Marilyn Monroe: అలనాటి నటి పెయింటింగ్.. ధర వెయ్యి కోట్లకు పైనే..
Latest Off Beat

Marilyn Monroe: అలనాటి నటి పెయింటింగ్.. ధర వెయ్యి కోట్లకు పైనే..

Marilyn Monroe: అభిమానానికి అవధులు ఉండవు. ప్రేక్షకులు ఎవరైనా నటినటులను అభినంచిడం మొదలుపెడితే.. వారిని తమలో ఒకరిగా, సాధారణ మనుషుల్లాగా చూడలేరు. అలాంటి అభిమానంతో వారు ఏం చేసినా.. దానికి లాజిక్‌లు ఉండవు. తమ అభిమాన హీరో సినిమా ఫప్ట్ డే చూడాలని ఎంత ఖర్చు పెట్టి అయినా టికెట్ కొంటారు కొందరు. అయితే ఒక గాయకుడు మాత్రం అభిమానంతో అలనాటి నటి పెయింటింగ్ వేసి.. దాని ధరను ఏకంగా వేయి కోట్లకు పైనే నిర్ణయించాడు.

పాప్ సింగర్లు అంటే భారతీయ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. ఎందుకంటే ఇక్కడ పాప్ కల్చర్ తక్కువ. అదంతా అమెరికా, ఇంగ్లాండ్‌లాంటి ఫారిన్ దేశాల్లోనే పాప్ కల్చర్‌కు బాగా క్రేజ్ ఉంది. అందుకే అక్కడ పాప్ సింగర్స్ కూడా బాగా ఫేమస్. అలా ఒకప్పుడు పాప్ సింగర్‌గా, రొమాంటిక్ హీరోయిన్‌గా కుర్రకారు మనస్సును కొల్లగొట్టింది మార్లిన్‌ మన్రో. 1947 నుండి దాదాపు పది సంవత్సరాల పాటు హాలీవుడ్‌లో మార్లిన్ హవా కొనసాగింది.

Also Read: https://www.sirimalli.com/rrr-review-one-more-magnum-opus-action-drama-from-rajamouli/

మార్లిన్‌ మన్రో హీరోయిన్‌గా హాలీవుడ్‌లోకి అడుగుపెట్టే వరకు కేథరిన్, బర్బరా వంటి స్టార్లు అప్పటి యూత్‌కు ఫేవరెట్ హీరోయిన్లుగా నిలిచిపోయారు. అదే సమయంలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి.. ఫస్ట్ స్క్రీన్ ప్రెసెన్స్ నుండే మ్యాజిక్ చేయడం మొదలుపెట్టింది మార్లిన్. హీరోయిన్‌గానే కాకుండా సింగర్‌గా కూడా పలు స్టేజ్ షోలు చేసి చాలామంది అభిమానులను సంపాదించుకుంది.

అయితే అలనాటి తార మార్లిన్‌ మన్రోపై అభిమానాన్ని చాటుకోవడానికి పాప్ సింగర్ ఆండీ వార్హోల్‌.. తన డిజిటల్ పెయింటింగ్‌ను గీశాడు. త్వరలోనే ఇది వేలంపాటకు రానుంది. అయితే ఈ చిత్రానికి మినిమమ్ ధర రూ.1521 కోట్లుగా నిర్ణయించింది జూలియన్స్ ఆక్షన్స్ సంస్థ . ఈ పెయింటింగ్ ఇంత ధర పలుకుతుందా అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు మాత్రం మార్లిన్ క్రేజ్‌కు ఇదే కరెక్ట్ రేట్ అంటున్నారు. ఒకవేళ ఇదే ధరకు ఈ పెయింటింగ్ అమ్ముడుపోతే అది ఒక రికార్డ్ అనుకుంటున్నారు హాలీవుడ్ ప్రేక్షకులు.