Politics

కేసీఆర్ కీలక నిర్ణయం.. కొత్త వైద్యారోగ్యశాఖ మంత్రిగా ఆయన పేరు ఖరారు?

మంత్రి ఈటెల రాజేందర్ భూకబ్జాలకి పాల్పడ్డారంటూ సంచలన ఆరోపణలు తెరపైకి పైకి రావడంతో తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయలు వేడెక్కాయి. దీనితో ఆయనపై వెంటనే విచారణకు సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇవ్వడం, మెదక్ జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని టీం దానిపైన విచారణ జరపడం, ఇందులో కొంతవరకు నిజం ఉందని వారు నిర్ధారించడం, వైద్యారోగ్యశాఖను మంత్రి ఈటెల నుంచి తప్పించడం.. ఇవన్ని చకచక జరిగిపోయాయి.

ఇప్పటివరకు వైద్యారోగ్యశాఖను చూస్తున్న ఈటెలను ఆ శాఖ నుంచి తప్పించి.. ఆ శాఖను సీఎం కేసీఆర్‌కు కేటాయించారు. ఈ మేరకు గవర్నర్ సైతం ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆ శాఖను సీఎం తనవద్దే ఉంచుకుంటారా లేకుంటే ఎవరికైనా కేటాయిస్తారా అన్నది ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్న. ఈ క్రమంలో కొత్త హెల్త్ మినిస్టర్‌గా ఓ ఎమ్మెల్యే పేరు తెరపైకి వచ్చింది. ఆయనే జడ్చర్ల ఎమ్మెల్యే డా. చర్లకోల లక్ష్మారెడ్డి.

Telangana was formed due to of our sacrifices: Laxma Reddy
jadcherla mla laxma reddy

చర్లకోల లక్ష్మారెడ్డి టీఆర్ఎస్ ఫస్ట్ టర్మ్ లో ఆయన వైద్యారోగ్య శాఖ మంత్రిగా పని చేశారు. తెలంగాణ తొలి ప్రభుత్వంలో తాటికొండ రాజయ్యను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత ఆ శాఖను లక్ష్మారెడ్డికి అప్పగించారు. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆయనకి క్యాబినెట్ లో చోటు దక్కలేదు. తాజాగా రాష్ట్రంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా ఆయనకీ మళ్ళీ వైద్యారోగ్య శాఖ దక్కే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

ఈ మేరకు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని, ఆయన్ను ప్రగతి భవన్‌కు రావాలని సూచించినట్లు సమాచారం. దీనిపైన మరిన్నీ వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

Also Read: మంత్రి ఈటెలకి మరో షాక్.. మరో కేసుకి రంగం సిద్దం?