Bigg Boss 5 Telugu : వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌజ్ లోకి హాట్ యాంకర్..!
Bigg Boss 5 Telugu Latest

Bigg Boss 5 Telugu : వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌజ్ లోకి హాట్ యాంకర్..!

Bigg Boss 5 Telugu : ఎన్నడూ లేనంతగా మొత్తం తొమ్మిది మంది భామలతో ఈసారి బిగ్ బాస్ సీజన్ ఫైవ్(Bigg Boss 5 Telugu) మొదలైంది. ఇప్పుడు ఈ హీట్ సరిపోయింది అనుకున్నాడో లేదో.. మరో ఇద్దరు ముద్దురుగుమ్మలను హౌజ్ లోకి దింపడానికి రెడీ అవుతున్నాడు బిగ్ బాస్.

మొత్తం 19 మంది కంటెస్టెంట్ లతో మొదలైన ఈ బిగ్ బాస్ సీజన్ ఫైవ్ సక్సెస్ ఫుల్ గా మొదటి వారం పూర్తి చేసుకుంది.మొదటి ఎలిమినేషన్ గా హాట్ బ్యూటీ సరయూ ఇంటినుంచి వెళ్ళిపోయింది. ప్రతిసారి లాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా కంటెస్టెంట్స్ ని లోపలికి పంపే సంప్రదాయాన్ని ఈసారి కూడా కొనసాగించనున్నారు.

Image

హౌజ్ లోకి ఈసారి హాట్ యాంకర్ వర్షిణి, బుల్లితెర నటి నవ్యస్వామి ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. అయితే ఒకే వారం ఇద్దరి ఎంట్రీ ఉంటుందా? లేక ఒక్కొక్కవారం ఒక్కొక్కరు ఎంట్రీ ఇస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. ఈ ఇద్దరు కనుక హౌజ్ లో ఉంటే ఆ రచ్చ మామాలుగా ఉండదని బిగ్ బాస్ అభిమానులు అనుకుంటున్నారు. వారికి బిగ్ బాస్ కూడా భారీ రెమ్యునరేషన్ ఆఫర్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.

Image

ఇక బుల్లితెర పై హాట్ యాంకర్ గా వర్షిణికి మంచి క్రేజ్ ఉంది. సోష‌ల్ మీడియాలో హాటు అందాల‌ను ఆర‌బోస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ. అటు నా పేరు మీనాక్షి, వాణి రాణి, ఆహ్వానం వంటి సీరియ‌ల్స్‌తో మంచి ఫేం సంపాదించుకుంది నటి నవ్యసామి. ఒకవేళ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఎన్ని రోజులు హౌజ్ లో ఉంటారన్నది చూడాలి.

Also Read :