Cinema

Pushpa Raj : ‘తగ్గేదే లే’.. ఊరమాస్‌ లుక్‌లో ‘పుష్ప’ టీజర్..!

Pushpa Raj : స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ టీజర్ కొన్ని నిమిషాల ముందు విడుదలైంది. ‘ఇంట్రడ్యూసింగ్ పుష్ప రాజ్’ అంటూ యూనిట్ ఈ వీడియోను విడుదల చేసింది. ఇందులో బన్నీ ఊర మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. అల్లు అర్జున్ ‘తగ్గేదే లే’ అనే డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అల్లు అర్జున్ (Pushpa Raj) సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది.

Allu Arjun in Pushpa Movie
Allu Arjun in Pushpa Movie

మలయాళ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ విలన్ గా నటిస్తున్నాడు. రిలీజ్ అయిన కొద్దివ్యవధిలోనే టీజర్ 4 లక్షలకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ‘పుష్ప’ ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

Also Read : Ananya Nagalla Latest Pics

మరింత తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి.

https://www.facebook.com/SirimalliPage/