Cinema

Kathi Mahesh : సినీ విమర్శకుడు కత్తి మహేశ్ ఇక లేరు.. చెన్నైలో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

Kathi Mahesh : నటుడు కత్తి మహేశ్ మృతి చెందారు. కొద్ది రోజుల కిందట ఆయన నెల్లూరు దగ్గర జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. తరువాత చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కత్తి మహేశ్ (Kathi Mahesh) కు అన్ని రకాల వైద్య సేవలు అందించినా సరే.. పరిస్థితి విషమించడంతో ప్రాణాలు కోల్పోయారు.

సీటు బెల్టు పెట్టుకోకపోవడం వల్ల కత్తి మహేశ్ తల, ముక్కు, కళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. తరువాత నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యం చేసినా రిజల్ట్ కనిపించకపోవడంతో వెంటనే చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేర్పించి చికిత్సను అందించారు. చెన్నై అపోలో ఆసుపత్రిలో రెండువారాలుగా ట్రీట్ మెంట్ ఇచ్చినా ఫలితం లేకపోయింది.

ఫిల్మ్ క్రిటిక్ గా, నటుడిగా కత్తి మహేశ్ ఫేమస్ అయ్యారు. ఆమధ్య జరిగిన బిగ్ బాస్ లో కూడా పార్టిసిపెంట్ గా అందరి దృష్టినీ ఆకర్షించారు. కత్తి మహేశ్.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ నుండి ఫిలిం థియరీ లో డిగ్రీ చేశారు. 2011లో దేవరకొండ బాలగంగాధర తిలక్ రచించిన ఊరు చివర ఇల్లు కథను ఆధారంగా చేసుకొని ఒక షార్ట్ ఫిలిమ్ కి దర్శకత్వం చేశారు.

కత్తి మహేశ్ మిణుగురులు అనే చిత్రానికి సహ రచయితగా పనిచేశారు. పెసరట్టు అనే సినిమాను క్రౌడ్ ఫండింగ్ ఆధారంగా తీశారు. సంపూర్ణేష్ బాబు నటించిన హృదయ కాలేయం సినిమా లో ఓ చిన్న పాత్ర పోషించారు.

ఇవి కూడా చదవండి :

Also Read : Sonu Sood : 25 ఏళ్ల అమ్మాయి కరోనా చికిత్సకు.. ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేసిన సోనూసూద్

Also Read : Chandrababu Sonu Sood : చంద్రబాబు, సోనూసూద్ కలిసి త్వరలోనే..
తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి
https://www.facebook.com/SirimalliPage