Off Beat

Corona Virus : కరోనా సమయంలో నిద్రపట్టకపోవడానికి ఇదే ప్రధాన కారణం.. మరి నిద్ర పట్టాలంటే ఏం చేయాలి?

Corona Virus : కరోనా కష్టకాలంలో కంటినిండా నిద్రపోవడమే గగనమవుతోంది. కొంతమంది ఏదోలా పడుకున్నా భయంతోనో, ఆందోళనతోనో ఉలిక్కిపడి లేస్తున్నారు. ఇంకొంతమందికి నిద్రచాలక.. రోజంతా మత్తుగా ఉంటున్నారు. మరిప్పుడు ఏం చేయాలి? కరోనా (Corona Virus) భయాన్ని పక్కనపెట్టి  కంటినిండా హాయిగా నిద్రపోవాలంటే ఎలా?

కరోనా- నిద్రలేమి : 

కరోనా వచ్చింది; నిద్ర పట్టడం లేదని కొంత మంది !
కరోనా నుంచి కోలుకొన్నాను , కానీ నిద్ర పట్టడం లేదని అనేక మంది ! ఎందుకిలా ?

Common Types of Sleep Disorders - Lung & Sleep Specialists of North Texas

సాయంకాలం ఏడు గంటలకు నా డిన్నర్ ప్రారంభం అవుతుంది . డిన్నర్ తో పాటు ముందుగా నేను కీరా { కుకుంబర్ } తింటాను . వాటిని బ్లాకీ , బ్రౌనీ , శ్వేతా , శ్యామా కు పెట్టి అలవాటు చేశాను . ఇప్పుడు క్రమం తప్పకుండా ఏడు కి పది నిముషాలు ఉండగానే బ్లాకీ బ్రౌనీ నా దగ్గరకు వస్తారు . వెళ్ళు … స్నానం చేసుకో .. కీరా తినడానికి వేళయ్యింది అన్నట్టు ఉంటుంది వాటి చూపు . డ్రైవర్ మా ఇంటికి పొద్దునే ఎనిమిదింటికి వస్తాడు .7 . 45 కే వెళ్లి డ్రైవర్ కోసం డోర్ దగ్గర కూర్చొంటారు? ఇంత కచ్చితంగా వాటికీ టైం ఎలా తెలిసింది అంటారా ? అదే పాయింట్ కొస్తున్నా. ఆ పాయింట్ మీకు అర్థం కావాలనే ఈ ఉదాహరణ ఇచ్చా.

మనుషుల్లో, ఇంకా కొన్ని జంతువుల్లో బయోలాజికల్ క్లోక్ అనేది ఉంటుంది . కోడి పుంజు తెల్ల వారు జామున కూస్తుంది . తోలి కోడి కూసింది అంటే తెల్ల వారు జామున బ్రహ్మ ముహూర్తం అని . సూర్యాస్తమయానికి కాస్త ముందుగా పక్షులు తమ గూళ్ళకి ఎగిరి పోతాయి .

Chronic vs Acute Insomnia: Definition, Symptoms, and Causes | Sweet Sleep Studio

మనిషి ఒక క్రమానికి అలవాటు పడి పోతాడు . దానికి అతని / ఆమె శరీరం సెట్ అయిపోతుంది . నాకు రాత్రి 9 . 30 అయితే నిద్ర ముంచుకొని వస్తుంది . పొద్దున్న మూడు అయితే మెలుకువ వస్తుంది . 9 . 30 దాటినా నేను బెడ్ పై పడుకోకుండా ఇంకా సోఫా లో టీవీ చూస్తూ కూర్చుంటే అక్కడే నిద్ర పట్టేస్తుంది . పొద్దున్న మూడు అయితే అలారం లేకుండా మెలుకువ వస్తుంది . నిద్ర పోవాలన్నా రాదు . ఒంటి గంటకు లంచ్ . ఏడింటికి డిన్నర్ .. ఆలా సెట్ అయ్యింది నా బయోలాజికల్ క్లోక్ .

ఇలా ప్రతి ఒక్కరికీ ఏదో ఒక బయోలాజికల్ క్లోక్ వుంటుంది . కరోనా సమయం లో రోజంతా ఇంటి వద్దే ….. వేళ కాని వేళల్లో పడుకుంటే ఈ బయోలాజికల్ క్లోక్ దెబ్బ తింటుంది . పగలు మూడు గంటలు నిద్ర పొతే ఇక రాత్రి పూర్తి నిద్ర ఎక్కడ వస్తుంది ?

corona virus
corona virus

కరోనా నుంచి కోలుకొన్నా ఇలా బయోలాజికల్ క్లోక్ డిస్టర్బ్ అయిన వారికి పరిస్థితి అలాగే కొనసాగుతుంది .

కరోనా నుంచి కోలుకొన్నా నిద్ర పట్టక పోవడానికి ముఖ్యమైన కారణం టెన్షన్ . anxiety . ఆసుపత్రి లో గడిపిన పీడ జ్ఞాపకాలు , దగ్గరి వారు మరణిస్తే ఆ బాధ , క్వారంటైన్ పేరుతొ 14 రోజుల ఏకాంత వాసం .. ఒంటరితనం తాలూకూ పీడ జ్ఞాపకాలు , దిగ జారిన ఆర్థిక స్థితి , జాబ్ లాస్ , అప్పులు , emi చెల్లింపులు , ఇంకా ఇంకా ఎన్నో .. దీనికి తోడు నట్టింట్లో మద్దెల దరువు .. కరోనా విజృంభణ.. మరణ మృదంగం .. అంటూ భయ పెట్టె మ్యూజిక్ తో మాటలతో తెచ్చి పెట్టుకొన్న శని . ఇంకెక్కెడ మనఃశాంతి ? ఇంకెక్కడ నిద్ర ?

Worst 5 Sleep Disorders - Symptoms, Side Effects and Its Preventions | Blogs | King Koil India.

ఏమి చెయ్యాలి ?

1 . పగలు పని చేసి / వ్యాయామం చేసి శరీరం అలిసి పొతే నిద్ర తన్నుకొని వస్తుంది . కరోనా సోకి న తొలి రోజుల్లో. ఇంకా నీరసంగా వున్నా, ఇంట్లోనే పొద్దున్న సాయంకాలం చెరి 15 నిముషాలు నడవాలి . ముఖ్యంగా కరోనా నుంచి కోలుకున్నాక కనీసం ౩౦ నిముషాలు స్పీడ్ వాకింగ్ తప్పని సరి . నేను క్రమం తప్పకుండా జిం లో వ్యాయామం చేస్తాను . వ్యాయామం చేసిన రోజు ఎంత గాఢ నిద్ర పడుతుందో! పడుకొంటే ఎంత హాయిగా ఉంటుందో !! ఎంజాయ్ చేస్తేనే తెలుస్తుంది . అదో తీయటి అనుభవం ! కోట్లు ఖర్చు పెట్టినా రానిది .

morrning-exercise-1
morrning-exercise-1

2 . నిద్ర కు ఇంకా భోజనానికి క్రమం తప్పకుండ వేళలు అలవాటు చేసుకోండి . బయోలాజికల్ క్లోక్ సెట్ అయితే అన్నీ దానంతట అవే జరిగి పోతాయి . వేళకు ఆకలి వేస్తుంది . వేళకు నిద్ర పడుతుంది . వేళకు మెలకువ వస్తుంది . దీన్ని డిస్టర్బ్ చెయ్యొద్దు . ఎప్పుడో ఒక సారి వేళ తప్పితే ఫరవాలేవు .

Is it okay to sleep immediately after eating lunch? - Quora

౩. టెన్షన్ కు దూరంగా వుండండి . పాజిటివ్ దృక్పధాన్ని అలవాటు చేసుకోండి . మన ఆలోచనలే మన ఆరోగ్యం .. మన ఆలోచనలే మన భవిష్యత్తు .. మనసు ను హాయిగా ఉంచండి . ఆవేశం .. ఈర్ష .. అసూయ.. ద్వేషం .. ఆందోళన ఇలాంటివి నెగటివ్ ఫీలింగ్స్ . వీటిని చాల మంది కొని తెచ్చుకొంటున్నారు . స్త్రీలకు ఇలాంటివి టీవీ సీరియళ్ల రూపం లో .. పురుషులకు రాజకీయ చర్చలు .. కరోనా భయానక వార్తల రూపం లో ఫ్రీగా దొరుకుతోంది . మనం ఏమి కావాలనుకొంటే అదే దొరుకుతుంది . నేను బాల మురళి , సుబ్బలక్ష్మి అమ్మ , ఘంటసాల , రఫీ , కిషోర్ కుమార్ , బాలు , జానకి , సుశీల సౌందర్ రాజన్ ను కోరుకొంటాను . నాకే అదే దొరుకుతుంది . పడుకొనే ముందు వీరి అమర గానం విని హాయిగా నిద్ర పోతాను . పడుకున్నాక మంచి కలలు వస్తాయి . డింగ్ .. డింగ్ మ్యూజిక్ తో అత్త పై ఆసిడ్ పొసే కోడలు .. జైలు కు పొయ్యేది ఆయనా లేక ఈయనా టైపు చర్చ .. చర్చా .. నా బొందా..రచ్చ… ఇలాంటివి చూసి న తరువాత పడుకొంటే ? అతిగా ఆవేశపడ్డ మగాడైనా ఆడవారు అయినా సరిగ్గా నిద్ర పోయినట్టు చరిత్రలో లేదు అంటాడు భాషా ! వినలేదా ?

sleep disorder: This is why tech gadgets are the biggest culprit for your sleep disorder - The Economic Times

4 . డిన్నర్ కు ముందు వేడి నీటి స్నానం .. పడుకొనే ముందు వెచ్చటి పాలు { కొంత మందికి పాలు అరగదు. వారికి ఇది వర్తించదు } రూమ్ లో మరీ వేడిగా కాకుండా మరీ చల్లగా కాకుండా ఏర్పాట్లు { కిటికీ తెరిచి ఉంచడం , దోమ తెర. 23 డిగ్రీల వద్ద ఏసీ.. ఇలా ఎవరి బడ్జెట్ లో వారి ఏర్పాట్లు } .

5 . పడుకోవడానికి కనీసం అరా గంట ముందు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి . లేదా సైలెంట్ మోడ్ లో పెట్టి దూరంగా పెట్టేయండి .

6 . నిద్ర పట్టక పొతే అదే పనిగా బెడ్ పై దొర్లకండి. అప్పుడు పడుకోవడం అంటేనే ఒక నెగటివ్ ఫీలింగ్ వస్తుంది . లేచి కూర్చోండి . ఏదైనా పని లో పడండి. రూమ్ లో నడవండి . అలసి పొతే మళ్ళీ నిద్ర వస్తుంది . బెడ్ పైన పడుకొన్న కొన్ని నిముషాలకే నిద్ర వస్తుంది .

7 . చాలా సంవత్సరాల క్రితం మాట . నేను ఢిల్లీ లో వున్నాను . పొద్దునే ఐఏఎస్ ఇంటర్వ్యూ . త్వరగా పడుకున్నా. రాత్రి బాగా నిద్ర పడితే రేపు మొఖం అలాగే ఆలోచనలు ఫ్రెష్ గా ఉంటాయి అనుకొన్నా. నిద్ర పట్టాలి .. కం ఆన్… నిద్ర… రా అన్నా.. వస్తుందా చస్తుందా., అర్ధ రాత్రి దాటేసింది .. చల్ పో.. నిద్ర వస్తే ఎంత ? రాక పొతే ఎంత . ఇంటర్వ్యూ ఎలాగూ బాగా చేస్తాను అనుకొన్నా . కాసేపటికి లేచి చూస్తే తెల్లవారింది .

సోఫా లో కూర్చొని హాయిగొలిపే పాటలు వింటుంటే ఎప్పుడో నిద్ర పోయి ఉంటాము . అదే బెడ్ పై పడుకొని .. రామ్మా… నిద్రమ్మా.. ప్రేమా మొలకమ్మా.. నిద్రమ్మా … అంటే రాదు . రానే రాదు .

రమ్మంటే రాదు .. వద్దంటే వస్తుంది . నిద్ర ఒక భోగం . అది లేక పొతే తప్పదు రోగం.

వాసిరెడ్డి అమరనాథ్ గారి ఫేస్ బుక్ పోస్ట్

Also Read : Corona Virus : కరోనా అంటే భయపడేవారు ముందు ఇది చదవండి.. ధైర్యం వస్తుంది

Also Read: Corona  vitamin : వార్నీ.. ఆ ఒక్క విటమిన్ విషయంలో జాగ్రత్తగా ఉంటే.. కరోనాను ఢీ కొట్టచ్చా?

Also Read : Corona Virus : రోజూ ఇలా చేస్తూ ఉంటే.. కరోనా వచ్చినా మూడు రోజుల్లో మటాష్!

Also Read:Corona Virus : కరోనా బాధితులు.. ఏ స్వీట్ ని తింటే మళ్లీ వాసన, రుచిని వేగంగా పొందవచ్చు?

Also Read : Corona Virus : ఈ 2 రకాల పండ్లు, 3 రకాల పనులు చాలు.. బలమైన ఇమ్యూనిటీ మీ సొంతం

Also Read : Anupama Parameswaran : బ్లాక్ శారీతో వైట్ బ్యూటీ మ్యాజిక్.. ఫ్యాన్స్ లో మ్యూజిక్..

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి.

https://www.facebook.com/SirimalliPage