అన్ని రాశుల ఫలితాలు

Also Read : Horoscope Vrushabha Raasi Taurus : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర వృషభ రాశి ఫలాల

Also Read : Horoscope Midhuna Raasi Gemini : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర మిధున రాశి ఫలాలు

Also Read : Horoscope Karkataka Raasi Cancer : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర  కర్కాటక రాశి ఫలాల

Also Read : Horoscope Simha Raasi Leo : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర  సింహ రాశి ఫలాలు

Also Read: Horoscope Kanya Raasi virgo : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర కన్యా రాశి ఫలాలు

Also Read : Horoscope Thula Raasi Libra : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర తులా రాశి ఫలాలు

Also Read :   Horoscope vruschika raasi scorpio : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర  వృశ్చిక రాశి ఫలాలు

Also Read : Horoscope Dhanassu Raasi saggitarius : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర ధనస్సు రాశి ఫలాలు

 Also Read : Horoscope Makara Raasi Capricorn : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర మకరరాశి ఫలాలు

Also Read : Horoscope Kumbha Raasi aquarius : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర కుంభరాశి ఫలాలు

Also Read : Horoscope Meena Raasi Pisces : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర మీనరాశి ఫలాలు

మరింత తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి.

https://www.facebook.com/SirimalliPage