Off Beat

దేశవ్యాప్తంగా భారీగా పెరిగిన కరోనా కేసులు.. ఇలా అయితే బతికినట్టే పో.. !

India Corona Cases : దేశంలో కరోనా తీవ్రత అంతకంతకు పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో భారీగా 2,00,739 పాజిటివ్ కేసులు వచ్చాయి. దేశంలో ఈ స్థాయిలో కేసులు రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. తాజాగా కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,40,74,564కి చేరింది.

ఇందులో 14,71,877 యాక్టివ్ కేసులు ఉండగా, 1,24,29,564 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా 1,038 మంది మరణించగా, మొత్తం మరణాల సంఖ్య 1,73,123కి చేరింది.

అటు తెలంగాణలోనూ కరోనా వైరస్ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,307 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,38,045కి చేరింది.

ఇందులో 27,861 యాక్టివ్ కేసులు ఉండగా, 3,08,396 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా 8 మంది మృతి చెందగా.. మొత్తం 1,788 మంది కరోనాతో మరణించారు.