Bhakthi

Horoscope Makara Raasi Capricorn : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర మకరరాశి ఫలాలు

Horoscope Makara Raasi Capricorn :  2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర మకరరాశి (Horoscope Makara Raasi Capricorn) ఫలాలు :

ఉత్తరాషాడ 2,3,4 పాదములు లేదా శ్రవణం 1,2,3,4 పాదములు లేదా ధనిష్ఠ 1,2, పాదములలో జన్మించినవారు మకర రాశికి చెందును.

శ్రీ ప్లవ నామ సంవత్సరంలో మకర రాశి వారికి ఆదాయం – 14, వ్యయం – 14, రాజ పూజ్యం – 03, అవమానం – 01

పూర్వ పద్దతి లో మకర రాశి వారికి వచ్చిన శేష సంఖ్య “3”. ఇది శ్రీ ప్లవ నామ సంవత్సరంలో మకర రాశి వారికి ఆరోగ్య చికాకులను, కుటుంబ సమస్యలను సూచించుచున్నది.

మకరరాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో అనగా 13-ఏప్రిల్-2021 నుండి 01-ఏప్రిల్-2022 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో కూడా ఏలినాటి శని దశ ఉన్నది. శ్రీ ప్లవ నామ సంవత్సరంలో మకర రాశి వారికి గురు గ్రహం వలన మిశ్రమ ఫలితాలు ఏర్పడతాయి. గురువు వలన ఈ సంవత్సర ప్రారంభం నుండి 19 నవంబర్ 2021 వరకు ప్రతికూల ఫలితాలు, 20 నవంబర్ 2021 నుండి అతి చక్కటి అనుకూల ఫలితాలు పొందుతారు. ఆశించిన విధంగా ధనం వృద్ది చెందుతుంది. సంతాన ప్రయత్నాలలో కూడా సఫలత లభిస్తుంది.

మకర రాశి వారికి(Horoscope Makara Raasi Capricorn) శ్రీ ప్లవ నామ సంవత్సరంలో కూడా ఏలినాటి శని దశ ఉన్నది. శనైచ్చరుడు తనుస్థానంలో స్వక్షేత్రం లో ఉండుట వలన వ్యక్తిగత జాతకంలో శని దోషం ఉన్న మకర రాశి వారికి ఈ ప్లవ నామ సంవత్సరం అంతా కలసి రాదు. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశాపరచును. స్త్రీలు మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందురు. వృధాగా ధనం వ్యయం అగును. మీ కుటిల స్వభావం వలన మంచి మిత్రులను దూరం చేసుకొనుటకు సూచనలు అధికంగా ఉన్నవి. చర్మ సంబంధ సుఖ వ్యాధులు వలన బాధలు ఎదుర్కొందురు.

మకర రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో రాహు – కేతువులు ఇరువురి వలన వ్యక్తిగతంగా తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడవు. అయితే జూలై నుండి డిసెంబర్ మధ్య కాలంలో బాగా ఎదిగిన సంతానానికి ఆరోగ్య సమస్యలు ఏర్పరచును.

ఏప్రిల్ 2021 మకర రాశి ఫలాలు:

ఈ మాసంలో అతి కష్టం మీద ఆశించిన ఉద్యోగం పొందుతారు. ధనాదాయం సామాన్యం. పెద్ద వ్యక్తులతో ఉన్న పరిచయాల వలన పలుకుబడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారములు సామాన్యంగా కొనసాగుతాయి. తృతీయ వారంలో గృహంలో ఆకస్మిక శుభకార్యములు ఏర్పడును. బంధు వర్గ సమాగమం. కుటుంబ సభ్యులపై మీ ప్రేమను చాటుకుంటారు. ఆరోగ్యంలో కొంత మెరుగుదల ఆనంద పరుస్తుంది. మాసాంతంలో పారిశ్రామిక వేత్తలకు శుభవార్త. వివాహ ప్రయత్నములు లాభించును. ఈ మాసంలో 5,8,10,14,19 తేదీలు అంత అనుకూలమైనవి కావు.

మే 2021 మకర రాశి ఫలాలు:

ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. నూతన పదవులు ఆశించిన వారికి కష్టం మీద పదవులు ప్రాప్తించును. ఉద్యోగ జీవనములో స్థిరత్వం ఉండదు. కుటుంబ సంతోషములు మాధ్యమం. నూతన గృహ సంబంధ ప్రయత్నాలు, స్థానచలన ప్రయత్నాలు విజయవంతం కావు. 16వ తేదీ తదుపరి నూతన వ్యాపారములు యోగించును మరియు నూతన వస్తువుల అమరిక లభించును. మాసాంతంలో వివాహిత స్త్రీలకు తమ వైవాహిక జీవన భవిష్యత్ గురించిన ఆందోళన ఏర్పడు సూచన. ఈ మాసంలో 1,6,10,19 తేదీలు అనుకూలమైనవి కావు.

జూన్ 2021 మకర రాశి ఫలాలు:

ఈ మాసంలో ధనాదాయం కొంత తగ్గును. ప్రధమ వారంలో మిత్రులతో లేదా ఉన్నత అధికారులతో విభేదములు భాదించు సూచన. ద్వితియ వారంలో లాభ వ్యయాలు సమానంగా ఉండును మరియు కుటుంబ జీవనంలో మిశ్రమ ఫలితాలు లభించును. తృతీయ వారంలో సంతానం ప్రయత్నాలు సఫలమగుట వలన సౌఖ్యత. కుటుంబ వాతావరణం తిరిగి అదుపులోకి వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత సాధించగలుగుతారు. రాజకీయ తగాదాలలో విజయం. 20 వ తేదీ నుండి ఆర్ధిక పరమైన విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది. పనుల్లో మరింత పురోగతి సాధించగలుగుతారు

జూలై 2021 మకర రాశి ఫలాలు:

ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. ముఖ్యమైన కార్యక్రమాలు నిదానిస్తాయి. ఆదాయం సామాన్యంగా ఉన్నప్పటికీ అవసరాలకు అప్పులు చేయవలసి వచ్చును. ప్రధమ వారంలో వృత్తి వ్యాపారములు సామాన్యంగా కొనసాగును. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తికి ఈ మాసం 5,6 తేదీలు అనుకూలమైనవి. ద్వితియ వారంలో సువర్ణ సంబంధ కోరికలు తీరును. నూతన పరిచయాలు ఏర్పడతాయి. తృతీయ వారం సామాన్య ఫలితాలు ఏర్పడుతాయి. బంధు పరంగా కొద్దిపాటి ఆటంకములు మాత్రం ఉంటాయి. మీ పై బంధువులు అభాండములు మోపవచ్చు.

ఆగస్టు 2021 మకర రాశి ఫలాలు:

ఈ మాసంలో ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. వ్యయం అధికం అవుతుంది. పొదుపు ప్రణాళికలు విఫలం అవుతాయి. చిన్న విషయాలు కూడా ఇబ్బందికరంగా మారతాయి. స్త్రీలు ప్రేమ వ్యవహారముల వలన నష్టపోవుదురు. తలచిన విధంగా వ్యక్తులు వ్యవహరించరు. అపవాదులు మరియు నమ్మక ద్రోహం ఎదురగును. ఈ మాసంలో 14,15,17 తేదీలలో ఆరోగ్య సమస్యలు మాసాంతంలో కూడా అధిక ధనవ్యయం ఏర్పడుతుంది. మొత్తం మీద ఈ మాసం అంత అనుకూలం కాదు.

సెప్టెంబర్ 2021 మకర రాశి ఫలాలు:

ఈ మాసం కొంత అనుకూల ఫలితాలు పొందుతారు. ఉద్యోగ పరంగా నిలిచిపోయిన పనులు మరియు మార్పుకు సంబంధించిన ప్రయత్నాలు ఈ మాసంలో విజయవంతం అగును. గృహ సంతోషములు మధ్యమం. సంతాన ప్రయత్నములు లాభించును. కోర్టు వ్యవహారాలు కలిగిన వారు గందరగోళ వాతావరణం అనుభవిస్తారు. ఈ మాసంలో 21 నుండి 27 తేదీల మధ్య ఆర్ధిక సంబంధ కార్యక్రమాలలో జాగ్రత్త వహించవలెను. ఈ కాలంలో వ్యాపార రంగంలోని వారికి ఆకస్మికంగా ధనాదాయం స్థంభించును. పెట్టుబడులలో తొందరపాటు వద్దు.

అక్టోబర్ 2021 మకర రాశి ఫలాలు:

ఈ మాసంలో శరీర అనారోగ్యం చికాకులు ఏర్పరచును, వివాహ ప్రయత్నాలు విఫలం అగును. ఆస్తుల అమ్మకాలకు ఆటంకాలు ఉన్నవి. కోరుకొన్న మార్పులు చివరిలో నిలిచిపోవును. ధార్మిక కార్యక్రమాల కొరకు వ్యయం చేస్తారు.. ధార్మిక చింతన కొంత అశాంతి ని పోగొడుతుంది. 14 వ తేదీ తదుపరి అనుకూల పరిస్థితులు ప్రారంభం అవుతాయి. వ్యవహార విజయం, వృత్తి వ్యాపారదులలో జయం పొందుతారు. 23,24,25, 26 తేదీలలో వ్యాపార వర్గమునకు అతి చక్కటి కాలం. పెట్టుబడులు లాభించును.

నవంబర్ 2021 మకర రాశి ఫలాలు:

ఈ మాసం అనుకూలమైన కాలం. ప్రతీ కార్యం విజయం పొందును. బంధువులు, స్నేహితుల తోడ్పాటు లభించుట వలన కష్టముల నుండి బయట పడుడురు. రావాల్సిన ధనం చేతికి లభించును. కోర్టు వ్యవహారములలో అనుకూల ఫలితాలు. అనారోగ్య సమస్యలనుండి చాలా వరకూ ఉపశమనం పొందుతారు. ఈ మాసం అన్ని రంగముల వారికి అనుకూలత ఏర్పరుస్తుంది. మీ చేతిపై పుణ్య కార్యములు అమలగును . ఈ మాసంలో 5,9,17,26 తేదీలలో కొద్దిపాటి మిశ్రమ ఫలితాలు పొందుతారు.

డిశంబరు 2021 మకర రాశి ఫలాలు:

ఈ మాసంలో గృహ సంబంధమైన వ్యవహరాదులు సంతోషకరంగా నడుస్తాయి. ధనాదాయం పెరుగుతుంది. కళత్ర వర్గం వారి వలన తోడ్పాటు, లాభములు పొందుతారు. రుణాలకు సంబందించిన ఒత్తిడులు తొలగుతాయి. అవసరమైన పనులకు ధనం లభిస్తుంది. తోటి ఉద్యోగులతో అభిప్రాయ భేదాలు తొలగుతాయి. ఆశించిన విధంగా వైద్య సేవలు పొందగలుగుతారు.ఈ మాసం మొత్తం మీద అనుకూల ఫలితాలు ఏర్పరచును.

జనవరి 2022 మకర రాశి ఫలాలు:

ఈ మాసంలో మిశ్రమ ఫలితాలను ఏర్పడుతాయి. వ్యాపార రంగంలో పోటీ వలన ఆదాయంలో తగ్గుదల ఏర్పడుతుంది. మాతృ వర్గీయులతో విభేదాల వలన మానసిక అశాంతి. 10,11,12 తేదీలలో విహార యాత్రలు లేదా గృహ సంతోషాలు. 22,23,24 తేదీలలో ఆరోగ్య సంబంధ ఇబ్బందులు ఎదుర్కొనుటకు సూచనలు ఉన్నవి. ఉద్యోగ మార్పు కొరకు ప్రయత్నించుట మంచిది కాదు. వైద్య రంగంలోని వారు 22 నుండి 25 వ తేదీల మధ్య కాలంలో చేసే శస్త్ర చికిత్సల్లో జాగ్రత్తగా ఉండవలెను. మొత్తం మీద ఈ మాసంలో కుటుంబ పరమైన వ్యక్తిగత జీవనంలో అనుకూల ఫలితాలు ఉన్నప్పటికీ ఆర్ధికంగా అసంపూర్తి ఎదుర్కొంటారు.

ఫిబ్రవరి 2022 మకర రాశి ఫలాలు:

ఈ మాసంలో చక్కటి అనుకూల ఫలితాలు ఏర్పరచును. ఉద్యోగ జీవనంలో ఉన్నతి లేదా స్థిరాస్తి సంబంధమైన ఆర్ధిక లాభాలు పొందుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. ఆత్మీయుల వలన అవసరమైన సౌఖర్యములు ఏర్పరచుకొంటారు. కలహములు తొలగును. కీర్తి – ప్రతిష్టలు ఆర్జించెదరు. 18,19, 20 తేదీలు ప్రయాణములకు కలసి వచ్చును.

మార్చి 2022 మకర రాశి ఫలాలు:

ఈ మాసంలో కూడా చక్కటి ధనాదాయం కొనసాగును. అన్ని విధములా ఈ మాసం కలసి వచ్చును. ఇష్ట దేవాలయ దర్శన, కుటుంబంలోని పెద్ద వయస్సు వారి ఆరోగ్య సమస్యలు తగ్గుట. జీవిత భాగస్వామి సౌఖ్యం,. నూతన కార్యములందు ఆశించిన విజయం వంటి అనుకూల ఫలితాలు పొందుతారు.

– శ్రీ జనయిత్రి వాస్తు జ్యోతిష్యాలయం

Also Read : Horoscope Zodiac Signs 2021-2022 : ప్లవ నామ సంవత్సరం పంచాంగం.. అన్ని రాశుల ఫలితాలు

Also Read : Horoscope Mesha Raasi Aries : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర మేష రాశి ఫలాలు

Also Read : Horoscope Vrushabha Raasi Taurus : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర వృషభ రాశి ఫలాల

Also Read : Horoscope Midhuna Raasi Gemini : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర మిధున రాశి ఫలాలు

Also Read : Horoscope Karkataka Raasi Cancer : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర  కర్కాటక రాశి ఫలాల

Also Read : Horoscope Simha Raasi Leo : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర  సింహ రాశి ఫలాలు

Also Read: Horoscope Kanya Raasi virgo : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర కన్యా రాశి ఫలాలు

Also Read : Horoscope Thula Raasi Libra : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర తులా రాశి ఫలాలు

Also Read :   Horoscope vruschika raasi scorpio : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర  వృశ్చిక రాశి ఫలాలు

Also Read : Horoscope Dhanassu Raasi saggitarius : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర ధనస్సు రాశి ఫలాలు

Also Read : Horoscope Kumbha Raasi aquarius : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర కుంభరాశి ఫలాలు

Also Read : Horoscope Meena Raasi Pisces : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర మీనరాశి ఫలాలు

మరింత తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి.

https://www.facebook.com/SirimalliPage