Bhakthi

Sri Rama Navami : శ్రీరాముడు పుట్టిన పర్వదినాన.. సీతారాముల కల్యాణానికి ముహూర్తం పెట్టింది ఎవరో తెలుసా?

Sri Rama Navami : శ్రీరాముడు పుట్టిన పర్వదినాన.. సీతారాముల కల్యాణానికి ముహూర్తం పెట్టింది ఎవరో తెలుసా?
శ్రీరామనవమి (Sri Rama Navami )అంటే రాముడి పెండ్లి రోజే కాదు… అది ఆయన అవతరించిన రోజు కూడా..

చైత్ర శుద్ధ నవమి నాడు రాముడి జననం .

మరి పుట్టినరోజు పెండ్లి రోజుగా ఎలా మారిందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన విషయం .

శ్రీరాముడి అవతరించిన రోజును పెండ్లి రోజుగా నిర్ణయించిన ఆ గొప్ప ముహూర్తాన్ని ఎవరు నిర్ణయించారు ?

Lord Rama Kalyanam
Lord Rama Kalyanam

నేడు ప్రపంచ వ్యాప్తంగా రాముడు జన్మించిన చైత్ర శుద్ధ నవమి రోజున రాముడి కళ్యాణం జరగటానికి మూలకారకుడు , ఆద్యుడు ఆ దివ్య ముహూర్త రూపకర్త , సృష్టికర్త భక్తరామదాసు.

ఇంతటి గొప్ప ముహూర్త నిర్ణయం జరిగింది 400 సంవత్సరాల క్రితం భద్రాచలం లో అన్నది అందరూ తెలుసుకోవలసిన విషయం .

రాముడి కళ్యాణం నిర్వహించాలని భక్తరామదాసు 400 సంవత్సరాల క్రితం భావించారు . అందుకోసం మంచి ముహూర్తాన్ని చూడాలని పండితులను కోరారు . భద్రాచలం లోని పూజాది కార్యక్రమాలు అన్ని పాంచరాత్ర ఆగమం ప్రకారం జరుగుతాయి (శ్రీరంగం మాదిరిగా ).

Lord Rama Kalyanam
Lord Rama Kalyanam

పాంచరాత్ర ఆగమ శాస్త్రంలోని పరమ పురుష సంహిత లో ఉన్న ఒక శ్లోకం ప్రామాణికంగా రాముడి కల్యాణ ముహూర్తాన్ని పండితులు నిర్ణయించారు. అదే చైత్ర శుద్ధ నవమి. అవతార పురుషులు , దివ్యమూర్తుల కల్యాణ ముహూర్తాలు నిర్ణయించే సందర్భంలో ప్రామాణికం అయిన ఒక శ్లోకం అయిన …”ఎస్య అవతార దివసే ..తస్య కల్యాణ ఆచరేత్ “. ( పరమ పురుష సంహిత ) అంటే ఏ రోజు జన్మిస్తే ఆ రోజు కళ్యాణం చేయడం .

రాముడు జన్మించింది చైత్ర శుద్ధ నవమి అందుకే రాముడి కల్యాణo ఆయన పుట్టినరోజునే చేస్తున్నారు.

ఇంతటి విశిష్ట కల్యాణ ముహూర్త నిర్ణయం జరిగిన పుణ్యక్షేత్రం భద్రాచలం. అందుకు ఆద్యుడు , రూపకర్త , ఈ ముహూర్త సృష్టికర్త భక్త రామదాసు.

Lord Rama with Sita
Lord Rama with Sita

వాల్మీకి రామాయణం లో కానీ , పద్మ పురాణంలో కానీ రాముడి కళ్యాణం చైత్ర శుద్ధ నవమి రోజున జరిగినట్లు ఎక్కడా చెప్పలేదు.

నాడు భద్రాచలం లో నిర్ణయించబడిన ఈ విశేష ముహూర్తం విశ్వవ్యాప్తమై , చైత్ర శుద్ధ నవమి రోజున ప్రపంచ వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్నాయి. ఆ ముహూర్త నిర్ణయ
స్థల కేంద్ర బిందువు భద్రాచలం కాగా , ఆ ముహూర్త సృష్టికర్త భక్త రామదాసు.

Lord Rama
Lord Rama

భద్రాచలం లో రాముడి కల్యాణాన్ని అభిజిత్ లగ్నం లో నిర్వహిస్తారు. అభిజిత్ లగ్నం అంటే సూర్యుడు నడినెత్తిమీదకు వచ్చే సమయం. ఇది దోష రహిత ముహూర్త సమయం. దీనినే గ్రామాల్లో గడ్డ పార ముహూర్తం అంటారు. అంతటి గొప్ప వైశిష్ట్యం కలిగింది భద్రాచలం శ్రీరామనవమి వేడుక. అందుకే ఆ నీలమేఘశ్యాముడి కల్యాణాన్ని కనులారా తిలకించి జన్మను చరితార్థం చేసుకుంటారు భక్తులు.

జై శ్రీరామ్
కోన ఆనంద్ కుమార్, జర్నలిస్ట్, భద్రాచలం (వాట్సప్ పోస్ట్)

ఇవి కూడా చదవండి : 

Also Read : Today Horoscope : 21-04-2021 బుధవారం నేటి రాశిఫలాలు

Also Read : Today Panchangam : 21-04-2021 బుధవారం నేటి పంచాంగం

Also Read : Today Amrutha Gadiyalu : అమృత ఘడియలు, శుభ సమయములు.. ఈ రోజు అమృత ఘడియలను చూస్తే..

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/SirimalliPage