Adipurush: ఆదిపురుష్ నుండి అదిరిపోయే అప్డేట్.. ఫస్ట్ లుక్ అప్పుడే..
Cinema Latest

Adipurush: ఆదిపురుష్ నుండి అదిరిపోయే అప్డేట్.. ఫస్ట్ లుక్ అప్పుడే..

Adipurush: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చాలాకాలం తర్వాత ‘రాధే శ్యామ్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘బాహుబలి’, ‘సాహో’లాంటి భారీ బడ్జెట్ బ్లాక్‌బస్టర్స్ తర్వాత రాధే శ్యామ్‌లాంటి పీరియాడిక్ లవ్ స్టోరీతో ప్రయోగం చేశాడు ప్రభాస్. ఇది ఒక విజువల్ వండర్ ప్రేమకథగా తెరకెక్కినా.. ప్రేక్షకులందరినీ మెప్పించలేక మిక్స్‌డ్ టాక్ మాత్రమే సాధించింది. అయితే మరోసారి ఆదిపురుష్ అనే మరో ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు ప్రభాస్.

పాన్ ఇండియా స్టార్ అనే రేంజ్‌ను సంపాదించుకున్న తర్వాత ప్రభాస్ కమర్షియల్ సినిమాలవైపు వెళ్లకుండా ప్రయోగాలకు కూడా ఛాన్స్ ఇస్తున్నాడు. నాగ్ అశ్విన్‌తో చేస్తున్న ‘ప్రాజెక్ట్ కె’, ఓం రౌత్‌తో చేస్తున్న ‘ఆదిపురుష్’.. ఇవి ప్రయోగాల ఖాతాలోకి వస్తాయి. దీంతో తొలిసారి తన కెరీర్‌లో ఓ బాలీవుడ్ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చాడు ప్రభాస్. అంతే కాకుండా అందులో రాముడిగా కూడా కనిపించనున్నాడు.

Also Read: https://www.sirimalli.com/today-29-march-2022-daily-horoscope-in-telugu/

ఆదిపురుష్ షూటింగ్ పార్ట్ ఎప్పుడో పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ దశలో ఉందీ సినిమా. పూర్తిగా గ్రాఫికల్ థీమ్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు విజువల్స్ చాలా సమయం పడుతుండడంతో ఆదిపురుష్ విడుదల తేదీని వచ్చే సంక్రాంతిగా నిర్ణయించింది మూవీ టీమ్. ఇప్పటివరకు యాక్టర్స్ షూటింగ్ పార్ట్ పూర్తయినప్పుడు ఫోటోలు తప్పా ఇప్పటివరకు ఆదిపురుష్ నుండి మరే అప్డేట్ రాలేదు. తాజాగా అప్డేట్‌కు ముహూర్తం ఖరారు అయినట్టు సమాచారం.

Adipurush Title Announcement Video: https://youtu.be/KM_L-6FxFLM

ఆదిపురుష్‌లో ప్రభాస్ రాముడి పాత్ర పోషిస్తున్నాడు కాబట్టి శ్రీరామనవమికి ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల కానుందన్న వార్త వైరల్‌గా మారింది. ఇదే వార్త గతేడాది కూడా వచ్చింది. గతేడాది శ్రీరామనవమికే ఆదిపురుష్ ఫస్ట్ లుక్ వస్తుంది అనుకున్న ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురయ్యింది. శ్రీరామనవమి ఏప్రిల్ 10న ఉండగా.. ఇప్పటికే ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఆదిపురుష్ ఫస్ట్ లుక్ రావాలని ఆశపడుతున్నారు.