Bhakthi

Horoscope Zodiac Signs 2021-2022 : ప్లవ నామ సంవత్సరం పంచాంగం.. అన్ని రాశుల ఫలితాలు

Horoscope Zodiac Signs 2021-2022 : ప్లవ నామ సంవత్సరంలో అన్ని రాశుల ఫలితాలు కింది విధంగా ఉన్నాయి. వీటిలో ఒక్కో రాశి (Horoscope Zodiac Signs 2021-2022) గురించి ప్రత్యేకంగా వివరించడం జరిగింది. నెలల వారీగా కూడా ఆ వివరాలు ఉంటాయి.

1.మేష రాశి ఫలాలు (Aries Horoscope Zodiac Signs 2021-2022)

Mesha-Raasi-Horoscope
Aries Sign

అశ్విని నక్షత్రం 1,2,3,4 పాదములు లేదా భరణి నక్షత్రం 1,2,3,4 పాదములు లేదా కృత్తిక నక్షత్రం 1వ పాదములో జన్మించినవారు మేషరాశికి చెందును

2020 – 2021 శ్రీ ప్లవ నామ సంవత్సరంలో మేష రాశి (Horoscope Mesha Raasi Aries) వారికి  ఆదాయం – 08,  వ్యయం – 14 ,   రాజపూజ్యం – 04   అవమానం – 03

పూర్వ పద్దతిలో మేషరాశి వారికి వచ్చిన శేష సంఖ్య “5” .ఇది శ్రీ ప్లవ నామ సంవత్సరంలో మీ ప్రమేయం లేకుండానే అపవాదులు మరియు అవమానములను పొందడాన్ని సూచించుచున్నది.

మేష రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరం అనగా 13-ఏప్రిల్-2021 నుండి 01-ఏప్రిల్-2022 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు గ్రహం 19-నవంబర్-2021 వరకు వ్యతిరేక ఫలితాలు ఏర్పరచును. ముఖ్యంగా పితృ వర్గం లోని పెద్ద వయస్సు వారికి తీవ్ర ఆరోగ్య సమస్యలు మరియు ప్రాణ గండములు ఏర్పరచును. వారసత్వ సంబంధ సంపద విషయంలో తగాదాలు ఎదుర్కొందురు. కుటుంబంలో తరచుగా శుభ కార్య సంబంధ వ్యయం అధికంగా ఏర్పరచును. వ్యక్తిగత జాతకంలో గురు గ్రహం నీచ క్షేత్రం లో ఉన్న వారు ఒక పర్యాయం 16 రోజుల గురు గ్రహ శాంతి జపము జరిపించు కొనుట మంచిది.. 20-నవంబర్-2021 నుంచి మేష రాశి వారికి గురు గ్రహం అనుకూల ఫలితాలు ప్రసాదించుట ప్రారంభం అగును. మిక్కిలి న్యాయమైన ధన సంపాదన ఏర్పరచును. జీవన విధానంలో నూతన యోగములను ప్రసాదించును.

మేష రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో శని వలన సంవత్సరం అంతా అనుకూల ఫలితాలు ఏర్పడును. శని మేష రాశి వారికి ఆశించిన విధంగా ధన సంపాదన లభింప చేయును. నల్లని వస్తువులు, నల్లని ధాన్యముల, లోహముల వ్యాపారం చేసే వారికి మంచి లాభములు లభింపచేయును. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అగును. నూతన దంపతుల సంతాన ప్రయత్నాలు ఫలించి సంతాన సౌఖ్యం కలుగచేయును. శ్రీ ప్లవ నామ సంవత్సరంలో మేష రాశి వారికి ఏలినాటి శని దశ లేదు.

మేష రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో కూడా రాహు గ్రహం సంవత్సరం అంతా మంచి ఫలితాలు ఏర్పరచును. గడిచిన శ్రీ శార్వరి నామ సంవత్సరం వలెనే ఈ ప్లవ నామ సంవత్సరంలో కూడా పేర్కొనదగిన తీవ్ర వ్యతిరేక ఫలితాలు ఏమియూ రాహు గ్రహం వలన మేష రాశి వారికి లేవు.

మేష రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో కూడా కేతు గ్రహం వలన గడిచిన శార్వరి నామ సంవత్సరం వలననే అనేక సమస్యలు ఏర్పడును. శారీరక సౌఖ్యం తక్కువ అగును. ప్రతి కార్యానికి తీవ్రంగా శ్రమించ వలెను. వ్యక్తిగత జాతకంలో పితృ స్థానంలో కేతు గ్రహ దోషములు కలిగిన వారికి పితృ ఖర్మలు చేయవలసిన పరిస్థితులు ఏర్పడు సూచన. ఆధ్యాత్మిక జీవన సాధనలో ఆశించిన పురోగతి లభించదు. నూతనంగా దైవ ఉపాసన చేయదలచిన వారికి అనేక విఘ్నములు ఏర్పడును.

2.వృషభ రాశి ఫలాలు (Taurus Horoscope Zodiac Signs 2021-2022)

Vrushaba-nama-samvtsara-m
Taurus Sign

మీ జన్మ నక్షత్రం కృత్తిక 2,3,4 పాదములు లేదా రోహిణి 1,2,3,4 పాదములు లేదా మృగశిర 1,2 పాదములలో ఒకటి ఐయిన మీది వృషభరాశి.

2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సరంలో వృషభ రాశి (Horoscope Vrushabha Raasi) వార్కి  ఆదాయం – 02  వ్యయం – 08 రాజపూజ్యం – 07  అవమానం – 03

పూర్వ పద్దతిలో వృషభ రాశి వారికి వచ్చిన శేష సంఖ్య “1”. ఇది శ్రీ ప్లవ నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి తలపెట్టిన కార్యములలో విజయాన్ని సూచించుచున్నది.

వృషభరాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరం అనగా 13-ఏప్రిల్-2021 నుండి 01-ఏప్రిల్-2022 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు గ్రహం వలన 19-నవంబర్-2021 వరకు తీవ్ర వ్యతిరేక ఫలితాలు ఏర్పరచును. ముఖ్యంగా శారీరక సమస్యలు తరచుగా బాధించును. జీవితంలో అనుభవిస్తున్న యోగం చెడిపోవును. చేజేతులారా తప్పులు చేసి నష్టాలు ఏర్పరచు కొందురు. ఏ ప్రయత్నం కూడా మానసికంగా సంతృప్తిని కలుగ చేయదు. నూతన భారీ పెట్టుబడులు 19-నవంబర్-2021 వరకు పెట్టకుండా ఉండటం మంచిది. 20-నవంబర్-2021 నుంచి వృషభ రాశి వారికి గురు గ్రహం యోగించును. ముఖ్యంగా వ్రుత్తి విద్యా కోర్సులు చదివిన వారికి అతి చక్కటి ఉద్యోగ అవకాశములు, స్వయం ఉపాధి చేయు వారికి విశేష ధనార్జన ఏర్పరచును. విద్యార్థులకు విశేష లాభ పూరిత సమయం. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న తీర్ధ యాత్రలు 20-నవంబర్-2021 తదుపరి పూర్తి చేయగలుగుతారు. ఆచార వంతమైన జీవితం ప్రారంభించడానికి ఈ కాలం అత్యంత అనుకూల కాలం. విడిచి పెట్టాలని అనుకున్న దురలవాట్లకు దూరం కాగలుగుతారు.

వృషభ రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో శని గ్రహం గడిచిన శార్వరి నామ సంవత్సరం వలెనే మంచి ఫలితాలను కలుగచేయును. నూతన వాహన కోరిక నెరవేరును. వారసత్వ సంపద లభించును. పనిచేస్తున్న రంగములలో మిక్కిలి పేరు ప్రతిష్టలు పొందగలరు. వ్యక్తిగత జాతకంలో శని బలంగా ఉన్న ఉద్యోగులకు పదవిలో ఉన్నతి లభించును. ఆర్ధిక లక్ష్యాలను చేరుకొంటారు. వ్యక్తిగత జాతకంలో శని స్వక్షేత్రం లేదా ఉచ్చ స్థితి లేదా మూల త్రికోణము లో ఉన్న వారు సులువుగా విశేషమైన ధనార్జన చేయగలరు. ఇటువంటి జాతకులు తమ వంశానికి పేరు ప్రఖ్యాతలు వచ్చు సత్కార్యములు చేయుదురు. శ్రీ ప్లవ నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఏలినాటి శని దశ లేదు.

వృషభ రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో రాహువు – కేతువు ల వలన మిశ్రమ ఫలితాలు ఏర్పడును. సమాజంలో పేరు ప్రఖ్యాతలు ఏర్పరచును. కోరుకున్న విధంగా స్థాన చలనం ఏర్పరచును. పితృ వర్గీయులతో ఎదుర్కొంటున్న సమస్యలు తొలగును. అయితే శారీరక అనారోగ్యం, వైవాహిక జీవనంలో తీవ్ర గొడవలు, వివాహ ప్రయత్నాలు చేయువారికి ఆటంకాలు ఏర్పరచును.

  3. మిధున రాశి ఫలాలు  (Gemini Horoscope Zodiac Signs 2021-2022)

Mithuna-Raasi---Horoscope
Gemini Sign

మృగశిర 3 , 4 పాదములు లేదా ఆరుద్ర 1,2,3,4 పాదములు లేదా పునర్వసు 1,2,3 పాదములలో జన్మించిన వారు మిధునరాశికి చెందును.

2021- 2022 శ్రీ ప్లవ నామ సంవత్సరంలో మిధున వారికి

ఆదాయం – 05   వ్యయం – 05   రాజ పూజ్యం – 03   అవమానం – 06

పూర్వ పద్దతిలో మిధున రాశి వారికి వచ్చిన శేష సంఖ్య “1”. ఇది శ్రీ ప్లవ నామ సంవత్సరంలో మిధున రాశి వారికి చేపట్టిన వ్రుత్తి సంబంధ కార్యములలో విజయాన్ని సూచించుచున్నది.

మిధున రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో అనగా 13-ఏప్రిల్-2021 నుండి 01-ఏప్రిల్-2022 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు గ్రహం వలన 19-నవంబర్-2021 వరకు అనేక ఆటంకాలు, ఉద్యోగ జీవనంలో ఆకస్మిక నష్టాలు, సంతాన సంబంధ అనారోగ్యత , దాయాదుల వలన న్యాయస్థాన సమస్యలు , రక్త లేదా మెదడు నరాలకు సంబందించిన ఆరోగ్య ప్రమాదాలు ఏర్పరచును. 20-నవంబర్-2021 నుంచి గురు గ్రహం మిధున రాశి వారికి పూర్తిగా అనుకూలించును. వారసత్వ సంబంధ సమస్యలు తొలగి స్థిరాస్తి లాభములు అనుభవింపచేయును. మిధున రాశి కి చెందిన సంతానం కలిగిన తల్లిదండ్రులు కూడా 20-నవంబర్-2021 తదుపరి మంచి ఫలితాలు ఎదుర్కొందురు. అన్ని విధములా గురు గ్రహం 20-నవంబర్-2021 నుండి అనుకూల ఫలితాలు ఏర్పరచును.

మిధున రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో శని వలన అనుకూల ఫలితాలు ఏర్పడవు. ఆరోగ్య సమస్యలు కొనసాగును. వృద్ధులైన తల్లిదండ్రుల కు ఈ సంవత్సరం అంతా ప్రమాద కరమైన కాలం. వారి ఆరోగ్య విషయాల పట్ల సదా జాగ్రత్తగా ఉండవలెను. శనైశ్చరునికి ఒక పర్యాయం శాంతి జపం జరిపించుకోనుట మంచిది. మిధున రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో ఏలినాటి శని దశ లేదు.

మిధున రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో రాహువు – కేతువు వలన వ్యాపార సంబంధ, వివాహ సంబంధ న్యాయస్థాన తగాదాలలో విజయం లభింపచేయును. అయితే సంవత్సరం అంతా తరచుగా వృధా వ్యయం ఎదుర్కొందురు. ఆర్జించిన ధనం చేతిపై నిలువదు. అనుకున్న విధంగా నిలువ ధనం ఏర్పరచుకోలేరు. స్నేహితుల వలన ఆర్ధిక సంబంధ ఇబ్బందులు, నమ్మక ద్రోహం ఏర్పడును. భాగస్వామ్య వ్యాపారం చేసే వారు ఆర్ధిక అంశాలలో జాగ్రత్తగా ఉండవలెను.

4. కర్కాటక రాశి ఫలాలు ( Cancer Horoscope Zodiac Signs 2021-2022)

Karkataka-Raasi-Horoscope
Cancer Sign

పునర్వసు నక్షత్ర 4 వ పాదం లేదా పుష్యమీ నక్షత్ర 1,2,3,4 పాదములు లేదా ఆశ్లేషా నక్షత్ర 1,2,3,4 వ పాదములలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందును.

శ్రీ ప్లవ నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి

ఆదాయం 14, వ్యయం – 02,  రాజ పూజ్యం – 06, అవమానం – 06

పూర్వ పద్దతిలో కర్కాటక రాశి వారికి వచ్చిన శేష సంఖ్య “7”. ఇది శ్రీ ప్లవ నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి వ్రుత్తి వ్యాపారాలలో , కుటుంబ వ్యవహారములలో విజయాన్ని సూచించుచున్నది.

కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో అనగా 13-ఏప్రిల్-2021 నుండి 01-ఏప్రిల్-2022 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు గ్రహం వలన సంవత్సరం అంతా అనుకూల ఫలితాలు ఏర్పడవు. గత శార్వరి నామ సంవత్సరం మాదిరిగానే గురు గ్రహం వలన ఇబ్బందులు కొనసాగును. ముఖ్యంగా గురువు 20-నవంబర్-2021 నుంచి తీవ్ర ఆర్ధిక సమస్యలు ఏర్పరచును. స్వార్జిత మరియు పిత్రార్జిత ధన సంపదలు రెండూ వ్యయం అగును. వ్యక్తిగత జాతకంలో గురువు నీచ క్షేత్ర లేదా శత్రు స్థానాలలో కలిగి ఉన్న కర్కాటక రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరం అంతా గురు గ్రహానికి తరచుగా అభిషేకాలు, శాంతి జపములు అవసరం.

కర్కాటక రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో శని వలన ఉద్యోగ జీవనంలో కొద్దిపాటి ఉన్నతి లభించును. కష్టం మీద పదోన్నతి మరియు ప్రయత్నాలు విజయం పొందును. జాతకంలో శని వలన కళత్ర దోషం కలిగిన వారు ఈ సంవత్సరం కూడా వివాహ జీవనంలో ఇబ్బందులు ఎదుర్కొందురు. కర్కాటక రాశి వారందరికీ శ్రీ ప్లవ నామ సంవత్సరంలో కూడా విశేష ఆరోగ్య సమస్యలు ఏర్పడు సూచనలు ఉన్నాయి. ఆరోగ్య విషయాలలో అజాగ్రత్త పనికిరాదు. శ్రీ ప్లవ నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఏలినాటి శని లేదు.

కర్కాటక రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో రాహువు – కేతువు ఇరువురూ మంచి అనుకూల ఫలితాలు ఏర్పరచును. కర్కాటక రాశి వారికి ఆర్ధిక అంశాలలో ఏమైనా మిగులు ధనం ఉన్నదంటే అది రాహు – కేతువుల వలననే ఏర్పడును. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేయు వారికి విజయం ఏర్పరచును. సంతాన ప్రయత్నాలు చేయు వారికి చక్కటి సంతాన సౌఖ్యం ఏర్పరచును. కర్కాటక రాశి వారికి రాహు-కేతువుల వలన శ్రీ ప్లవ నామ సంవత్సరంలో ఎటువంటి ఇబ్బందులు ఏర్పడవు.

5. సింహ రాశిఫలాలు (Leo Horoscope Zodiac Signs 2021-2022)

Simha-Raasi---Horoscope
Leo Sign

శ్రీ ప్లవ నామ సంవత్సరంలో సింహ రాశి వారికి ఆదాయం 02, వ్యయం – 14, రాజ పూజ్యం – 02, అవమానం – 02.

పూర్వ పద్దతిలో సింహ రాశి వారికి వచ్చిన శేష సంఖ్య “7”. ఇది శ్రీ ప్లవ నామ సంవత్సరంలో సింహ రాశి వారికి అన్ని వ్యవహారములలో విజయాన్ని సూచించుచున్నది.

సింహరాశి(Horoscope Simha Raasi Leo) వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో అనగా 13-ఏప్రిల్-2021 నుండి 01-ఏప్రిల్-2022 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు గ్రహం వలన 19-నవంబర్-2021 వరకు కలిసి రాదు. గత శార్వరి నామ సంవత్సరపు సమస్యలు కొనసాగును. 20-నవంబర్-2021 నుంచి గురు గ్రహం యోగించును. ఆర్ధికంగా నూతన అవకాశములు కలుగ చేయును. అవివాహితులకు చక్కటి సంబంధాలు లభించును. వైవాహిక జీవన సుఖసౌఖ్యాలు పొందుదురు. దీర్ఘకాలికంగా కళత్ర జీవనంలో ఎదుర్కుంటున్న సమస్యలు తొలగును. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయాలు కొద్దిపాటి ఇబ్బందులు ఏర్పరచును.

సింహ రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో శని గ్రహం వలన సంవత్సరం అంతా మంచి ఫలితాలు లభించును. కుటుంబ మరియు వ్రుత్తి సంబంధ శత్రువులపై విజయం పొందుదురు. తగాదాలలో ఉన్న స్థిరాస్తి సమస్యలు సింహ రాశి వారికి అనుకూలంగా ముగియు సూచనలు అధికంగా ఉన్నవి. శ్రీ ప్లవ నామ సంవత్సరంలో సింహ రాశి వారికి ఏలినాటి శని దశ లేదు.

సింహ రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో రాహువు – కేతువుల వలన సంవత్సరం అంతా సంపూర్ణ ఆయుర్ భాగ్యములు లభించును. విశేషమైన ధనార్జన ఏర్పరచును. మాత్రు వర్గం వలన లాభాపడుడురు. భూ లేదా గృహ సౌఖ్య ప్రయత్నాలకు ఈ సంవత్సరం అనుకూల కాలం. రాహు- కేతువుల వలన విద్యా పరంగా విద్యార్థులకు అతి చక్కటి ఫలితాలు ఏర్పరచును.

6. కన్యా రాశి ఫలాలు (Virgo Horoscope Zodiac Signs 2021-2022)

Kanya--Raasi-Horoscope
Virgo sign

ఉత్తర 2,3,4 పాదములు లేదా హస్త 1,2,3,4 పాదములు లేదా చిత్త 1,2 పాదములలో జన్మించిన వారు కన్యారాశికి చెందును.

శ్రీ ప్లవ నామ సంవత్సరంలో కన్యా రాశి వారికి   ఆదాయం 05, వ్యయం – 05, రాజ పూజ్యం – 05, అవమానం – 02.

పూర్వ పద్దతిలో కన్యా రాశి వారికి వచ్చిన శేష సంఖ్య “1”. ఇది శ్రీ ప్లవ నామ సంవత్సరంలో కన్యా రాశి వారికి చక్కటి విజయాన్ని సూచించుచున్నది.

కన్యారాశి  వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో అనగా 13-ఏప్రిల్-2021 నుండి 01-ఏప్రిల్-2022 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు గ్రహం వలన సంవత్సరం అంతా అనుకూల ఫలితాలు ఏర్పడవు.తరచుగా గురు గ్రహం అనేక ఇబ్బందులు, ఆటంకాలు, అపవాదులు ఏర్పరచును. వారసత్వ సంబంధ స్థిరాస్తులు నష్టపోవు సూచనలు అధికంగా ఉన్నవి. వ్యక్తిగత జాతకంలో గురు గ్రహ బలం లోపించిన కన్యా రాశి వారు శ్రీ ప్లవ నామ సంవత్సరంలో ప్రతీ విషయంలో ఆలోచించుకొని వ్యవహరించాలి. వ్యక్తిగత జీవితంలో ముఖ్య నిర్ణయాలలో చాలా జాగ్రత్త వహించాలి.

కన్యా రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో శని గ్రహం వలన సంవత్సరం అంతా ఆర్ధికంగా చక్కటి అనుకూల ఫలితాలు ఏర్పడును. సంతాన ప్రయత్నాలు చేయు వారికి సుందరమైన పుత్రికా సంతానం లభించును. పుత్ర సంతానమునకు మాత్రం ఆరోగ్య సమస్యలు ఏర్పరచును. లోహ సంబంధ వ్యాపారాలు చేసే వారు విశేషమైన లాభములు పొందుతారు. శ్రీ ప్లవ నామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఏలినాటి శని దశ లేదు.

కన్యా రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో రాహువు- కేతువు ఇరువురూ సంవత్సరం అంతా మంచి ఫలితాలు ఏర్పరచును. భూ సంబంధ వ్యాపారాలు చేయు వారికి విశేష ధనార్జన కలుగ చేయును. అయితే పితృ వర్గం వారికి సంవత్సరం మధ్య మధ్య తీవ్ర ఆరోగ్య భంగములు కలుగ చేయును.

7.  తులా రాశి  ఫలాలు (Libra Horoscope Zodiac Signs 2021-2022)

Tula--Raasi-Horoscope
Libra sign

చిత్త 3,4 పాదములు లేదా స్వాతి 1,2,3,4 పాదములు లేదా విశాఖ 1,2,3 పాదములులో జన్మించినవారు తులా రాశికి చెందును.

శ్రీ ప్లవ నామ సంవత్సరంలో తులా రాశి వారికి ఆదాయం 02, వ్యయం – 08, రాజ పూజ్యం – 01, అవమానం – 05

పూర్వ పద్దతి లో తులారాశి వారికి వచ్చిన శేష సంఖ్య “1”. ఇది శ్రీ ప్లవ నామ సంవత్సరంలో తులా రాశి వారికి కళా రంగ విషయాల్లో , రాజకీయ రంగ విషయాల్లో విజయాన్ని సూచించుచున్నది.

తులారాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో అనగా 13-ఏప్రిల్-2021 నుండి 01-ఏప్రిల్-2022 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు గ్రహం వలన మిశ్రమ ఫలితాలు ఏర్పడతాయి. 19 నవంబర్ 2021 వరకూ శత్రు విజయాలను ఏర్పరచును. సొంత గృహ యోగం కలుగ చేయును. భూ సంబంధ క్రయ విక్రయాలకు అనుకూలమైన కాలం. మాత్రు వర్గీయుల వలన ఆర్థికం గా లాభములు పొందుదురు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభించును. 20 నవంబర్ 2021 నుండి గురువు వలన తులారాశి వారికి అంత అనుకూల ఫలితాలు లభించవు. అనవసర తగాదాలు, ఆరోగ్య సమస్యలు, వృధా ధన వ్యయం, షేర్ మార్కెట్ లేదా వ్యాపార పెట్టుబడుల్లో నష్టాలు ఏర్పడును.

తులా రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో శని గ్రహం వలన సంవత్సరం అంతా అనుకూల ఫలితాలు ఏర్పడును. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభించును. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న వారు శని వలన మిక్కిలి లాభములు పొందుదురు. మొత్తం మీద శ్రీ ప్లవ నామ సంవత్సరం అంతా శని తులారాశి వారికి చక్కటి అభివృద్ధి కర ఫలితాలు ఏర్పరచును.శ్రీ ప్లవ నామ సంవత్సరంలో తులారాశి వారికి ఏలినాటి శని దశ లేదు.

తులా రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో రాహువు – కేతువు ఇరువురూ వలన ఆర్థికం గా లాభములు ఏర్పడినా మిగిలిన విషయాలలో అనుకూలమైన ఫలితాలు ఏర్పడవు. ముఖ్యంగా వ్యక్త్రి గత జీవితంలో తీవ్ర ఒడిదుడుకులు , జీవిత భాగస్వామి సంబంధిత విచారత, సంతాన ప్రయత్నాలు విఫలం మగును. ఎదిగిన సంతానం వ్యవహార శైలి వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. శ్రీ ప్లవ నామ సంవత్సరం అంతా రాహు – కేతువు లు యోగించరు.

8. వృచ్చికరాశి ఫలాలు (Scorpio Horoscope Zodiac Signs 2021-2022)

Vruschika--Raasi-Horoscope
Scorpio Sign

విశాఖ 4 వ పాదము లేదా అనురాధ 1,2,3,4 పాదములు లేదా జ్యేష్ఠ 1,2,3,4 పాదములులో జన్మించినవారు వృచ్చిక రాశికి చెందును.

శ్రీ ప్లవ నామ సంవత్సరంలో వృచ్చిక రాశి వారికి ఆదాయం 08, వ్యయం – 14, రాజ పూజ్యం – 04, అవమానం – 05

పూర్వ పద్దతి లో వృచ్చిక రాశి వారికి వచ్చిన శేష సంఖ్య “5”. ఇది శ్రీ ప్లవ నామ సంవత్సరంలో వృచ్చిక రాశి వారికి సమాజం లో అపవాదులు, అపఖ్యాతి పొందుట సూచించుచున్నది.

వృచ్చికరాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో అనగా 13-ఏప్రిల్-2021 నుండి 01-ఏప్రిల్-2022 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు గ్రహం వలన ప్రధమ అర్ధ భాగం అనగా 19 నవంబర్ 2021 వరకు తీవ్ర వ్యతిరేక ఫలితాలు ఏర్పరచును. చేపట్టిన కార్యములలో అనేక ఆటంకాలు, ఊహించని నష్టములు ఎదుర్కొందురు. ఉద్యోగ జీవనంలో నిలకడ లోపించును. ఆర్ధిక అంశాలలో ఇతరులకు రుణాలు ఇచ్చుట, ఇతరుల రుణాలకు హామీలు ఉండుట చేయకూడదు. 20 నవంబర్ 2021 నుండి గురు గ్రహం అనుకూల ఫలితాలు ప్రసాదించును. విద్యార్ధులకు విదేశీ విద్యలో ఆశించిన ఫలితాలు లభించును. కుటుంబానికి భూ లేదా గృహ వసతిని ఏర్పరచుకోగలుగుతారు.

వృచ్చిక రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో శని గ్రహం వలన పూర్వపు శార్వరి నామ సంవత్సరం వలెనే సామాన్య యోగ వంతమైన ఫలితాలు ఏర్పడును. వృచ్చిక రాశి వారికి శనైశ్చరుడు లాభ వ్యయాలను సమానంగా ఏర్పరచును. శ్రీ ప్లవ నామ సంవత్సరం అంతా తీవ్ర వ్యతిరేక ఫలితాలు కాని, తీవ్ర అనుకూల ఫలితాలు కాని ఏర్పడవు. వృచ్చిక రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో ఏలినాటి శని దశ లేదు.

వృచ్చిక రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో రాహు గ్రహం వలన చక్కటి ఆర్ధిక లాభములు, వ్యాపార సంబంధ విజయాలు , ఆర్ధిక లావాదేవీలలో కోర్టు కేసులు అనుకూలంగా తీర్పులు లభించుట వంటి అనుకూల ఫలితాలు ఏర్పడును.

వృచ్చిక రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో కేతు గ్రహం వలన కష్టములు ఎదురగును. ముఖ్యంగా వైవాహిక జీవనంలో ఇబ్బందులు , నిత్య తగాదాలు ఎదురగును. అవివాహితుల వివాహ సంబంధ ప్రయత్నాలు కూడా కష్టం మీద ఫలించును. వైవాహిక జీవనంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వృచ్చిక రాశి వారు తరచుగా కేతు గ్రహ శాంతులు జరిపించుకోనుట మంచిది.

9. ధనుర్ రాశి ఫలాలు (Sagittarius Horoscope Zodiac Signs 2021-2022)

Dhanassu--Raasi-Horoscope
sagittarius sign

మూల 1,2,3,4 పాదములు లేదా పుర్వాషాడ 1,2,3,4 పాదములు లేదా ఉత్తరాషాడ 1 వ పాదములో జన్మించినవారు ధనుర్ రాశికి చెందును.

శ్రీ ప్లవ నామ సంవత్సరంలో ధనుర్ రాశి వారికి ఆదాయం 11, వ్యయం – 05, రాజ పూజ్యం – 07, అవమానం – 05

పూర్వ పద్దతి లో ధనుర్ రాశి వారికి వచ్చిన శేష సంఖ్య “7”. ఇది శ్రీ ప్లవ నామ సంవత్సరంలో ధనుర్ రాశి వారికి యంత్ర సంబంధ వ్యాపార వ్యవహారములో విజయం పొందుట సూచించుచున్నది.

ధనుర్ రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో అనగా 13-ఏప్రిల్-2021 నుండి 01-ఏప్రిల్-2022 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో కూడా ఏలినాటి శని దశ ఉన్నది.

శ్రీ ప్లవ నామ సంవత్సరంలో ధనుర్ రాశి వారికి గురు గ్రహం వలన అంతగా అనుకూల ఫలితాలు ఏర్పడవు. శారీరక శ్రమ పెరుగును. కుటుంబ జీవనంలో సుఖ లేమి ఎదుర్కొందురు. వృధా ప్రయాణాలు చేయవలసి వచ్చును లేదా చోరుల వలన ప్రయాణాలలో విలువైన వస్తువులు పోగొట్టు కొనుట లేదా ఆరోగ్య సమస్యలు పొందుట జరుగును. సొదరీ వర్గం వలన ప్రయోజనం పొందుతారు. వారి వలన కొన్ని కష్టాల నుండి బయట పడతారు.

ధనుర్ రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో ఏలినాటి శని దశ వలన పూర్వపు శార్వరి నామ సంవత్సరం వలెనే శనైచరుని వలన ఇబ్బందులు కొనసాగుతాయి. కష్టం మీద తలచిన విధంగా ధనాన్ని కూడబెట్టగలుగుతారు. మొదటి వివాహం నష్టపోయి , పునర్ వివాహ ప్రయత్నాలు చేయు వారికి ఈ ప్లవ నామ సంవత్సరం పునర్ వివాహ పరంగా అనుకూల ఫలితాలు ఏర్పరచును ధనుర్ రాశి వారు ఈ ప్లవ నామ సంవత్సరం అంతా ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు పాటించవలెను. తరచుగా ఏలినాటి శని ప్రతికూల ప్రభావ నిర్మూలన కోసం శని కి శాంతి జపములు చేయించుకొనుట మంచిది.

ధనుర్ రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో రాహు – కేతువులు ఇరువురూ సంవత్సరమంతా అనుకూల ఫలితాలనే ఏర్పరచును. వ్యక్తిగత జాతకంలో రాహు – కేతువులు ఉచ్చ లేదా స్వక్షేత్ర ములలో ఉన్న వారు సమాజంలో విశేష ఖ్యాతిని ఆర్జించెదరు. కోర్టు కేసులలో తీర్పులు అనుకూలంగా లభించును. దేవాలయములు లేదా ధార్మిక కేంద్రాలను నిర్మించుటలో పాత్ర వహిస్తారు.

10. మకరరాశి ఫలాలు (Capricorn Horoscope Zodiac Signs 2021-2022)

Makara-Raasi---Horoscope
capricorn sign

ఉత్తరాషాడ 2,3,4 పాదములు లేదా శ్రవణం 1,2,3,4 పాదములు లేదా ధనిష్ఠ 1,2, పాదములలో జన్మించినవారు మకర రాశికి చెందును.

శ్రీ ప్లవ నామ సంవత్సరంలో మకర రాశి వారికి ఆదాయం – 14, వ్యయం – 14, రాజ పూజ్యం – 03, అవమానం – 01

పూర్వ పద్దతి లో మకర రాశి వారికి వచ్చిన శేష సంఖ్య “3”. ఇది శ్రీ ప్లవ నామ సంవత్సరంలో మకర రాశి వారికి ఆరోగ్య చికాకులను, కుటుంబ సమస్యలను సూచించుచున్నది.

మకరరాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో అనగా 13-ఏప్రిల్-2021 నుండి 01-ఏప్రిల్-2022 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో కూడా ఏలినాటి శని దశ ఉన్నది. శ్రీ ప్లవ నామ సంవత్సరంలో మకర రాశి వారికి గురు గ్రహం వలన మిశ్రమ ఫలితాలు ఏర్పడతాయి. గురువు వలన ఈ సంవత్సర ప్రారంభం నుండి 19 నవంబర్ 2021 వరకు ప్రతికూల ఫలితాలు, 20 నవంబర్ 2021 నుండి అతి చక్కటి అనుకూల ఫలితాలు పొందుతారు. ఆశించిన విధంగా ధనం వృద్ది చెందుతుంది. సంతాన ప్రయత్నాలలో కూడా సఫలత లభిస్తుంది.

మకర రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో కూడా ఏలినాటి శని దశ ఉన్నది. శనైచ్చరుడు తనుస్థానంలో స్వక్షేత్రం లో ఉండుట వలన వ్యక్తిగత జాతకంలో శని దోషం ఉన్న మకర రాశి వారికి ఈ ప్లవ నామ సంవత్సరం అంతా కలసి రాదు. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశాపరచును. స్త్రీలు మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందురు. వృధాగా ధనం వ్యయం అగును. మీ కుటిల స్వభావం వలన మంచి మిత్రులను దూరం చేసుకొనుటకు సూచనలు అధికంగా ఉన్నవి. చర్మ సంబంధ సుఖ వ్యాధులు వలన బాధలు ఎదుర్కొందురు.

మకర రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో రాహు – కేతువులు ఇరువురి వలన వ్యక్తిగతంగా తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడవు. అయితే జూలై నుండి డిసెంబర్ మధ్య కాలంలో బాగా ఎదిగిన సంతానానికి ఆరోగ్య సమస్యలు ఏర్పరచును.

11. కుంభ రాశి ఫలాలు (Aquarius Horoscope Zodiac Signs 2021-2022)

Kumba-Raasi---Horoscope
Aquarius sign

ధనిష్ఠ 3,4 పాదములు లేదా శతభిషం 1,2,3,4 పాదములు లేదా పూర్వాభాద్ర 1,2,3,4 పాదములలో జన్మించినవారు కుంభరాశి కి చెందును.

శ్రీ ప్లవ నామ సంవత్సరంలో కుంభ రాశి వారికి ఆదాయం 14, వ్యయం – 14, రాజ పూజ్యం – 06, అవమానం – 01

పూర్వ పద్దతి లో కుంభ రాశి వారికి వచ్చిన శేష సంఖ్య “3”. ఇది శ్రీ ప్లవ నామ సంవత్సరంలో కుంభ రాశి వారికి ఎదురగు శారీరక మరియు మానసిక సమస్యలను సూచించుచున్నది.

కుంభరాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో అనగా 13-ఏప్రిల్-2021 నుండి 01-ఏప్రిల్-2022 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో కూడా ఏలినాటి శని దశ ఉన్నది.  శ్రీ ప్లవ నామ సంవత్సరంలో కుంభ రాశి వారికి గురు గ్రహం వలన ఈ  సంవత్సర ప్రారంభం నుండి 19 నవంబర్ 2021 వరకు సంతానం వలన లేదా సంతాన విషయ ములక సమస్యలు, భాత్రు వర్గం వలన ఇబ్బందులు, మానసిక చికాకులు, వృధాగా ధన వ్యయం వంటి వ్యతిరేక  ఫలితాలు ఏర్పడును. 20 నవంబర్ 2021 నుండి గురువు లగ్న స్థానములో ఉండుట వలన అతి చక్కటి అనుకూల ఫలితాలు పొందుతారు. జీవన విధానంలో ఆశించిన ఉన్నతి పొందుతారు. ఉద్యోగ జీవనం లోని వారికి కోరుకున్న విధంగా అనుకూల మార్పులు లభిస్తాయి. శరీర బరువు అదుపులో పెట్టుకోవలెను. నరముల లేదా మెదడు సంబంధిత అనారోగ్యలతో బాధ పడుతున్నవారికి ఆరోగ్యం మెరుగు పడుతుంది.

కుంభ రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో కూడా ఏలినాటి శని దశ ఉన్నది. శనైచ్చరుడు వ్యయ స్థానంలో ఉండుట వలన సంవత్సరం అంతా యోగించడు. కుంభ రాశి వారు శ్రీ ప్లవ నామ సంవత్సరం అంతా వాహనాల విషయంలో మిక్కిలి జాగ్రత్తగా ఉండవలెను. వీలైనంత వరకు ఈ సంవత్సరం అంతా సుదూర ప్రయాణాలు చేయకుండా ఉండుట మంచిది. వ్యాపార రంగం లోని వారు నూతన భారీ పెట్టుబడులు పెట్టుట మంచిది కాదు. బంగారు ఆభరణాలపై ఋణాలు తీసుకొనుట కూడా మంచిది కాదు. వ్యయ స్థాన గతుడైన శని వలన వడ్డీల వలన భాదపడు సూచనలు అధికంగా ఉన్నవి. తరచుగా శనికి తైలభిషేకలు జరుపుట మంచిది.

కుంభ రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో రాహు – కేతువులు ఇరువురి వలన కుంభ రాశి వారందరూ చక్కటి అనుకూల ఫలితాలు లభించును. ముఖ్యంగా రాజకీయ రంగం లోని వారికి మిక్కిలి ప్రతిష్టాత్మక పదవులు లభింప చేయును. విద్యార్ధులకు కూడా ఆశించిన విధంగా ఉన్నత విద్యావకాశాలు లభింప చేయును. పర దేశ విద్యాలయలందు ప్రవేశం కోసం చేయు ప్రయత్నాలు లాభించును.

12. మీనరాశి ఫలాలు (Pisces Horoscope Zodiac Signs 2021-2022)

Meena-Raasi---Horoscope
Pisces

శ్రీ ప్లవ నామ సంవత్సరంలో మీన రాశి వారికి ఆదాయం 11, వ్యయం – 05, రాజ పూజ్యం – 02, అవమానం – 04

పూర్వ పద్దతి లో మీన రాశి వారికి వచ్చిన శేష సంఖ్య “7”. ఇది శ్రీ ప్లవ నామ సంవత్సరంలో మీన రాశి వారికి వ్రుత్తి పరమైన జీవనంలో చక్కటి విజయం సూచించుచున్నది.

మీనరాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో అనగా 13-ఏప్రిల్-2021 నుండి 01-ఏప్రిల్-2022 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు గ్రహం వలన ఈ  సంవత్సర ప్రారంభం నుండి 19 నవంబర్ 2021 వరకు ప్రతీ వ్యవహారం చికాకులతో పూర్తి అగును. అదృష్టం అంతగా కలసి రాదు. అయితే చక్కటి మిత్ర వర్గం మాత్రం లభించును. నూతన ఉన్నత వ్యక్తిత్వం కలిగిన  వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. 20 నవంబర్ 2021 నుండి మీ చేతిపై ధర్మ కార్య సంబంధ వ్యయం తరచుగా ఏర్పడును. దీర్ఘ కాలికంగా ఎదురుచూస్తున్న విహార యాత్రలను అనుభవించ కలుగుతారు.

మీన రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో శని వలన  సంవత్సరం అంతా అనుకూల ఫలితాలు లభించును. ఆర్ధికంగా విశేష యోగం అనుభవిస్తారు. శని వలన ఈ సంవత్సరం తీవ్రమైన ప్రతికూల ఫలితాలు ఏమి లేవు. మీనరాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో ఏలినాటి శని దశ లేదు.

మీన రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో రాహు కేతువుల వలన సంవత్సరం అంతా సంపూర్ణ ఆయుర్భాగ్యములు , సంతోషములు ఏర్పడును. రాహు కేతువుల వలన అన్ని వర్గముల వారికి సుఖమయ జీవనం ఏర్పరచును. (వ్యక్తిగత జాతకంలో రాహు – కేతువులు నీచ క్షేత్రంలో ఉన్నవారు మాత్రం వ్యతిరేక ఫలితాలు పొందుతారు.

– శ్రీ జనయిత్రి వాస్తు జ్యోతిష్యాలయం

Also Read : Horoscope Mesha Raasi Aries : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర మేష రాశి ఫలాలు

Also Read : Horoscope Vrushabha Raasi Taurus : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర వృషభ రాశి ఫలాల

Also Read : Horoscope Midhuna Raasi Gemini : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర మిధున రాశి ఫలాలు

Also Read : Horoscope Karkataka Raasi Cancer : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర  కర్కాటక రాశి ఫలాల

Also Read : Horoscope Simha Raasi Leo : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర  సింహ రాశి ఫలాలు

Also Read: Horoscope Kanya Raasi virgo : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర కన్యా రాశి ఫలాలు

Also Read : Horoscope Thula Raasi Libra : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర తులా రాశి ఫలాలు

Also Read :   Horoscope vruschika raasi scorpio : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర  వృశ్చిక రాశి ఫలాలు

Also Read : Horoscope Dhanassu Raasi saggitarius : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర ధనస్సు రాశి ఫలాలు

 Also Read : Horoscope Makara Raasi Capricorn : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర మకరరాశి ఫలాలు

Also Read : Horoscope Kumbha Raasi aquarius : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర కుంభరాశి ఫలాలు

Also Read : Horoscope Meena Raasi Pisces : 2021 – 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర మీనరాశి ఫలాలు

 

మరింత తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి.

 https://www.facebook.com/SirimalliPage