Politics

ఉత్కంఠపోరులో సువేందు అధికారిపై మమత బెనర్జీ విజయం..!

అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన నందిగ్రామ్‌ ఎన్నికల్లో… తృణమూల్‌ అధినేత్రి మమత బెనర్జీ విజయం సాధించారు. 1,200 ఓట్ల మెజార్టీతో తన ప్రత్యర్థి సువేందు అధికారిపై మమత విజయం సాధించారు.

కౌంటింగ్‌ ప్రారంభం నుంచి నందిగ్రామ్‌ ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. మమతకు గట్టి పోటీ ఇచ్చిన సువేందు.. ఆరంభ రౌండ్లలో ఆధిక్యం కనబర్చారు. అయితే మధ్య రౌండ్లలో పుంజుకున్న మమత చివరికి 1,200 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించారు.

అటు మ్యాజిక్ ఫిగర్ ను ఎప్పుడో దాటేసిన తృణమూల్‌ కాంగ్రెస్ ముచ్చటగా మూడోసారి అధికారాన్ని చేపట్టనుంది. ఈ సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు ఆమెకి అభినందనలు తెలుపుతున్నారు.