2024-07-14 02:19:38
యాంకర్ శివ ప్రశ్నకు కోప్పడిన అనసూయ.. తరువాత బయటపడిన అసలు విషయం ఏంటంటే.. – Sirimalli.com

యాంకర్ శివ ప్రశ్నకు కోప్పడిన అనసూయ.. తరువాత బయటపడిన అసలు విషయం ఏంటంటే..

Jabardasth : జబర్దస్త్ అంటేనే కామెడీ అదిరిపోద్ది. అందుకే ఆ షోను చాలామంది ఫాలో అవుతుంటారు. ఇక అనసూయ యాంకరింగ్ అయితే ఈ షో కి నిజంగా ప్లస్ పాయింటే. పంచ్ డైలాగ్స్ తో పాటు ఆమె నవ్వులను అస్సలు మిస్సవ్వరు. అందులోనూ గ్లామర్ లుక్ లో, ఫ్యాషన్ బ్యూటీతో అదరగొడుతుంది. కానీ ఈమధ్యనే జబర్దస్త్ (Jabardasth) లోని ఓ ఎపిసోడ్ లో అనసూయ.. జబర్దస్త్ షో లో అలిగింది. మరి ఆ తరువాత ఏమైంది?

Image

జబర్దస్త్ షో లో స్పెషల్ అట్రాక్షన్స్ కొన్ని ఉన్నాయి అనుకుంటే.. అందులో ముఖ్యమైనవాటిలో అనసూయ కూడా ఒకటి అంటే అస్సలు డౌట్ ఉండదు. ఎలాంటి సందర్భాన్ని అయినా స్పోర్టివ్ గా తీసుకునే తత్వం ఆమెది. అందుకే తనపైనే జోక్స్ పేలుతున్నా సరే.. సరదాగా నవ్వేసి ఊరుకుంటుందే కాని ఏమాత్రం తొణకదు. బెణకదు. పైగా సమయస్ఫూర్తితో వాటిని తిప్పికొట్టడానికే ప్రయత్నిస్తుంది. అయినా ఓ ఎపిసోడ్ లో ఇబ్బంది తప్పలేదన్నట్టుగా చూపించారు. కానీ చివరకి సీన్ వేరేలా మారింది.

Image

జబర్దస్త్ షోలో అనసూయ వేసుకునే కాస్ట్యూమ్స్ గురించి యాంకర్ శివ ఆమెను ఓ క్వశ్చన్ అడిగాడు. దీంతో ఆమె షో నుంచి కోపంతో బయటకు వెళ్లిపోయింది. ఇదంతా హైపర్ ఆది స్కిట్ లో జరిగింది. అసలు శివ అడిగిన క్వశ్చన్ ఏంటంటే.. ఎప్పటినుంచో తనకు ఓ ప్రశ్న అడగాలని ఉందని.. మీ డ్రెస్సింగ్ స్టైల్ గురించి నెగటివ్ గా కామెంట్లు వస్తాయని అనసూయతో అన్నాడు. చిన్న చిన్న దుస్తులు ఎందుకు వేసుకుంటున్నారని క్వశ్చన్ చేశాడు.

Image

యాంకర్ శివ అడిగిన క్వశ్చన్ కు అనసూయ కూడా అంతే ఘాటుగా రిప్లయ్ ఇచ్చింది. ఇండస్ట్రీ గురించి తెలియని వాళ్లు అడిగితే అర్థముంటుంది.. మీరు ఇక్కడే ఉండి.. ఇండస్ట్రీ గురించి తెలిసి.. ఇలా ఎలా అడుగుతారంటూ తిరిగి క్వశ్చన్ చేసింది. అయినా ఇది నా పర్సనల్ అని కడిగిపారేసింది. పర్సనల్ అయితే మీ ఇంట్లో చూసుకోవచ్చు కదా.. ఇక్కడ ఎందుకంటూ శివ మళ్లీ క్వశ్చన్ చేశాడు. అంతే.. అనసూయ కోపంగా స్కిట్ నుంచి బయటకు వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన ప్రోమో కూడా వైరల్ అయ్యింది. ఇప్పుడు అసలు విషయం బయటపడింది.

Image

ఇప్పుడు రిలీజ్ చేసిన వీడియోలో స్కిట్ చూపిస్తూనే.. ఆరోజు ఏం జరిగిందో కూడా ఆ క్లిప్ ను చూపించారు. కోపంతో బయటకు వెళ్లిపోయిన అనసూయకు సారీ చెప్పారు హైపర్ ఆది.. యాంకర్ శివ. యూనిట్ సభ్యులు కూడా సర్దిచెప్పారు. కొద్దిసేపటి వరకు ఆ షాక్ నుంచి తేరుకోలేనట్టుగా కనిపించిన అనసూయ.. తరువాత వాళ్ల సారీలకు కరిగిపోయింది. సెట్ లోకి వచ్చింది. అసలు ట్విస్ట్ అక్కడే ఉంది.

Image

అనసూయ.. రోజాను ఓ క్వశ్చన్ అడిగింది. ఇదంతా నిజమే అని మీరు నమ్మారా అనేసరికీ రోజా కూడా నమ్మలేదని రిప్లయ్ ఇచ్చారు. నువ్వు దానిని పట్టించుకోవని తనకు తెలుసంటూ చెప్పుకొచ్చారు. అలాంటి రూమర్స్ వినీ వినీ ఉంటావని.. అందుకే అలాంటి వాటిని పట్టించుకోవని తేల్చేశారు. అనసూయ ఫక్కున నవ్వడం, హైపర్ ఆది నవ్వు దానికి జత కలవడంతో కథ సుఖాంతం అయ్యింది.

ఇవి కూడా చదవండి : 

Also Read : Anasuya Bharadwaj : బాధ ఎక్కువైతే వైన్ తాగుతా.. మా ఆయనతో చెప్పుకుంటా – అనసూయ

Also Read : Madhuri Dixit : మాధురీ.. నీ అందానికి సై… నీ నటనకు జైజై.. లేటెస్ట్ ఫోటోలు

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/SirimalliPage