Life Style

చర్మం పొడిబారకుండా ఉండడానికి ఏం చేయాలంటే..

శరీరం ఎంత అందంగా, నాజూగ్గా కనిపిస్తే అంత సంతోషంగా ఉంటుంది. కానీ శీతాకాలంలో ఇలా ఉండడం కష్టం. ఉదయం పూట ఎండ కొడుతుంది. రాత్రి పూట చలి చంపేస్తుంది. అందుకే స్కిన్ లో కూడా తేడా వచ్చేస్తుంది. అందులోనూ పొడి చర్మం ఉన్నవాళ్ల బాధ మరి చెప్పక్కరలేదు. కాని వీళ్లు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది.

చర్మానికి ఏ నీళ్లు మంచివి?
కొంతమందికి కాలంతో సంబంధం లేకుండా చన్నీటి స్నానమే చేస్తామంటారు. మరికొంతమంది నడి వేసవిలో కూడా పొగలు కక్కే వేడినీటితో స్నానం చేస్తారు. కాని ఏ కాలంలో అయినా గోరు వెచ్చటి నీటితో స్నానం చేయడమే మంచిది. ముఖానికి ఎక్కువసార్లు సబ్బు రుద్దడం వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. అందుకే రోజు మొత్తంలో ఓ రెండు, మూడుసార్లు గోరువెచ్చటి నీటితో కడుక్కుంటే సరిపోతుంది.

ఏ లోషన్ బెటర్?
స్నానం చేసిన తరువాత ఒంటికి లోషన్లు అప్లయ్ చేస్తారు చాలామంది. కాని మీ శరీరానికి ఎలాంటి లోషన్, మాయిశ్చరైజర్ సూటవుతుందో తెలుసుకుని వాడితేనే మంచిది. ఎందుకంటే చలికాలంలో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల చెమట తొందరగా ఆరిపోతుంది. అందుకే మీ చర్మం డ్రైగా కనిపిస్తుంది. ఇలా కాకుండా ఉండాలంటే మీరు నీళ్లు తప్పని సరిగా తాగాల్సిందే. బయట జాబ్ చేసేవారైతే.. యూరిన్ ప్రాబ్లమ్ వస్తుందని తక్కువ నీళ్లు తాగుతారు. కాని దానివల్ల లేనిపోని అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. అందుకే రోజూ కనీసం 8 గ్లాసుల నీరు.. అంటే 3 లేదా నాలుగు లీటర్ల నీటిని తాగాలి.