AP Job Calendar : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. జాబ్స్ క్యాలెండర్ విడుదల

AP Jobs Calendar : ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగుల పంట పండనుంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్టుగా జాబ్స్ క్యాలండర్ హామీని నెరవేర్చే విషయంలో ఏపీ ప్రభుత్వం ఓ అడుగు ముందుకు వేసింది. 10,143 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పాదయాత్ర చేశారు. ఆ సమయంలో పలువురు నిరుద్యోగులు.. తమ సాదక బాధకాలను చెప్పుకున్నారు. దీంతో చలించిన ఆయన తమ పార్టీ అధికారంలోకి వస్తే కచ్చితంగా ఉద్యోగాలు అన్నీ భర్తీ చేస్తామని చెప్పారు. ఏఏ ఉద్యోగాలకు ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తామో.. ఎప్పుడు ఆ ప్రక్రియ అంతా పూర్తవుతుందో నిరుద్యోగులకు స్పష్టత ఉండేలా ఏటా జాబ్ క్యాలండర్ ని కూడా విడుదల చేస్తామన్నారు. అన్నట్టుగానే ఇప్పుడు ఈ విషయంలో చొరవ తీసుకున్నారు.May be an image of 1 person and text

ప్రస్తుత పరిస్థితులు కానీయండి.. భవిష్యత్ అవసరాలనుకోండి.. ప్రభుత్వం మాత్రం మూడు రంగాల్లో ఉద్యోగాల భర్తీకి ప్రాధాన్యత ఇస్తోంది. విద్య, వైద్యం, పోలీస్ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి.. ఉద్యోగులను నియమించడం ద్వారా ఆయా శాఖలు బలోపేతమవుతాయి. దీనికోసం ఏపీపీఎస్సీ, పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు, డీఎస్సీ వంటి నియామక సంస్థల ద్వారా నోటిఫికేషన్లు విడుదల చేస్తుంది. పైగా ఈ ఉద్యోగాలన్నీ మెరిట్ ప్రాతిపదికనే ఉంటాయి. ఇందులో అవినీతి కాని, వివక్ష కాని ఉండకుండా పారదర్శకంగా నిర్వహించడానికి జగన్ సర్కార్ ముందే అన్ని చర్యలు చేపట్టింది.

గ్రూప్-1 తో పాటు గ్రూప్-2 ఇంకా అన్ని ఉద్యోగాల భర్తీలో ఇంటర్వ్యూల ప్రక్రియను ప్రభుత్వం రద్దు చేసింది. నిజానికి ఇదో విప్లవాత్మకమైన చర్యే అని చెప్పాలి. దీనివల్ల అవినీతి, లంచాలు, అక్రమాలకు ఏమాత్రం ఆస్కారం ఉండదు. రాతపరీక్షల్లో ఎవరైతే సత్తా చూపుతారో.. అలాంటి సమర్థులకే ఉద్యోగాలు దక్కే ఛాన్సుంది. ఈ ప్రక్రియ అంతా అలాగే ఉంటుంది. ఇక ఇలాంటి ఉద్యోగాలను భర్తీ చేయడానికి మరో మంచి నిర్ణయం కూడా తీసుకుంది. ఈ ఉద్యోగాల నియామకం కోసం నిర్వహించే పరీక్షల ప్రక్రియ సక్రమంగా ఉండేలా చర్యలు చేపట్టింది. ఐఐటీ, ఐఐఎంల సహకారంతో ఓ మంచి విధానాన్ని తయారుచేస్తుంది.

ఇప్పటికే గ్రామ వాలంటీర్ లతో పాటు మరికొన్ని ఉద్యోగాలను ఇవ్వడం ద్వారా వైసీపీ ప్రభుత్వం కొన్ని లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించినట్లయింది. ఇప్పుడీ కొత్త ఉద్యోగాలను జాబ్ క్యాలండర్ ద్వారా భర్తీ చేయడం వల్ల మరింత మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించినట్లవుతుంది. దీనివల్ల రాష్ట్రంలో కొంతమేర నిరుద్యోగ రేటు తగ్గడానికి ఛాన్సుంటుంది. పైగా ఈ కరోనా కష్టకాలంలో ఇలాంటి చర్యల ద్వారా ప్రభుత్వం.. నిరుద్యోగులకు కాస్తయినా ఆసరా ఇచ్చినట్టవుతుంది.

ఇవి కూడా చదవండి : 

Also Read : Immune Food : ఏ టైమ్ లో ఏం తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.. 40 ఏళ్లు దాటినా..

Also Read : Inspirational Story : బంగాళాదుంప, కోడిగుడ్డు, కాఫీ గింజల కథ వింటే మీకు ఎక్కడలేని ధైర్యం వస్తుంది..

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/SirimalliPage