Cinema

Jwala Gutta : గుత్తా జ్వాల పెళ్లి.. మహారాష్ట్రలో పుట్టి.. తెలుగు నేలపై పెరిగి.. తమిళ అబ్బాయిని పెళ్లాడి.. అసలు కథ ఏమిటంటే..

Jwala Gutta : గుత్తా జ్వాల పెళ్లి.. మహారాష్ట్రలో పుట్టి.. తెలుగు నేలపై పెరిగి.. తమిళ అబ్బాయిని పెళ్లాడి.. అసలు కథ ఏమిటంటే..

Jwala Gutta : ఆరడుగుల అందం.. బ్యాడ్మింటన్ కోర్టులో ఎగిరెగిరి ఆడుతుంటే.. ప్రేక్షకుల గుండె జారి గల్లంతైంది. అసలే అమ్మడు చైనా పీస్ లా ఉంటుంది. అందులోనూ అన్నీ ఏర్చి కూర్చి అందాల బొమ్మను తయారుచేసి ప్రాణం పోస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది జ్వాల సొగసు. అందుకే అభిమానుల గుండెల్లో ఆటతో పాటు బ్యూటీతోనూ జ్వాలను రగిల్చింది. ఇప్పుడు తమిళ యువహీరో విష్ణు విశాల్ ను పెళ్లి చేసుకోవడంతో తన పర్సనల్ లైఫ్ లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినట్లయింది.

guttajwala
guttajwala

జ్వాలకు, విశాల్ కు… ఇద్దరికీ ఇది రెండో పెళ్లే. మూడేళ్లుగా డేటింగ్ లో ఉన్నారు. ఇప్పుడు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కానీ జ్వాల నేపథ్యాన్ని చూస్తే మాత్రం.. మన పూరీ జగన్నాథ్ తీసిన అమ్మా, నాన్న ఓ తమిళమ్మాయి సినిమా గుర్తొస్తుంది. కాకపోతే.. ఇక్కడ కొంచెం మార్చుకోవాలి. తమిళమ్మాయి ప్లేసులో తమిళబ్బాయి అని మార్చేస్తే సరిపోతుంది. దీనికి బ్యాక్ గ్రౌండ్ స్టోరీ కూడా ఉందిలెండి.

 

gutta jwala 2
gutta jwala 2

ఎవరికైనా వయసు పెరుగుతుంటే అందం తగ్గుతుంది. కానీ అదేంటో కాని జ్వాల దీనికి పూర్తిగా రివర్స్. యంగ్ ఏజ్ లో ఎలా ఉందో.. మిడిల్ ఏజ్ లోనూ అలాగే ఉంది. ఇంకా చెప్పాలంటే ఆమె సొగసు పెరిగింది. నిజం చెప్పాలంటే జ్వాల తెలుగింటి అమ్మాయి కాదు. కాకపోతే ఇక్కడే పెరిగింది. మహారాష్ట్రలో వార్దాలో 1983లో పుట్టింది. తండ్రి గుత్తా క్రాంతి తెలుగువాడే అయినా.. తల్లి ఎలెన్ మాత్రం చైనా దేశస్థురాలు. అందుకే జ్వాల చైనా అమ్మాయిలా కనిపిస్తుంది.

Gutta Jwala 3
Gutta Jwala 3

గుత్తా జ్వాల తాత చెంగ్.. వార్దాలోని సేవాగ్రాం ఆశ్రమంలో మహాత్మాగాంధీ శిష్యుడు. #గాంధీ ఆత్మకథతో పాటు ఇతర రచనలను చైనా భాషలోనికి అనువదించాడు. అక్కడ మొదలైంది.. చైనాతో బంధం. ఇక వీళ్ల సొంతూరేమో.. ఆంధ్రప్రదేశ్ లోని గుత్తావారిపాలెం. ఆమె మరో తాతగారు.. గుత్తా సుబ్రమణ్యం అభ్యుదయ వాది. స్వాతంత్ర్య సమయంలో వీరి కుటుంబానికి పోరాట చరిత్రుంది. తరువాత తమిళనాడుకు వెళ్లి పుష్పగిరి గ్రామంలో పూలతోటలు సాగుచేశారు. అలా తమిళనాడుతోనూ వీరికి అటాచ్ మెంట్ ఉంది. కాకపోతే జ్వాల తండ్రికి మహారాష్ట్రలోని సేవాగ్రామ్ తో బంధం ఉంది. అక్కడే చైనా నుంచి వచ్చిన ఎలెన్ తో పరిచయం ఏర్పడింది. అదే ప్రేమగా మారింది. తరువాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత ఆవిడ మన దేశ పౌరసత్వం కూడా తీసుకున్నారు.

Gutta jwala 4
Gutta jwala 4

క్రాంతి, ఎలెన్ కు పెద్ద కూతురు గుత్తా జ్వాల. వీళ్ల ఫ్యామిలీ హైదరాబాద్ వచ్చి స్థిరపడేనాటికి జ్వాల వయసు ఐదేళ్లు. అప్పటినుంచే బ్యాట్ తో గేమ్ మొదలుపెట్టింది. బ్యాడ్మింటన్ లో ఏదో ఒక సెక్షన్ లోనే చాలా మంది ఆడతారు. కానీ గుత్తా జ్వాల మాత్రం.. సింగిల్స్, డబుల్స్, మిక్సుడ్ డబుల్స్.. అన్నింటిలోనూ ఆడేసింది. మెడల్స్ కూడా గెలుచుకుంది. అంటే.. కోర్టులో ఒకసారి దిగి బ్యాట్ పట్టిందంటే.. ఇక ప్రత్యర్థికి చెడుగుడే.

Gutta Jwala 6
Gutta Jwala 6

జ్వాలకు 2005లోనే చేతన్ ఆనంద్ తో పెళ్లయిపోయింది. ఆరేళ్లపాటు వీళ్ల కాపురం బాగానే సాగింది. తరువాత మనస్పర్థలు రావడంతో విడిపోయారు. అప్పటి నుంచి ఆమె పెళ్లి చేసుకోలేదు. సీన్ కట్ చేస్తే.. తమిళ హీరో విష్ణు విశాల్ తో అఫైర్ నడిచింది. ఇద్దరూ డేటింగ్ కూడా చేశారు. అప్పట్లోనే ఈ జంటపై రూమర్స్ వచ్చాయి. మొత్తానికి ఆ సస్పెన్స్ కి తరువాత తెర దించారు. పెళ్లి చేసుకుంటామని ప్రకటించారు.

gutta-Jwala
gutta-Jwala

కిందటేడాది సెప్టెంబర్ లోనే జ్వాల, విశాల్ ల నిశ్చితార్థం కూడా అయ్యింది. తరువాత పెళ్లెప్పుడు అంటే ఏమీ చెప్పలేదు. ఇదిగో ఇప్పుడు కాస్త గ్రాండ్ గానే పెళ్లి చేసుకుంది. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల వల్ల ఎక్కువమందిని పిలవలేకపోయినా.. మ్యారేజ్ ఏర్పాట్లు మాత్రం అదిరిపోయాయి. ఫోటోలకు ఫోజులిస్తున్న ఈ జంట భలే రిచ్ లుక్ లో కనిపించింది.

gunde jaari gallanthayyinde
gunde jaari gallanthayyinde

గుత్తా జ్వాలకు సినిమా ఫీల్డ్ కూడా కొత్తేమీ కాదు. విశాల్ తో ప్రేమ, పెళ్లికి ముందే.. అంటే 2013లోనే నితిన్ హీరోగా వచ్చిన గుండెజారి గల్లంతయ్యిందే చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ లో అప్పియరెన్స్ ఇచ్చింది. అసలు అమ్మడిని ఆ సాంగ్ లో చూసి అందరూ ఒక్కసారిగా షాక్. అందులో పెర్ ఫార్మెన్స్ సంగతి లా ఉన్నా.. బ్యూటీ మాత్రం భలే అందంగా కనిపించి.. కుర్రాళ్ల గుండెలు గల్లంతయ్యేలా చేసింది.

ఇవి కూడా చదవండి : 

Also Read : Sudheer Rashmi : జలజలజలపాతం సాంగ్ లో సుధీర్, రష్మీల కెమిస్ట్రీ అదుర్స్.. తొమ్మిదేళ్ల రిలేషన్ మరి!

Also Read : Rashmika Mandanna : హీరోయిన్ రష్మిక మందన్నా గుండు ఫోటోల వెనుక అసలు కథ ఇది!

Also Read : Singer Mohana Bhogaraju: అందంలో హీరోయిన్స్ తో పోటీ.. పాటల్లో ఆమె వాయిస్ అద్భుతః

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/SirimalliPage