Politics

TRSకి ఈటెల రాజీనామా… ? మరికాసేపట్లో ప్రెస్ మీట్..!

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ టీఆర్ఎస్(TRS) పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారు, మరికాసేపట్లో ఆయన మీడియా ముందుకు రానున్నారు.

తన భవిష్యత్తు కార్యాచరణ పైన స్పష్టం చేయనున్నారు. మెదక్ జిల్లాలో 66 ఎకరాల అసైన్డ్ భూములను ఈటెల కబ్జా చేసినట్లుగా తేలడంతో ఈటల రాజేందర్‌ను మంత్రి వర్గం నుంచి తొలగిస్తూ కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఈ నేపధ్యంలో ఈటెల పార్టీ మారనున్నారన్న ప్రచారం సాగుతుంది. అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఆయన టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.

అయితే టీఆర్ఎస్ కి రాజీనామా చేస్తే ఆయన వేరే పార్టీలోకి వెళ్తారా లేదా కొత్తగా ఏమైనా పార్టీ పెడతారా అన్నది చూడాలి!

Also Read :