Fiber Food: ఇలాంటి ఫైబర్ ఫుడ్ తింటే.. ఫుల్ హ్యాపీ, ఫుల్ హెల్దీ!

Fiber Food: ఇలాంటి ఫైబర్ ఫుడ్ తింటే.. ఫుల్ హ్యాపీ, ఫుల్ హెల్దీ!

రోజువారీ ఆహారంలో ఫైబర్ ఉండేలా చూసుకోవాలి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఫైబర్ అనేది ఒక రకమైన పోషకం. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఇలా దీంతో చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. బరువు తగ్గడంలో కూడా ఫైబర్ ముఖ్య పాత్ర పోషిస్తుంది.

ఫైబర్ ఆహారం (Fiber Food) యొక్క జీర్ణక్రియను సాఫీగా సాగేలా చేస్తుంది. ఇది మీకు ఎక్కువసేపు పొట్ట నిండుగా ఉండేలా చేస్తుంది. దీనివల్ల ఆహారాన్ని తక్కువగా తీసుకుంటారు. దీనివల్ల బరువు కూడా అదుపులో ఉంటుంది. పైగా జీర్ణక్రియకు మంచిది కూడా. క్యాలరీలు కూడా ఎక్కువగా ఉండవు. దీనివల్ల మీ వెయిట్ అదుపులో ఉంటుంది.

ఫైబర్ ఫుడ్ (Fiber Food) తీసుకోమని చాలామంది వైద్యులు చెబుతుంటారు. ఆరోగ్య నిపుణులు కూడా చెబుతారు. కానీ అలాంటి ఆహారం ఏ పదార్థాల్లో దొరుకుతుందో చాలామందికి తెలియదు. దీనివల్ల సరైన మోతాదులో ఫైబర్ ను తీసుకోవడంలో చాలామంది ఫెయిలవుతూ ఉంటారు. నిజానికి మనం రోజువారీగా తీసుకునే అనేక ఆహార పదార్థాల్లో ఇది పుష్కలంగా ఉంటుంది.

రోజూ కూరగాయలు తినేటప్పుడు ఇందులో ఫైబర్ ఉందా అని ఎవరూ చెక్ చేయరు. నిజానికి రోజూ తినే చాలా కాయగూల్లో ఇది ఉంటుంది. అలాంటివాటిలో పాలకూర, బచ్చలికూర, బీన్స్, క్యారెట్లు, బంగాళాదుంపలు.. ఇలా మరికొన్ని కూరగాయల్లో కూడా ఫైబర్ ఉంటుంది. ఇలాంటి మంచి ఆహారం తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరవు. దీంతోపాటు రక్తంలో చక్కెర స్థాయిలు నిలకడగా ఉంటాయి. జీర్ణక్రియకు కూడా మంచిది.
Also Read :- Diabetese Fruits : షుగర్ పేషెంట్లు ఈ ఆరు పండ్లను తినొచ్చా?

ఫైబర్ పుష్కలంగా ఉండే ఆహారాలు ఇంకా చాలా ఉన్నాయి. అలాంటివాటిలో చాలారకాల ధాన్యాలు కూడా ఉన్నాయి. చాలామంది బరువును అదుపులో ఉంచుకోవడానికి ఓట్స్ ను తింటారు. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతోపాటు బ్రౌన్ రైస్ లో కూడా ఉంటుంది. అందుకే చాలామంది ఈమధ్యకాలంలో వైట్ రైస్ కు బదులుగా బ్రౌన్ రైస్ తింటున్నారు. ఇక హోల్ గ్రెయిన్ బ్రెడ్ కూడా మంచిదే. ఇందులో గ్రెయిన్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఫైబర్ కావలసినంత ఉంటుంది. చాలామంది బ్రేక్ ఫాస్ట్ లో దీనిని ఓ భాగం చేసుకుంటున్నారు.

అనుకుంటాం కాని.. కొన్ని రకాల గింజలు శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. అలాంటివాటిలో బాదం పప్పు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రోజూ రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే వాటిని తినడం చాలామందికి అలవాటు. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందివ్వడంతోపాటు మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఇక జీడిపప్పు అయితే వంటకాల్లో విరివిగా వాడేవారు చాలామంది ఉంటారు. కొలస్ట్రాల్ ఎక్కువగా ఉంటుందని చాలామంది పక్కనపెడతారు కాని మితంగా తీసుకుంటే మంచిదే. అన్నింటికన్నా ఎక్కువగా ప్రొటీన్ లభించేది వేరుశెనగ గింజల్లోనే. చక్కీలు, ఇంకా ఇతర రూపాల్లో వేరుశెనగపప్పును చాలామంది ఇష్టంగా తింటారు. ఇందులో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే రోజూ వండే కూరల్లో వీటిని ఎక్కువగా వేస్తుంటారు. వీటితోపాటు స్నాక్స్ చేసుకునేటప్పుడు వాటిలో దీనిని భాగం చేస్తారు. ఇక పీనట్ బటర్ ని అయితే చాలామంది ఇష్టంగా లాగించేస్తూ ఉంటారు.

Almonds, peanuts and cashew nuts
Fiber food: Almonds, peanuts and cashew nuts

ఫైబర్ పుష్కలంగా ఉండే వాటిలో పండ్లకు ప్రత్యేక స్థానముంటుంది. రోజూ ఓ ఆపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదు అంటారు. అలాంటి ఆపిల్ లో ఫైబర్ మంచి మోతాదులో ఉంటుంది. ఇక బొప్పాయిలో కావలసినన్ని పోషకాలు ఉంటాయి. అలాగే ఫైబర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ద్రాక్ష, స్ట్రాబెర్రీలు, నారింజ.. ఇలాంటి వాటిని తినడం వల్ల శరీరానికి కావలసినంతగా ఫైబర్ అందుతుంది.

ఫైబర్ పుష్కలంగా ఉండే ఆహారాలను మీ డైట్ లో చేర్చడం వల్ల, మీరు బరువును అదుపులో ఉంచుకోగలుగుతారు. ఇది మీ ఆరోగ్యాన్ని మరింతగా మెరుగుపరుచుకోవడానికి దోహదపడుతుంది.
Note : ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం.. ఇంటర్నెట్ తో పాటు అందుబాటులో ఉన్న ఇతర మార్గాల్లో సేకరించినది. అందువల్ల ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అని గమనించగలరు. ఇది వైద్య చికిత్సకు కాని, వైద్య సలహాలకు కాని ఏ మాత్రం ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యం పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలనే సదుద్దేశంతో మాత్రమే ఇది రాయడం జరిగిందని మనవి.

Also Read :- Hiccups Solution : వెక్కిళ్లను అడ్డుకునే కొత్త రకం స్ట్రా.. దీని రేటు ఎంతంటే..