Horoscope Meena Raasi Pisces : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర మీనరాశి ఫలాలు

Horoscope Meena Raasi Pisces : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర మీనరాశి (Horoscope Meena Raasi Pisces) ఫలాలు :

శ్రీ ప్లవ నామ సంవత్సరంలో మీన రాశి వారికి ఆదాయం 11, వ్యయం – 05, రాజ పూజ్యం – 02, అవమానం – 04

పూర్వ పద్దతి లో మీన రాశి వారికి వచ్చిన శేష సంఖ్య “7”. ఇది శ్రీ ప్లవ నామ సంవత్సరంలో మీన రాశి వారికి వ్రుత్తి పరమైన జీవనంలో చక్కటి విజయం సూచించుచున్నది.

మీనరాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో అనగా 13-ఏప్రిల్-2021 నుండి 01-ఏప్రిల్-2022 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు గ్రహం వలన ఈ  సంవత్సర ప్రారంభం నుండి 19 నవంబర్ 2021 వరకు ప్రతీ వ్యవహారం చికాకులతో పూర్తి అగును. అదృష్టం అంతగా కలసి రాదు. అయితే చక్కటి మిత్ర వర్గం మాత్రం లభించును. నూతన ఉన్నత వ్యక్తిత్వం కలిగిన  వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. 20 నవంబర్ 2021 నుండి మీ చేతిపై ధర్మ కార్య సంబంధ వ్యయం తరచుగా ఏర్పడును. దీర్ఘ కాలికంగా ఎదురుచూస్తున్న విహార యాత్రలను అనుభవించ కలుగుతారు.

మీన రాశి(Horoscope Meena Raasi Pisces) వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో శని వలన  సంవత్సరం అంతా అనుకూల ఫలితాలు లభించును. ఆర్ధికంగా విశేష యోగం అనుభవిస్తారు. శని వలన ఈ సంవత్సరం తీవ్రమైన ప్రతికూల ఫలితాలు ఏమి లేవు. మీనరాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో ఏలినాటి శని దశ లేదు.

మీన రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో రాహు కేతువుల వలన సంవత్సరం అంతా సంపూర్ణ ఆయుర్భాగ్యములు , సంతోషములు ఏర్పడును. రాహు కేతువుల వలన అన్ని వర్గముల వారికి సుఖమయ జీవనం ఏర్పరచును. (వ్యక్తిగత జాతకంలో రాహు – కేతువులు నీచ క్షేత్రంలో ఉన్నవారు మాత్రం వ్యతిరేక ఫలితాలు పొందుతారు.)

ఏప్రిల్ 2021 మీన రాశి ఫలాలు :

ఈ మాసంలో పనులలో విఘ్నములు ఎదురగును. కుటుంబ పరంగా సామాన్య ఫలితాలు పొందుతారు. పితృ సంబంధ విషయాల వలన మానసిక చికాకు అనుభవిస్తారు. మీ ఊహలు నిజం కాగలవు. వృత్తి జీవనం వారికి, వ్యాపారస్థులకు సామాన్య ఆదాయం లభిస్తుంది. నూతన ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. వివాహ ప్రయత్నములలో ఏర్పడిన స్తంభన తొలగును. విద్యార్ధులకు పోటీ పరీక్షలలో ప్రతికూలమైన వాతావరణం ఉంది. చివరి నిమిషంలో కోరుకున్న విద్యా అవకాశములు పొందుతారు. ఈ మాసంలో ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలమైనవి ఈ మాసంలో 4,10,19,25 తేదీలు అనుకూలమైనవి కావు.

మే 2021 మీన రాశి ఫలాలు :

ఈ మాసం గృహ సంబంధ నిర్మానములకు, ఋణ ప్రయత్నములకు మంచిది కాదు. ద్వితియ వారంలో సన్మానం పొందు అవకాశం ఉన్నది. కార్య సిద్ధత లభిస్తుంది. విదేశీ ప్రయాణాలకు ఈ మాసం అనుకూలమైనది. ఏ పని చేపట్టినా పూర్తి చేయగలుగుతారు. అవసరాలకు లోటు ఏర్పడదు. సాంకేతక రంగ ఉద్యోగులకు చాలా అనుకూలమైన వారం. తృతీయ వారంలో చిన్నపాటి అనారోగ్య సమస్యలు. శస్త్ర చికిత్స చేయించుకొనుటకు సూచన ఉన్నది. సంతాన ప్రయత్నాలు వృధా ప్రయత్నములగును. నాలుగవ వారంలో సామాన్య ఫలితాలు ఎదురగును. కళత్రముతో చికాకులు తొలగును. నూతన అగ్రిమెంట్లు చేసుకుంటారు.

జూన్ 2021 మీన రాశి ఫలాలు :

ఈ మాసంలో కూడా పరిస్థితులు అనుకూలంగా ఉండును. ధనాదాయం బాగుంటుంది. వారసత్వ లేదా భూ లాభం ఏర్పడును. వ్యాపార వ్యపారాదులలో ఆశించిన దాని కన్నా ఎక్కువ ధనప్రాప్తి లభిస్తుంది. సుఖసంతోషాలు ఉన్నవి. వేడుకలలో పాల్గోనేదురు. కొన్ని నిర్ణయాలను చివరి నిమిషంలో మార్చుకుంటారు. దాని వలన లాభపడతారు. 16, 17, 18, 19 తేదీలలో అధిక భాద్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. లోహ సంబంధ వ్యాపారములు ఈ మాసంలో ప్రారంభించకూడద.  ఈ మాసంలో చేయు మిగిలిన వ్యాపార పెట్టుబడులు లాభించును.

జూలై 2021 మీన రాశి ఫలాలు :

ఈ మాసంలో మనసుకి కష్టం కలిగించే సంఘటనలు ఎదుర్కొందురు. చేపట్టిన పనులు ముందుకు సాగవు. స్థిరత్వం ఉన్న ఆలోచనలు ఏర్పడవు. మీ సహనాన్ని పరీక్షించే సంఘటనలు ఎదుర్కొంటారు. వాహనాల విషయంలో ప్రమాదాలు  చోటుచేసుకోను సూచనలు ఉన్నవి. 25 వ తేదీ తదుపరి కాలం కలసి వచ్చును.శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి. ధనలబ్ది లభిస్తుంది. ఈ మాసంలో 2,6,7,13,15 వ తేదీలు అనుకూలమైనవి కావు.

ఆగస్టు 2021 మీన రాశి ఫలాలు :

ఈ మాసం కూడా మిశ్రమ ఫలితాలను కలిగించును. చెడు ఆలోచనలు కొనసాగి మనసు నిలకడగా ఉండదు. మానసిక ఆందోళన కొరకు వైద్య సహాయం అవసరమగును. ధనాదాయం సామాన్యం. కుటుంబ వ్యవహారాలలో ఉద్రిక్తత ఎదుర్కొంటారు. తలపెట్టిన ప్రయత్నాలలో విఘ్నములు. మీలో ఉన్న నైపుణ్యానికి తగిన గుర్తింపు లభించదు.  చివరి వారం నుండి పరిస్థితులలో అనుకూల మార్పు వస్తుంది. ఈ మాసంలో 7 నుండి 13 వ తేదీల మధ్య వాహనాల విషయంలో,ప్రయాణాల విషయంలో జాగ్రత్త అవసరం.

సెప్టెంబర్ 2021 మీన రాశి ఫలాలు :

ఈ మాసం ప్రధమ వారంలో ఒక అశుభ వార్త మిమ్మల్ని భాదిస్తుంది. అనవసర తగాదాల వలన మనో విచారం ఏర్పడుతుంది. తెలిసిన వ్యక్తుల వలన ఆర్ధిక నష్టం ఎదుర్కొంటారు. జాగ్రత్త అవసరం. 5 నుండి 17 వ తేదీ మధ్య కాలంలో ఉద్యోగ జీవనంలో తీవ్ర ఒడిదుడుకులు లేదా ఉద్యోగ నష్టం. రక్త సంబంధ అనారోగ్య సమస్యలు ఉన్న వారికి జాగ్రత్త అవసరం. ప్రయత్నాలలో అదృష్ట రాహిత్యత వెంటాడుతుంది..

అక్టోబర్ 2021 మీన రాశి ఫలాలు :

ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. మీ నైపుణ్యం అందరికి తెలుస్తుంది. అనుకున్న విధంగా కుటుంబంలో ముఖ్య విషయాలు చర్చించగలరు. దీర్గకాళిక కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి.నూతన వ్యాపారములు మధ్యమంగా  ఫలించును. ఉద్యోగ జీవనంలో అనుకున్న లక్ష్యాలు పూర్తి చేయగలుగుతారు. ప్రయాణములు వలన అలసట మరియు లాటరీల వలన నష్టం ఏర్పడు సూచన. హామీలు ఇచ్చుట పనికిరాదు.

నవంబర్ 2021 మీన రాశి ఫలాలు :

ఈ మాసంలో కూడా అనుకూలమైన ఫలితాలు పొందుదురు. వృత్తి వ్యాపారములలో లాభం పొంది ఆర్ధిక ఋణములు తీర్చివేస్తారు. తలచిన ప్రతీ ఆర్ధిక కార్యం విజయం పొందును. రావలసిన ధనం చేతికి వచ్చును. తృతీయ వారములో కళత్ర వర్గం వారితో వైరం భాదిస్తుంది. వివాహ ప్రయత్నములకు , సంతాన ప్రయత్నాలకు ఈ మాసం అంతగా మంచిది కాదు. ఈ మాసంలో 7,8,9 తేదీలలో ఆదాయం బాగుండును. శుభవార్తలు లభిస్తాయి ఈ మాసంలో 19, 20, 21, 22 వ తేదీలు అంతగా అనుకూలమైనవి కావు.

డిశంబరు 2021 మీన రాశి ఫలాలు :

ఈ మాసంలో ధన ఆదాయం పెరుగును. కుటుంబ సంతోషాలు పుష్కలంగా ఉన్నవి. పిన్న వయస్సు వారికి ఆశించిన వృద్ధి లభించును. విదేశీ ప్రయత్నాలు లాభించును. గౌరవ మర్యాదలు సంఘపరంగా పెరుగును. ఊహించని సంఘటనలు అనుభూతి చెందుతారు. ఈ మాసం కళారంగం వారికి ఆశించిన పురోగతి లభిస్తుంది. వ్యక్తిగత జీవన  విధానంలో ధార్మిక ఆలోచనలు అమలు చేయగలుగుతారు.

జనవరి 2022 మీన రాశి ఫలాలు :

ఈ మాసంలో చక్కటి ఆరోగ్యం అనుభవిస్తారు. శత్రు నాశనం ఏర్పడుతుంది. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. వ్రుత్తి జీవనం లోని వారికి ఆదాయంలో పెరుగుదల ఏర్పడుతుంది. పనులలో గుర్తింపు లభిస్తుంది. గృహ నిర్మాణ పనులు పూర్తి చేస్తారు. 10 నుండి 14 తేదీల మధ్య చేయు వివాహ ప్రయత్నములు కలసి వస్తాయి. నూతన వస్తువులు అమర్చుకుంటారు జీవిత భాగస్వామితో సౌఖ్యత ఆనంద పరుస్తుంది. ఎదిగిన సంతానం అభివృద్ధిక స్తానాన్ని పొందుట సంతోషం ఏర్పరుస్తుంది.

ఫిబ్రవరి 2022 మీన రాశి ఫలాలు :

ఈ మాసం విద్యార్ధులకు అనుకూలమైన ఫలితాలను ఏర్పరచును. ధనాదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. గృహంలో శుభకార్యములు నిర్వహిస్తారు. దాదాపు అన్ని విషయాలలో ఈ మాసం అనుకూలత ఏర్పరుస్తుంది. ఉద్యోగ జీవనంలో ఉన్నత స్థితి అనుభవిస్తారు. వాహన వివాహాది సంబంధ విషయాలలో లాభములు పొందుతారు. సంతాన ప్రయత్నములు కూడా  ఫలించును.

మార్చి 2022 మీన రాశి ఫలాలు :

ఈ మాసంలో స్థానచలనము కొరకు చేయు ప్రయత్నములు లాభించును. స్త్రీ మూలక ధనప్రాప్తి అనుభవిస్తారు. సువర్ణ  వ్యాపారములలో ప్రభుత్వ సంబంధ ఇబ్బందులు. 19 వ తేదీ తదుపరి వృధా వ్యయము తరచుగా ఎదుర్కొంటారు. ముఖ్యంగా  ఆడంబరాలకు మిక్కిలిగా వ్యయము చేస్తారు. నాలుగవ వారంలో ఉద్యోగ జీవనంలోని వారికి తీవ్ర ఒత్తిడి ఎదురగుతుంది. ఈ మాసంలో 8,15,17,20 తేదీలు అంత అనుకూలమైనవి కావు.

– శ్రీ జనయిత్రి వాస్తు జ్యోతిష్యాలయం

Also Read : Horoscope Zodiac Signs 2021-2022 : ప్లవ నామ సంవత్సరం పంచాంగం.. అన్ని రాశుల ఫలితాలు

Also Read : Horoscope Mesha Raasi Aries : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర మేష రాశి ఫలాలు

Also Read : Horoscope Vrushabha Raasi Taurus : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర వృషభ రాశి ఫలాల

Also Read : Horoscope Midhuna Raasi Gemini : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర మిధున రాశి ఫలాలు

Also Read : Horoscope Karkataka Raasi Cancer : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర  కర్కాటక రాశి ఫలాల

Also Read : Horoscope Simha Raasi Leo : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర  సింహ రాశి ఫలాలు

Also Read: Horoscope Kanya Raasi virgo : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర కన్యా రాశి ఫలాలు

Also Read : Horoscope Thula Raasi Libra : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర తులా రాశి ఫలాలు

Also Read :   Horoscope vruschika raasi scorpio : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర  వృశ్చిక రాశి ఫలాలు

Also Read : Horoscope Dhanassu Raasi saggitarius : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర ధనస్సు రాశి ఫలాలు

 Also Read : Horoscope Makara Raasi Capricorn : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర మకరరాశి ఫలాలు

Also Read : Horoscope Kumbha Raasi aquarius : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర కుంభరాశి ఫలాలు

మరింత తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి.

https://www.facebook.com/SirimalliPage