Cinema Off Beat

Allu Arjun Corona Positive : అల్లు అర్జున్ కి కరోనా పాజిటివ్.. అభిమానులు ఆందోళన చెందవద్దన్న బన్నీ

Allu Arjun Corona Positive : కరోనా రక్కసి తెలుగు సినీ ఇండస్ట్రీని వదలడం లేదు. ఇప్పటికే చాలామంది దీని బారిన పడ్డారు. మెగాఫ్యామిలీలోనూ కొంతమందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun Corona Positive) కూడా తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని ట్విట్టర్ ద్వారా చెప్పాడు. ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉన్నాడు. డాక్టర్ల సలహాలు సూచనలు తీసుకుంటూ జాగ్రత్తగా ఉన్నానని చెప్పాడు.

 

Allu Arjun Sirimalli 11
Allu Arjun Sirimalli 11

ప్రస్తుతం అల్లు అర్జున్ ఆరోగ్యంగానే ఉన్నానన్నాడు. అందుకే అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరమే లేదన్నాడు. కానీ ఈమధ్యకాలంలో తనను కలసినవాళ్లంతా కరోనా టెస్ట్ చేయించుకోవాలని కోరాడు. కిందటేడాది వచ్చిన అల వైకుంఠపురం సినిమా తరువాత అల్లు అర్జున్ ఫ్యాన్ బేస్ చాలా పెరిగింది.

స్టైలిష్ స్టార్ గా కనిపించే బన్నీకి సోషల్ మీడియాలోనూ ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు. టాలీవుడ్ లో షూటింగ్ లలో పాల్గొంటున్నవారిపై కరోనా ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఇప్పటికే పవన్ కల్యాణ్, చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్ కూడా కొవిడ్ బారిన పడ్డారు. ప్రస్తుతం వాళ్లు చికిత్స తీసుకుంటున్నారు.

ఈమధ్యనే హీరోయిన్ పూజాహెగ్డే కూడా తనకు కొవిడ్ పాజిటివ్ వచ్చినట్టు తెలిపింది. ఇంట్లోనూ ఉంటూ డాక్టర్ల సలహా, సూచనల మేరకు చికిత్స తీసుకుంటున్నానని.. తనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని చెప్పింది. బన్నీ ప్రస్తుతం పుష్ప సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. ఇది పాన్ ఇండియా సినిమాగా రూపుదిద్దుకుంటోంది. ఇందులో ఎర్రచందనం స్మగ్లర్ పాత్రలో నటిస్తున్నాడు.

ఇప్పటికే ఈ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆగస్టు నెలలో రిలీజ్ చేయడానికి వీలుగా ప్లాన్ చేశారు. పుష్ప టీజర్ కూడా చాలా తక్కువ టైమ్ లో 50 మిలియన్ వ్యూస్ ని దాటింది. ఇది నిజంగా రికార్డే. ఓవైపు పుష్ప సినిమా చేస్తున్నా.. మరోవైపు తన తర్వాత సినిమాలను బోయపాటి శ్రీనుతోను, వకీల్ సాబ్ ని డైరెక్ట్ చేసిన శ్రీరామ్ వేణుతో ఐకాన్ మూవీని బన్నీ ప్లాన్ చేశాడు. తరువాత కొరటాల శివతో మరో ప్రాజెక్ట్ కి ప్లాన్ చేశారు. మొత్తానికి ఈ ఏడాదంతా బన్నీ షెడ్యూల్ చాలా బిజీగా ఉంది.

No description available.

Also Read : Corona Virus : కరోనా అంటే భయపడేవారు ముందు ఇది చదవండి.. ధైర్యం వస్తుంది

Also Read : Corona Virus : కరోనా సమయంలో నిద్రపట్టకపోవడానికి ఇదే ప్రధాన కారణం.. మరి నిద్ర పట్టాలంటే ఏం చేయాలి?

Also Read : Pooja Hegde : బుట్టబొమ్మకు కరోనా పాజిటివ్.. అంతకుముందే శుభవార్త చెప్పి.. ఇంతలోనే ఇలా..!

Also Read : Vakeel Saab Heroine Anjali : వకీల్ సాబ్ హీరోయిన్.. అంజలి కలర్ ఫుల్ పిక్స్.. శారీ ఫోటోస్ అదుర్స్

Also Read : Potti Veeraiah : టాలీవుడ్ మరుగుజ్జు నటుడు ఇక లేరు, తీవ్ర విషాదంలో చిత్ర పరిశ్రమ

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి.

https://www.facebook.com/SirimalliPage