Politics

Etela Rajendar : మంత్రి ఈటెలకి మరో షాక్.. మరో కేసుకి రంగం సిద్దం?

Etela Rajendar : మంత్రి ఈటెల రాజేందర్(Etela Rajendar).. ఇప్పుడు తెలంగాణలో మెయిన్ హాట్ టాపిక్.. మెదక్ జిల్లాలో అసైన్డ్ భూములను కబ్జా చేశారన్న ఆరోపణలపైన ఆయన పైన దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ఇందులో కొంతవరకు నిజం ఉందని మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ నేతృత్వంలోని బృందం గుర్తించింది.

ఇది జరిగిన కొద్దిసేపటికే ఆరోగ్య శాఖను చూస్తూ వచ్చిన ఈటెలను ఆ శాఖ నుంచి తప్పిస్తూ.. దానిని సీఎం కేసీఆర్ కి బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇదిలా ఉంటే.. సదరు భూముల కబ్జాతో పాటు ఇప్పుడు మరో కేసును ఈటెల పైన నమోదు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

No more portfolio for Etela Rajendra | TeluguBulletin.com
Etela Rajender

అటవీ భూములు ఆక్రమించి అర కిలోమీటరు మేర రోడ్డు వేశారని విచారణలో తేలింది. ఇందులో ఎక్కువ భాగం ఏపుగా పెరిగిన చెట్లను కొట్టేశారని, అయితే వాటిని అటవీ శాఖ అధికారుల అనుమతి తీసుకోకుండానే నరికేశారన్న అభియోగాన్ని మంత్రి ఈటెల, మరియి ఆయన అనుచరుల పైన కేసు నమోదు చేయనున్నట్లుగా తెలుస్తోంది. దీనిపైన త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.

అటు మంత్రి పదవి తొలిగింపు పైన ఈటెల చాలా ఆచితూచి మాట్లాడారు. తన మంత్రి పదవిని సీఎం తీసేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. సర్వాధికారాలు సీఎంకు ఉంటాయని వ్యాఖ్యానించారు. భూ కబ్జా పైన రిపోర్ట్ వచ్చిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడుతానని అన్నారు.

Also Read :